లేక్ మిచిగాన్ - భండారు శ్రీనివాసరావు
బాల్టి మోర్ చేరడానికి ఇంకా గంటన్నర విమాన ప్రయాణం ఉందనగా నిద్ర లేచిన మా కోడలు భావన, అదేమిటి పాపా మీరు రాత్రల్లా మేలుకునే వున్నారా అని అడిగింది.
నా దగ్గర జవాబు ఏముంటుంది? ఇది నాకు అలవాటే అని చెప్పలేకపోయాను.
డెల్టా విమానం వెళ్ళే మార్గం ఎదురుగా వున్న చిన్న టీవీ తెరపై కనపడుతూ వుంది. అదేమిటో వెయ్యి కిలోమీటర్ల దూరం దాటివచ్చినట్టు, ప్రస్తుతం అమెరికాలోనే పెద్ద సరస్సు లేక్ మిచిగాన్ మీదుగా వెడుతున్నట్టు ఆ టీవీలో కనపడుతోంది. ఇంకా విచిత్రం ఏమిటంటే అమెరికాలో పెద్ద నగరాలు అయిన డెన్వర్, చికాగో వంటి నగరాల పక్కగా ప్రయాణం సాగుతోంది అనిపిస్తోంది. కానీ ఆ నగరాలు వందల మైళ్ళ దూరంలో వుండవచ్చు. కొన్ని వేల అడుగుల పైనుంచి తీసిన ఉపగ్రహ ఛాయాచిత్రం కావడం చేత నేను అలాంటి భ్రాంతికి గురై వుండవచ్చు.
చూస్తుండగానే లేక్ మిచిగాన్ కూడా దాటినట్టే వుంది.
సరే కానీ మైళ్ళ కొద్దీ విస్తరించిన ఈ చెరువులు కబ్జాకు గురి కాకుండా ఎలా మనుగడ సాగిస్తూ వున్నాయబ్బా!
కారణం ప్రభుత్వాలా! ప్రజలా!
// "అమెరికాలోనే పెద్ద సరస్సు లేక్ మిచిగాన్ ...... "//
రిప్లయితొలగించండికాదండి, "Great Lakes" జాబితాలో ఉంది గానీ అమెరికాలోనే పెద్ద సరస్సు కాదు. అమెరికాలో అన్ని సరస్సులలో పెద్దది లేక్ సుపీరియర్ (31,700 sq miles). మిన్నెసోటా రాష్ట్రంలో డులుత్ అనే ఊరి దగ్గర బాగా చూడచ్చు (Lake Superior, Duluth City, Minnesota State).
22,300 sq miles విస్తీర్ణంతో లేక్ మిచిగాన్ (Lake Michigan) అమెరికాలో మూడవ పెద్ద సరస్సు.
అమెరికా లో ఉన్న మన వారికి మంచి ఐడియాస్ వస్తాయేమో సర్ ఇప్పుడు 🤣 (సరదాగా, అన్యధా భావించవలదు)
రిప్లయితొలగించండి