25, ఫిబ్రవరి 2015, బుధవారం

పెళ్ళయిన కొత్తలో.....


'ఓ కప్పు కాఫీ పట్రా'
'ఒక్క క్షణంలో తెస్తాను వుండండి'
పదేళ్ళ తరువాత ..
'ఓ కప్పు కాఫీ ఇస్తావా?'
'ఓక్షణం ఆగండి. చేతిలో పని కాగానే పట్టుకొస్తాను'
మరో పదేళ్ళ తరువాత .....
'ఇదిగో! ఏమోయ్! తల నాదుగా వుంది. ఓ కప్పు కాఫీ ఏమైనా దొరుకుతుందా!'
'అదిగో. ఫ్లాస్క్ లో పోసి పెట్టాను. తాగండి'
ఇంకో పదేళ్ళ తరువాత....
'సరేగాని ఓ కప్పు కాఫీ...'
'ఏమిటి! ఏమిటీ అంటున్నారు. కాస్త గట్టిగా చెప్పండి''
'అబ్బే! ఏం లేదు. నేను కాఫీ పెట్టుకుంటున్నాను. నీకూ కావాలేమో అని. అంతే! అంతే!!'







(చట్టబద్ధమైన హెచ్చరిక: ఆడవారి కాలమానం అందరికీ ఒక్క లాగా వుండదు. కాలం కలిసిరాకపోతే ఈ మొత్తం సీనూ ఒక్క పదేళ్ళలోపే అనుభవం లోకి రావచ్చు' )

చిత్రకారులు 'శ్రీరామ్' గారికి కృతజ్ఞతలు  

3 కామెంట్‌లు:

  1. పెళ్ళయి ముఫై ఏళ్ళతో ఆపేశారు,ఏభయిలు దాటిన మాలాటివాళ్ళకి ఇక దారి లేనట్టే :)

    రిప్లయితొలగించండి
  2. శర్మ గారూ, పెళ్ళైన ముప్పై ఏళ్ళకి కోడలు వచ్చే అవకాశం వుంటుంది కదండీ. అప్పుడు పై సీనుల డయలాగులు కోడలు చెప్తుందేమోలెండి !
    (ఒకవేళ కోడలు లేకపోతే భండారు వారి పై కధని రోజూ గుర్తు చేసుకుంటూ కాలక్షేపం చేసెయ్యటమే :) )

    రిప్లయితొలగించండి
  3. శర్మ గారూ, పెళ్ళైన ముప్పై ఏళ్ళకి కోడలు వచ్చే అవకాశం వుంటుంది కదండీ. అప్పుడు పై సీనుల డయలాగులు కోడలు చెప్తుందేమోలెండి !
    (ఒకవేళ కోడలు లేకపోతే భండారు వారి పై కధని రోజూ గుర్తు చేసుకుంటూ కాలక్షేపం చేసెయ్యటమే :) )

    రిప్లయితొలగించండి