మొన్న మధ్యాహ్నం భోజనాలు అయ్యాక, ఓటీటీ లో ఓ అర్థం కాని సినిమా చూసిన తర్వాత బయటకి పోదాం అన్నారు. కారు డిక్కీలో చాలా సామాను సదిరారు.
ఇంటికి తిరిగి వచ్చేసరికి పొద్దు పోతుందేమో అనుకున్నా. పైగా శుక్రవారం సాయంత్రం కూడా.
నేరుగా ఒకచోటికి వెళ్ళాము. అక్కడ వరుసగా కార్లు ఆగి ఉన్నాయి. వాటి నుంచి ఏవో సామాన్లు దింపుతున్నారు.
మా వంతు వచ్చింది. డిక్కీ నుంచి ఇంటి నుంచి తెచ్చిన సామాగ్రి అంటే అంతగా వాడని షూస్, కోట్లు, దుస్తులు, పిల్లల బొమ్మలు, డెకొరేటివ్ గాజు వస్తువులు ఇలా ఎన్నో రకాలు.
తర్వాత పక్కనే వున్న GOOD WILL మాల్ లోకి వెళ్ళాము. అక్కడ లేని వస్తువు అంటూ లేదు. అవన్నీ నగర పౌరులు తమకు అట్టే ఉపయోగపడని, అవసరంలో వున్నవారికి ఇవ్వడానికి వీలుగా డొనేట్ చేస్తారు. గుడ్ విల్ కంపెనీ వాటిని శుభ్రం చేసి, కొత్త వాటికి ఏమాత్రం తీసిపోకుండా వున్న క్వాలిటీతో, అవసరం వున్నవారికి అతి తక్కువ ధరకి విక్రయిస్తారు. ఆర్థికంగా వెనుకబడిన వారికోసం ఈ ఏర్పాటు. కంపెనీకి వచ్చిన ఆదాయాన్ని ఛారిటీకి ఇస్తారు. చాలా చౌకగా దొరికే ఈ షాపులో కొనుగోళ్లు చేయడానికి విరగబడతారని అనుకున్నా కానీ నా అభిప్రాయం తప్పయింది.
బయటకు వస్తున్నప్పుడు మా వాడు ఒక మాట చెప్పాడు, ఇన్నేళ్లుగా ఇక్కడ వుంటున్నా కూడా ఈ మాల్ లోకి అడుగు పెట్టడం ఇదే మొదటిసారి అనీ, మీరు రాసుకోవడానికి ఏదైనా మ్యాటర్ దొరుకుతుంది అనే ఉద్దేశ్యంతో తీసుకు వచ్చాను అని.
తరువాత మార్షల్స్ అనే ఓ పెద్ద దుకాణానికి వెళ్ళాము. సైజులో కానీ, వస్తువుల లభ్యతలో కానీ, నాణ్యతలో కానీ, సిబ్బంది వ్యవహార శైలిలో కానీ రెండు మాల్స్ లో ఎలాంటి తేడా కనపడలేదు, ఒక్క ధరవరల విషయంలో తప్పిస్తే.
తోక టపా:
ముప్పయ్యేళ్ళ క్రితం మేము మాస్కో వెళ్ళినప్పుడు రేడియో మాస్కో వాళ్ళే ఇల్లు, ఇంటికి కావాల్సిన సామాను అన్నీ సమకూర్చారు. కొంత కాలం గడిచిన తర్వాత ఎంత కాలం ఈ పాత సామాను అనుకుని ముందు ఒక ఫ్రిజ్ కొన్నాము. మాస్కో పోయేంతవరకూ మాకు ఫ్రిజ్ లేదు. అక్కడ ప్రతీదీ కారు చవకే కాబట్టి అలా వెళ్లి ఇలా కొనేసాము. కొన్న తర్వాత పాత ఫ్రిజ్ ఏం చేయాలనే మీమాంస ఎదురయింది. మాస్కో రేడియో వాళ్ళు రిటర్న్ చేయక్కర లేదన్నారు. ఆ అపార్ట్ మెంట్లో ఏదైనా సమస్యలు ఎదురయితే వచ్చి బాగు చేయడానికి ఒక మనిషి వున్నాడు. అతడిని పిలిచి ఫ్రిజ్ తీసుకోమని అంటే అతడు మమ్మల్ని ఎగాదిగా చూసి, డస్ట్ బిన్ లో పడేయమని సలహా ఇచ్చి వెళ్ళిపోయాడు.
ఎంత ఖరీదు అయిన వస్తువు అయినా కూడా ఉచితంగా ఇస్తే ఎవరూ తీసుకోరని అర్థం అయింది.
కింది ఫోటోలు:
మొదటి రెండు GOOD WILL MALL
చివరి రెండు
MARSHAL'S MALL
వేసుకోవడానికి రెండు జతల బట్టల ఉంటే చాలనుకొనే స్థితి నుండి ఎన్నున్నా అబ్బే బట్టలు లేనేలేవండీ అనే కాలానికి వచ్చేసాము :)
రిప్లయితొలగించండిbabu ...తెలంగాణా లో కేసీఆర్ తంతే అమరావతి వచ్చి పడ్డావు .. కరకట్ట మీద కృష్ణమ్మ తంతే బెజవాడ వచ్చి పడ్డావ్
రిప్లయితొలగించండికొంచమన్నా ఇంగిత జ్ఞానం ఉందా?? ఈ పోస్ట్ లో వుండే విషయం ఏమిటి? దానికి మీ కామెంట్ దేని గురించి?? మీ మెదడు లో తప్ప ఈ రెండూ ఎక్కడ లింక్ అవుతాయో??
తొలగించండిఇది బాబు గారి పట్ల ద్వేషాన్ని వెళ్లగక్కే కామెంట్.
రిప్లయితొలగించండితన్ని పంపించడానికి KCR ఎవరు. పార్లమెంటు చట్టం చేసి రాష్ట్రాన్ని విభజిస్తే తన రాష్ట్ర భాగానికి బాబు వచ్చేసాడు. అంతే. సింపుల్.
బాగా చెప్పారు.
తొలగించండిమీరు అమెరికాలో ఉండి మాస్కో సంగతులు చెబితే యుక్రెయిన్ వాళ్లకు కోపం వస్తుందేమో.🙃
రిప్లయితొలగించండి