17, సెప్టెంబర్ 2024, మంగళవారం

తిన్నడి మార్గమే తిన్నని మార్గం



పురాణాల్లో చక్కటి నీతి కధలు వున్నాయి. పురాణాలు కధలా అనే వాదన తేకండి. అవన్నీ మనిషి మనిషిలాగా ఎలా జీవించాలి అని చెప్పేవే.
చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా అన్నారు. అంటే ఏమిటి దైవాన్ని అర్చించడానికి మడులు దడులు అక్కరలేదు. ఈ విషయం మనకు కిరాతార్జునీయం గాధలో స్పష్టంగా కనబడుతుంది. శుచిగా వండిన ప్రసాదాల కంటే ఆ పరమేశ్వరుడికి భక్తితో తిన్నడు సమర్పించిన మాంస ఖండాలే ప్రీతికరం అంటూ పెద్దలు బోధించిన నీతి కధలు వింటూ పెరిగిన తరానికి కూడా మంచి వాక్యాలు రుచించడం లేదు. ఇదొక విషాదం.

18 కామెంట్‌లు:

  1. మీ ఆలోచన సరికాదు. దైవాన్ని అర్చించడానికి శుచి మడి అవసరమే. Kannappa is an exception and not a norm. మాంసం దైవానికి నివేదించడం నిషిద్ధం. గురువులు శాస్త్రం చెప్పిన వైదిక ఆచారాలు పాటించాలి. తొందరపడి తప్పుగా అన్వయం చేయడం సరికాదు.

    అసలైన విషాదం ఏమిటంటే మీ వంటి పెద్దలు కూడా దైవార్చన సంప్రదాయం అర్థం చేసుకోలేక పోవడం.

    రిప్లయితొలగించండి
  2. ఈ పోస్ట్ యాదృచ్ఛికమేనా?

    రిప్లయితొలగించండి
  3. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగం జరిగినట్టుగా వార్త వ్యాపిస్తుంది. దశాబ్దాల పాటు నాణ్యమైన
    నందిని నెయ్యి కర్ణాటక నుంచి సప్లయి చేసేవారు. వారు రేటు పెంచారని వేరే వారి వద్ద నెయ్యి తీసుకున్నారు. ఇది తప్పు నిర్ణయం.

    లడ్డూ రుచి తగ్గిపోవడం కొన్ని ఏళ్ళుగా గమనించాము.

    భక్తుల మనసు గాయపడింది.

    అసలు మార్కెట్ లో అమ్ముతున్న నెయ్యి, వంట నూనెలు, దీపారాధన నూనెలు 100% స్వచ్చత ఉన్నాయా అనేది అనుమానమే. పాల్మ్ ఆయిల్, వెజిటబుల్ ఫాట్ కలుపుతారు అని తెలుస్తుంది. లేకపోతే 2.5 కిలోలపల్లీలు నుంచి ఒక లీటరు వేరుశనగ నూనె వస్తుంది 150 రూపాయలకు ఎలా ఇస్తున్నారు. స్వచ్చమైన ఆవునేయి 400-500 రు లీటరు ఇవ్వడం సాధ్యం కాదు. అయినా మర్కెట్ లో దొరుకుతుంది.

    అయితే ఈ విషయం రాజకీయ వివాదం చేయడం సరికాదు . విచారణ జరిపి ఈ అపచారానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అసలు దేవాలయాలను ప్రభుత్వ నియంత్రణ నుంచి తప్పించి స్వతంత్ర సనాతన ధర్మ సంస్థకు అప్పగించాలి. ఇతర మతాల ప్రార్థనా స్థలాలపై ప్రభుత్వ ఆధిపత్యం లేదు. కేవలం హిందూ దేవాలయాలపై ప్రభుత్వ అజమాయిషీ ఎందుకు. ఇదేనా సెక్యులరిజం అంటే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అసలు గోవులకు, గేదెలకు ఉపయోగించే పశుగ్రాసం ఎలా ఉంటోంది. పాడి పశువులకు పెట్టే ఆహారం స్వచ్చంగా ఉన్నదా ఏ పదార్థాలు ఆహారంగా ఇస్తున్నారు అని కూడా సర్వే జరగాలి. కొన్ని చోట్ల ఎక్కువ పాలు కోసం అనైతిక పద్ధతులు కూడా కొంతమేరకు జరుగుతుంది అని తెలుస్తుంది.
      ఇవన్నీ మహ పాప కార్యం.

      జరిగిన అపచారం ప్రాయశ్చిత్తంగా అందరూ పంచగవ్యం తీసుకోవాలి అని చెబుతున్నారు

      తొలగించండి
    2. పంచగవ్యానికి మార్కెట్టు పెంచేటట్టున్నారే ? అందులో ఇంకా యేమేమి కల్తీయో ?

      తొలగించండి
    3. కల్తీ చేసినవారు పంచగవ్యం తీసుకోవాలి గానీ “అందరూ” ఎందుకు తీసుకోవాలి?

      తొలగించండి
    4. తిలాపాపం తలా పిడికెడు :)

      తొలగించండి
    5. यत्त्वगस्थिगतं पापं देहे तिष्ठति मामके।
      प्राशनं पञ्चगव्यस्य दहतु

      శరీరంలో ఆహారం ద్వారా నిషిద్ధ పదార్థం వస్తే పంచగవ్యం తీసుకోవడం ద్వారా శుద్ధి అవుతుంది అని తెలుస్తుంది.

      తొలగించండి
    6. ఈ అజ్ఞాత పంచగవ్యానికి బ్రాండ్ అంబస్సడర్ లా వున్నారు‌:)

      తొలగించండి
    7. నాకొకటి అర్దం కావట్లేదు.. వెన్న తీసిన తర్వాత ఆ పాలు పడేయరు కదా.. వాటికి ధర పలుకుతుంది.. మరి నెయ్యి ఖరీదు మరీ ఎందుకు ఎక్కువ ఉండాలి... ఆవు అని పేరు చెప్పి ఇదో వ్యాపారం

      తొలగించండి
  4. రాజకీయ కారణాలతో ఆరోపణలు చేసిన వారు అది ప్రచారం చేస్తున్న వారు అవి తప్పు అయితే ఫలితం అనుభవించక తప్పదు. ఏ నాయకుడు లేదా అధికారులు ఉద్దేశ్య పూర్వకంగా అపచారం చేయరు. ముడి సరుకులు కొనడానికి ఒక కట్టుదిట్టమైన వ్యవస్థ తితిదే వారు ఏర్పాటు చేశారు. నాణ్యతలేని నెయ్యి సరఫరా చేసిన వారిపై చర్యలు తప్పక తీసుకుంటారు. L1 బిడ్డర్ కు టెండర్ ఇచ్చే పద్ధతిలో మార్పులు చేసి నందిని, విజయ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు నుంచి మాత్రమే నెయ్యి కొనుగోలు చేస్తే మంచిది. నాణ్యత పరీక్షలు కట్టుదిట్టం గా చేసే వ్యవస్థ ఉండాలి.

    రిప్లయితొలగించండి
  5. ఏది ఏమైనా ముఖ్యమంత్రి గారు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు అని నా అనుమానం..
    ప్రతీరోజూ పరీక్షలు చేస్తున్నారు.. రిజెక్ట్ చేస్తున్నారు.. వాడితే కదా ప్రాబ్లం...
    రాజకీయ లబ్ధి కోసం... హెరిటేజ్ కోసం ఆరాటం

    రిప్లయితొలగించండి
  6. అన్నవరం, సింహాచలం, భద్రాచలం, శ్రీశైలం, యాదాద్రి, ద్వారకా తిరుమల ... ఇలా అన్ని పవిత్ర క్షేత్రాలలో ప్రసాదాల ఉత్పత్తి లో ఉపయోగిస్తున్న నెయ్యి , ఇతర దినుసులు కూడా నాణ్యత పరీక్ష చేసి స్వచ్ఛమైన ముడి పదార్థాలు మాత్రమే వాడే విధంగా చర్యలు తీసుకోవాలి. ఓం నమో వేంకటేశాయ నమ:

    రిప్లయితొలగించండి
  7. ఏడు కొండల వాడి ప్రసాదం అపవిత్రం కావదం అనేది ఒక చాలా గంభీరమైన సమస్య.
    ------------------
    ఈ అపవిత్రత సుబ్బారెడ్ది ఒక్కడి వల్ల వచ్చింది కాదు.అవినీతి సంపాదన పట్ల ఆకర్షణ హిందూ సమాజంలో చాలా కాలం నుండి కనుపిస్తుంది. అసలు, ఎంత మంది వాళ్ళు రోజు తీసుకునే పాలు, అ పాలు ఇచ్చే తల్లులు, ఆవులు మరియు గేదెలు, పాల పరిశ్రమకు లాభదాయకం కానందున వెంటనే వాటిని జంతువధశాలకు పంపుతారని తెలిసిన తర్వాత్ కూడా లైట్ తీసుకుంటునే ఉంటున్నారు?
    ఎంతోమంది హిందులు, బ్రాహ్మణుల కూడా, ఉద్యోగాన్ని కాపాడుకోవటానికి మాంసభక్షణం చేస్తున్నారు.అందరికీ ఉద్యోగం అంటే ప్రధాన లక్ష్యము అయిపోయింది.పోటులో ఉన్నది బ్రాహ్మణులే కదా!భక్తులు నాలుగేళ్ళ నుంచీ వాసన పసిగట్టి గొడవ చేస్తున్నప్పుడు వాళ్ళెందుకు తిరగబదలేదు - తిరగబడితే ఉద్యోగం పోతుందని,కదా!గతంలో మన బ్రతుకు మన చేతిలో ఉండేది. కేవలం ఉద్యోగమే కాదు కాని ప్రతి కుటుంబం ఒక రాజ్యంలా ఉండేది.సామ్మనస్య సూక్తాన్ని మర్చిపోయి ఆ స్వతంత్రతని కోల్పోయిన మనం ఈ రోజు అడవి జంతువులలా జీవిస్తున్నాము.
    ఇదే వాస్తవం, మరియు మనం ఇతర మతాల పేర్లను చెప్పి, అ మతాల భక్తులు మనకు మరియు మన దేశాంకి శత్రువులని పదేపదే చెబుతున్నప్పుడు మనం అసలు నిజానికి దూరం అయిపోతున్నాము. అనవసరంగా అగ్నికి ఆజ్యం పోస్తున్నాం - వైదిక విద్యని పైకి తీసి అందరికీ నేర్పేవరకు ఈ దేశం బాగుపడదు.
    జై శ్రీ రామ్!

    రిప్లయితొలగించండి
  8. లడ్డూ గొడవ లో తెలుగు ప్రజల సంయమనాన్ని మెచ్చుకోవాలి .. అక్కడెక్కడో మధ్య ప్రదేశ్ లో దిష్టిబొమ్మల దహనాలు జరుగుతున్నాయి .. ఇక్కడి వాళ్ళకు బాబు గారి రాజకీయాలు అర్ధమై ఉండవచ్చు

    రిప్లయితొలగించండి
  9. People in responsible positions should be very careful before making sweeping allegations without thorough investigation. Especially in divine matters as it has far reaching consequences and hurts the feelings of crores of devotees.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. https://www.indiatoday.in/india/law-news/story/supreme-court-observation-andhra-pradesh-tirupati-temple-laddu-row-2608641-2024-09-30

      తొలగించండి