హోటల్లో మీటింగు కాగానే హ్యాండు బ్యాగు తీసుకుని బయటకు వచ్చాను. వస్తూనే కారు తాళాల కోసం చూసుకుంటే అవి కనిపించలేదు. బ్యాగు తీసి చూసాను, కనిపించలేదు. మీటింగు జరిగిన హాల్లోకి వెళ్ళి వెతికాను. లేవు. అక్కడి సిబ్బందిని వాకబు చేసాను. తెలియదన్నారు. సడెన్ గా గుర్తుకు వచ్చింది. తాళాలు కారులోనే వొదిలిపెట్టి వుంటాను. పైగా నాకది అలవాటు కూడా.
పొరపచ్చాలు లేని
దాంపత్యం మాది. ఈ ఒక్క విషయంలోనే నాకూ ఆయనకూ పడదు. 'తాళాలు కారులో వొదలవద్దు' అని అస్తమానం
సతాయిస్తుంటారు. నాకేమో అవి అక్కడ వుంటేనే సేఫ్ అనిపిస్తుంది. ‘కారులోనే తాళాలు
వుంచితే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టే’ అన్నది మావారి థియరీ. కాని ఈ విషయంలో నా దారి నాదే. ఆయన గోల ఆయనదే.
పార్కింగ్ లో చూస్తే
కారు కనబడలేదు. మా వారి మాటే కరెక్ట్ అయింది.
కారు పోయిందని
తెలియగానే కాళ్ళల్లో వొణుకు మొదలయింది. హోటల్ వాళ్లకు చెప్పి పోలీసులకు ఫోను
చేసాను. యేకళన వున్నారో నేను చెప్పినవన్నీ వెంటనే నోటు చేసుకున్నారు. కారు నెంబరు, పోయిన చోటు అన్నీ
చెప్పాను. కారులోనే తాళం చేతులు మరచిపోయిన సంగతి కూడా చెప్పేసి, 'ఎవడో
పట్టుకుపోయివుంటాడు' అన్న అనుమానం కూడా
వెల్లడించాను. దొంగతనం గురించి చెబుతుంటే మా వారు గుర్తుకువచ్చారు. ఆయన సతాయింపు
గుర్తుకువచ్చి చెప్పాలా అక్కరలేదా అనుకుంటూనే మా వారికి ఫోను చేసాను.
‘హలో హనీ!’
ఇలాటి చిక్కు
పరిస్థితులు ఎదురయినప్పుడు ఆయన్ని నేను అలానే పిలుస్తాను.
“నువ్వు రోజూ
చెప్పేదే ఇవాళ నిజమయింది. కారులో తాళాలు పెట్టి మీటింగుకు వెళ్లాను. వచ్చి చూస్తే
పార్కింగులో కారు కనిపించలేదు.’
కాసేపు నిశ్శబ్ధం.
బహుశా కోపం కొద్దీ లైన్ కట్ చేసివుంటారు.
ఇంతలో ఆయన గొంతు
వినిపించింది.
‘ఇడియట్! నువ్వు
కారులో వెళ్ళలేదు. నేనే నిన్ను హోటల్ దగ్గర డ్రాప్ చేసి వచ్చాను. అది
మరచిపోయావా?’
నిజమే. ఇక ఏం
చెప్పను. నేను కారు తీసుకురానిమాట నిజమే. అమ్మయ్య అనుకున్నాను.
‘సరే లెండి. ఏదో
మతిమరపు. వెంటనే బయలుదేరి రండి. ఇంటికి పోదాం’ అన్నాను.
‘యెలా రమ్మంటావు? ఈ కారు మాదే, దొంగ కారు కాదు మొర్రో అని ఎంతసేపటి నుంచో మొత్తుకుంటున్నాను. అయినా ఈ పోలీసులు వినిపించుకోవడం లేదే!’
‘యెలా రమ్మంటావు? ఈ కారు మాదే, దొంగ కారు కాదు మొర్రో అని ఎంతసేపటి నుంచో మొత్తుకుంటున్నాను. అయినా ఈ పోలీసులు వినిపించుకోవడం లేదే!’
(ఇంగ్లీష్ గల్పికకు స్వేచ్చానువాదం)
NOTE: Courtesy Cartoonist
మరీ అంత అగ్నానమా?
రిప్లయితొలగించండి