ఈ మధ్య ఎక్కువగా వినపడుతున్న పదం జేసీబీ. (JCB). మట్టి గుట్టలను తవ్వే ఒక భారీ యంత్రం. కానీ ప్రస్తుతం దీన్ని అనుమతులు లేకుండా నిర్మించిన నిర్మాణాలను కూల్చడానికి ఉపయోగిస్తున్నారు. అదిగో పులి అంటే జనాలు భయపడినట్టు, జేసీబి కనపడగానే హైదరాబాదులో కొందరు కాలనీ వాసులు ఉలిక్కి పడుతున్నారు.
ఇంతకీ జేసీబీ అంటే ఏమిటి అర్థం?
ట్రాక్టర్ అంటే పొలాలు దున్నే యంత్రం. మరి జెసీబీ అంటే కూల్చే యంత్రమా! ప్రస్తుతానికి అదే అర్థంలో ఈ పదాన్ని అర్థం చేసుకుంటున్నారు.
నిజానికి JCB అంటే:
Joseph Cyril Bomford
ఈ పేరు కలిగిన ఒక ఆంగ్లేయుడు ఇంగ్లాండ్ లో 1945 లో ఈ యంత్రాలు తయారు చేసే కర్మాగారాన్ని తన పేరుతో నెలకొల్పాడు.
ఆ పేరుతోనే ఈ యంత్రాలు ప్రపంచ వ్యాప్తంగా చెలామణిలోకి వచ్చాయి.
ఒక్కొక్కటి సుమారు నలభై, యాభయ్ లక్షలు ఖరీదు చేసే ఈ జేసీబీలు, కోట్ల రూపాయలు ఖరీదు చేసే అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నాయి.
చిత్రం లో ఉన్నది JCB కాదండి, Poclain. దీన్నే మీడియా వాళ్ళు పొక్లైనర్ అని కూడా వ్రాస్తున్నారు. దీనికి Bucket, Chisel లాంటి attachments మార్చుకోవచ్చు.
రిప్లయితొలగించండిJCB, Poclain, Bull dozer, Wheel loader, Hydra, Fork lift లాంటి వాటికి తేడాలు ఉన్నాయి.
ఫొటో అందుబాటు చూసి పెట్టింది. నా రైటప్ జేసీబీ గురించేనండి
రిప్లయితొలగించండి