ఏకాంబరం
ప్రియురాలిని అడిగాడు, ఎలాటి పుస్తకాలు ఇష్టమని. ఆమె తటాలున జవాబు చెప్పింది 'చెక్
బుక్స్'
"కోతికీ మనిషికీ
తేడా ఏమిటి?"
"కోతికి కల్లు
తాగించినా అది మనిషిలా ప్రవర్తించలేదు"
"మంచి లాయరుకీ
గొప్ప లాయరుకీ తేడా ఏమిటి?"
"మంచి లాయరుకి
'లా'తెలిసుంటుంది. గొప్ప లాయరుకి 'జడ్జ్' తెలిసుంటాడు"
"ఆడవాళ్ళ
విషయంలో అర్ధం కాని విషయం ఒకటి చెప్పు"
"మొన్న
ఆసుపత్రికి వెడితే అందమైన నర్సు నా చేతిని కాసేపు పట్టుకుని నాడి చూసింది. అదేమిటో
చిత్రం, అలా చేయిపట్టుకుని చూసి, పైగా 'నాడి ఎందుకిలా కొట్టుకుంటోంద'ని నన్నే
అడిగింది"
ఆఫీసరు కొత్తగా
చేరిన ఉద్యోగితో అన్నాడు.
"ఇక్కడ
పరిశుభ్రతకు పెద్ద పీట వేస్తాం. నువ్వులోపలకి వచ్చేటప్పుడు డోర్ మ్యాట్ మీద బూట్లు
శుభ్రంగా తుడుచుకుని వచ్చావా?"
"అవునండీ!"
"అలానా! మేము
మరో విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటాము.
ఇక్కడ పనిచేసేవాళ్ళు నిజం చెబుతున్నారా అబద్దం చెబుతున్నారా అని. అసలా గుమ్మం
దగ్గర డోర్ మ్యాటే లేదు"
"కుక్కలు
ఎందుకు పెళ్లి చేసుకోవు"
"ఇదో ప్రశ్నా!
ఎందుకంటె వాటిది అప్పటికే కుక్క బతుకు"
"తల్లికీ భార్యకూ
తేడా?"
"తల్ల్లి
ఏడుస్తున్న నిన్ను ఈ లోకంలోకి తెచ్చిపడేస్తుంది. రెండో ఆవిడ నువ్వు జీవితాంతం ఆ
ఏడుపు ఆపకుండా కనిపెట్టి చూస్తుంది"
"మగ సెక్రెటరీకి
ఆడ సెక్రెటరీకి తేడా?"
"మగ సెక్రెటరీ ఆఫీసుకు వెళ్ళగానే బాసుకు
'గుడ్ మార్నింగ్' చెబుతాడు. ఆడ సెక్రెటరీ 'ఇక లేవండి బాస్ తెల్లారింది' అంటుంది"
(యధావిధిగా ఇంగ్లీష్ జోకులకు అనువాదం)
ఓహోహో...
రిప్లయితొలగించండిబాగున్నాయండీ...