ఇల్లంతా నిశ్శబ్దం. కొడుకు, కోడలు, మనుమరాలు పండక్కి ఊరు వెళ్ళారు. అయినా టైముకు అన్నీ జరిగిపోతున్నాయి. వండి పెట్టే వలలి, వేళకు వచ్చి టిఫిను, భోజనం సిద్ధం చేస్తుంది. అయినా ఏదో లోటు. అనుక్షణం ఇల్లంతా తిరుగుతూ మధ్య మధ్య నా గదిలోకి వచ్చి తాతా అని పిలిచే మనుమరాలు లేకపోయేసరికి ఇల్లంతా బావురుమంటోంది. అప్పుడప్పుడు ఫోన్ చేసి పలకరిస్తుంటారు. మొన్న వీడియో కాల్ చేశారు. తాతా అంటూ మనుమరాలు జీవిక లైన్లోకి వచ్చేసరికి ప్రాణం లేచి వచ్చింది.
నిన్న
ఉదయం అర్బన్ క్లాప్సో అర్బన్ కంపెనీనో - ఒకడు యూనిఫాంలో వచ్చాడు. తన ప్రవర
చెప్పుకుంటుంటే ఎవరు బుక్ చేశారు అని అడిగాను. నా పేరు చిరునామా కరక్టుగానే
చెప్పాడు. ఒక్క అభ్యంగన స్నానం మినహా, నాలుగు రోజులుగా మాసిన గడ్డాన్ని, కొన్ని రోజులుగా పెరిగిన జుట్టును సరిచేసి వెళ్ళాడు. గోరువెచ్చటి నీళ్ళతో స్నానం
చేసేసరికి మరోసారి ప్రాణం లేచి వచ్చింది.
తరువాత
తీరిగ్గా ఆలోచిస్తే లైటు వెలిగింది.
మొన్న
వీడియో కాల్ చేసినప్పుడు నా చింపిరి జుట్టు, పెరిగిన గడ్డంతో ఉన్న నా అవతారాన్ని కోడలు గమనించినట్టు వుంది. ఇంకేముంది
అక్కడ బుక్ చేస్తే ఇక్కడ క్షౌరం చేసి వెళ్ళాడు.
దగ్గర
లేరే అనే బాధ చప్పున మాయం అయింది.
(21-10-2023)
అయ్యో. నాలుగు రోజులు స్నానం చేయలేదా ?
రిప్లయితొలగించండి@ అజ్ఞాత: అలా అర్ధం అయిందా! పోనీలెండి.
రిప్లయితొలగించండి