చక్రపాణి
గారితో పరిచయం తెలంగాణా ఉద్యమ కాలంలో. అదీ టీవీ చర్చల్లో. తెలంగాణా వాదాన్ని ఆయన
ఘంటా పదంగా వినిపించేవారు. నాది మధ్యేమార్గం. అది మా స్నేహానికి ఏనాడు
అడ్డురాలేదు. ఆయన వాదమే నిలబడింది. నెగ్గింది. ఉద్యమం విజయం సాధించి తెలంగాణా కల సాకారమైంది.
తదనంతర కాలంలో ఆయన కృషికి గుర్తింపుగా కేసీఆర్ ప్రభుత్వం చక్రపాణి గారిని రాజ్యాంగబద్ధమైన
పదవిలో, పబ్లిక్ సర్వీసు కమిషన్ చైర్మన్ గా నియమించింది. తనకు అప్పగించిన
బాధ్యతలను ఆయన సక్రమంగా నిర్వర్తించారు.
మళ్ళీ
ఇప్పుడు తెలంగాణా రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆయన సమర్థతను
గుర్తించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఘంటా చక్రపాణి గారిని బాబా సాహెబ్
అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ గా నియమిస్తూ ఈ రోజు
ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన ఈ పదవిలో మూడేళ్లు కొనసాగుతారు. రెండు విభిన్న
పార్టీలకు చెందిన ప్రభుత్వాలు, చక్రపాణి గారి చిత్తశుద్ధిని గుర్తించి తగిన
పదవులతో సత్కరించడం ఒక విశేషం అయితే, తాను పనిచేస్తున్న విశ్వ విద్యాలయానికే అధిపతి కావడం మరో విశేషం.
ఘంటా
చక్రపాణి గారికి అభినందనలు.
కింది ఫోటో:
ఎడమనుంచి కుడికి: నేను, ఘంటా చక్రపాణి, జ్వాలా నరసింహారావు, అల్లం నారాయణ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి