18-21-11.40
భండారు శ్రీనివాసరావు
అమెరికా అనేది అగ్ర దేశమే కాదు వింతలు విడ్డూరాల గడ్డ అనిపిస్తుంది కొన్ని కొన్ని వింటుంటే. విన్నవాటిలో నిజమెంతో కానీ, నిజమా అనిపించక మానదు. బాల్య కౌమార యవ్వన వృద్ధాప్య అవస్థల మాదిరిగా ఇక్కడ మనిషి జీవితంలో ప్రతి దశకు కొన్ని వయసు నిబంధనలు. అన్ని రాష్ట్రాలలో వీటి తీరు ఒక్కతీరుగా వుండక పోవడం మరో విడ్డూరం. దేనికి దానికి నిబంధనలు ప్రత్యేకం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేయడానికి కనీస వయసు 21. డ్రైవింగ్ లైసెన్స్ కు 18. కొన్ని చోట్ల 16 ఏళ్లు సరిపోతాయిట. ఇక్కడ కారు లేకపోయినా, కారు నడపలేకపోయినా జీవితం క్లిష్టతరం అవుతుంది కాబట్టి ఈ వెసులుబాటు అంటారు. అయితే 18 ఏళ్లకు డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారు కానీ 21 ఏళ్లు వచ్చేవరకు అర్ధరాత్రుళ్ళు కారు నడపకూడదు. ఒకవేళ అలా నడిపి ఆక్సిడెంట్ చేస్తే నేరమే కాకుండా వెహికిల్ ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ చేయలేరు.
కిందటి నెలలో మాకు తెలిసిన వాళ్ళ పిల్లలు రాత్రి పదకొండున్నరకు ఎక్కడో డిన్నర్ చేసి ఇంటికి తిరిగి వెడుతున్నారు. వాళ్లకు డ్రైవింగ్ కొత్త కాదు. అన్ని రకాల కార్లు నడపడంలో ప్రావీణ్యం వుంది. లైసెన్సులు కూడా వున్నాయి. కాకపోతే ఎవరికీ 21 నిండలేదు. మరో పది నిమిషాల్లో ఇల్లు చేరుతారు అనే సమయంలో, అడవి మార్గం కావడం వల్ల రోడ్డు మీద అడ్డంగా వచ్చిన ఓ జంతువును తప్పించబోయే ప్రయత్నంలో కారు అదుపు తప్పి రోడ్డు పక్కన గోతిలోకి జారిపోయి తలకిందులు అయింది. కార్లో వున్న ముగ్గురు సీటు బెల్టులు పెట్టుకోవడం వల్ల ఎవరికీ ఏమీ కాలేదు. అడవి కావడం వల్ల మొబైల్ సిగ్నల్స్ లేవు. కాకపోతే, ప్రమాదం ఇంపాక్ట్ కు ఎయిర్ బ్యాగ్ బెలూన్లు తెరుచుకున్నాయి. అలా తెరుచుకోవడంతో ఆటోమేటిక్ గా ప్రమాదం ఎక్కడ జరిగింది అనే సమాచారం క్షణాల్లో పోలీసులకు అందింది. కొత్తగా మార్కెట్ లోకి వస్తున్న కార్లలో ఇలాంటి సాంకేతిక సదుపాయం వుందట. దాంతో ప్రమాదంతో పాటు లోకేషన్ కూడా తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకోగలిగారు. ఎవరికీ ఎలాంటి గాయాలు తగలనందున, మరో పోలీసు వాహనాన్ని నిమిషాల్లో పిలిపించి ఆ ముగ్గుర్నీ ఇంటికి క్షేమంగా చేర్చి జాగ్రత్తలు చెప్పి వెళ్లిపోవడంతో కధ సుఖాంతం అయింది.
ఇదిగో ఇక్కడే ముందు చెప్పిన అంకెలు వాళ్లకు అక్కరకు వచ్చాయి.
డ్రైవ్ చేస్తున్న పిల్లవాడికి 18 ఏళ్లు. కానీ 21 నిండలేదు. కాబట్టి అర్ధరాత్రి 12 తర్వాత కారు నడప కూడదు. అయితే ఆక్సిడెంట్ జరిగిన టైం 11.40. ఇరవై నిమిషాలు ముందే జరిగింది కాబట్టి కేసు అవసరం రాలేదు . అదొక అదృష్టం. లైసెన్స్ రద్దు అయితే అమెరికాలో బతుకు దుర్భరం.
ఇక కారు ఇన్స్యూరెన్స్.
కారులో ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకున్నాయి కాబట్టి, వాటిని రిపేర్ చేయడం అసాధ్యంగా భావించిన, బీమా కంపెనీ వారు కొత్త కారు కొనుక్కోవడానికి గాను, అందుకయ్యే పూర్తి మొత్తాన్ని పరిహారంగా ఇవ్వడానికి ఒప్పుకున్నారు. మూడు వారాల లోపే కొత్త వాహనాన్ని, తమకు ఇష్టం వచ్చిన మోడల్ ది, కాణీ అదనపు ఖర్చు లేకుండా కొనుక్కున్నారు.
జరిగింది ప్రమాదమే అయినా, రూల్స్ అన్నీ కలిసి రావడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది.
ఇలాంటిదే మన దగ్గర జరిగితే పరిణామాలు ఎలా వుంటాయో ఊహించడం కష్టమేమీ కాదు. పోలీసులనుంచి, బీమా కంపెనీల నుంచి ఎదురయ్యే ప్రశ్నలు, కష్టాలు ఇన్నీ అన్నీ కాదు అనేది అందరికీ తెలిసిన విషయమే.
ఇక్కడే ఒక విషయం చెప్పదలచుకున్నాను.
మాన్యులకు, సామాన్యులకు చట్టాలు ఒకే విధంగా అమలు జరిగితే,
మన దేశంలోనే కాదు, ఏ దేశంలో కూడా పౌరులు ప్రభుత్వాలు విధించే నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించరు.
కాకపొతే, అవి అమలు చేసే/ జరిగే తీరు పట్లే వారి కినుక.
(16-9-2024)
>> బీమా కంపెనీ వారు కొత్త కారు కొనుక్కోవడానికి గాను, అందుకయ్యే పూర్తి మొత్తాన్ని పరిహారంగా ఇవ్వడానికి ఒప్పుకున్నారు
రిప్లయితొలగించండిShows how ignorant you are about insurance in USA and all things and yet write as if you know it all. Also బీమా ? What is it? After decades in journalism you don’t claim to know the correct word? You write as if so many will read this and actually believe these? And the last paragraph of free advice. Who is going to implement in India? Why don’t YOU advice someone in power to do these as you claim to know so many powerful people. Duh!
బీమా ? What is it అనడంలోనే అజ్ఞాత విన్నాణమెంతో తెలిసి పోతోంది తేటతెల్లగా
తొలగించండిపోనీ అమెరికాలో insurance పద్ధతి సరైనదేమిటో మీరు చెప్పరాదా, “అజ్ఞాత” గారు (7:35 am) ?
రిప్లయితొలగించండి————————
“బీమా” అనే పదం కరక్టేనే. “ఆంధ్రభారతి” నిఘంటు సంకలనంలో చెప్పినది చూడండి 👇.
=====================
“ logo నిఘంటుశోధన
English Keyboard Map Keyboard:
Telugu (తెలుగు) Display:
Search
Search: Entry Words Everywhere
Match: Exact Anywhere Prefix Suffix
Dictionary selection Fuzzy Search
»
బీమాpermalink
బీమా : శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912 Report error(s) గ్రంథసంకేతాది వివేచన పట్టిక
హిం. వి.
కొంతద్రవ్యమునిచ్చుట కొడఁబడు పద్ధతి. (ఆంగ్లేయభాషలో ఇన్‌స్యురెన్‌సు అందురు.)
బీమా : బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903 Report error(s)
bīmā
[H.] n.
1. Insurance.”
===================
భీమా : శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004 Report error(s) గ్రంథసంకేత వివరణ పట్టిక
రిప్లయితొలగించండివి.
ఆకస్మికముగా సంభవించు ఆపదల నుండి కాని సంఘటనల నుండి కాని కొంతవఱకు ఆర్థికముగా తేరుకొనుటకు ఉపయోగించు ఒక న్యాయసమ్మతమైన పూచీదారు విధానము.
భీమా : తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979 Report error(s)
విశేష్యము
[అర్థశాస్త్రము] ఆకస్మికముగ సంభవించు ఆపత్తుల నుండి కాని సంఘటనల నుండి కాని కొంత వరకు ఆర్థికముగ తేరుకొనుటకు ఉపయోగించు ఒక న్యాయసమ్మతమైన పూచీదారు విధానము.
ఈ రోజుల్లో బయట అమ్మే
రిప్లయితొలగించండిజూస్ తాగాలంటే
రోటీలు తినాలంటే భయం వేస్తుంది.
రెస్టారెంట్ల లోపల ఏమి కలుపుతున్నారో తెలియదు. బాగుంది అనుకుంటూ తింటున్నాము. అందరూ అలా చేయరు కానీ ఒక ఫీలింగ్ అనేది వస్తుంది.
పండ్లు కూరగాయలు మురికి నీళ్ళలో కడుగుతూన్న వీడియోలు, ఖర్జూరం పండ్లలో ఉమ్ముతున్న వీడియోలు కూడా వచ్చాయి.
ఒక ప్రఖ్యాత హెయిర్ స్టైలిస్ట్ కస్టమర్ల జుట్టు పై ఉమ్ముతున్న వీడియో కూడా వచ్చింది.
ఇంకెన్ని దారుణాలు చూడాలో 🤮🤢