ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు మొదటిసారి ముఖ్యమంత్రి అయిన రోజులు.
హైదరాబాదులో ఎర్రమంజిల్ కాలనీ నుంచి
జూబిలీ హాల్ కు బయలుదేరాను. అసెంబ్లీ సమావేశాలకు ముందు స్పీకర్ సంప్రదాయంగా ఇచ్చే
అల్పాహార విందుకు వెళ్ళాలి. రోడ్డు దాటి అవతల వైపు వెళ్ళి ఆటో పట్టుకోవాలి. ఇవతల
ఎక్కుదామంటే ఒక్కడూ రాకపోగా సనత్ నగర్ అయితే తీసుకుపోతా అంటాడు. వాళ్ళతో
పనికాదనుకుని సగం రోడ్డు దాటాను. ఇంతలో ముఖ్యమంత్రి వస్తున్న దాఖలాగా పోలీసుల
హడావిడి కనిపించింది. ట్రాఫిక్ పోలీసులు ఎక్కడివాళ్ళను అక్కడే నిలిపేశారు. దాంతో
నేను డివైడర్ మీదనే నిలబడిపోయాను. ఈలోగా సీఎం కాన్వాయ్ రావడం పోవడం క్షణాల్లో
జరిగిపోయింది. కాన్వాయ్ వెళ్లడం ఆలశ్యం, రోడ్డుమీద
ఎక్కడలేని హడావిడి. అప్పటిదాకా నిలబడిపోయిన వాహనాలన్నీ ఒక్కమారుగా బయలుదేరాయి.
అంతా అస్తవ్యస్తం. ఒకదానికొకటి అడ్డం. అడిగే నాధుడు లేదు. అప్పటిదాకా ట్రాఫిక్
కంట్రోల్ చేసిన పోలీసులందరూ మంత్రం వేసినట్టు మాయం అయిపోయారు. సీఎం వెళ్ళగానే తమ
డ్యూటీ అయిపోయినట్టు వాళ్ల లెక్క కాబోలు. పోలీసులు మరికొద్ది నిమిషాలు వుండి
వాహనాల రాకపోకలు అదుపుచేసి వుంటే ఈ పరిస్తితి వుండేది కాదు. నేను ఆటో పట్టుకుని
వెళ్ళేటప్పటికే అల్పాహార విందు మొదలయింది. విందు పూర్తి కావస్తుండగా సీఎం
సెక్యూరిటీ అధికారి నాతో అన్నారు, ‘వస్తుంటే దారిలో డివైడర్ మీద నిలబడ్డ
మిమ్మల్ని చూసాము, ఒక్కసారి సీఎం గారిని కలవండి అని.
చంద్రబాబు నన్ను చూస్తూనే ‘వచ్చారా సంతోషం, బ్రేక్ ఫాస్ట్ చేశారా, ఎవరక్కడ,
వీరిని కనుక్కోండి’ అంటూ రోడ్డు మీద నన్ను
గమనించిన విషయాన్ని అన్యాపదేశంగా ప్రస్తావించారు. “సిటీలో ట్రాఫిక్ బాగా
పెరిగిపోయింది, గట్టిగా ఏదైనా చేయాలి, చూద్దాం’ అన్నారు.
నేను మళ్ళీ సెక్యూరిటీ అధికారి
దగ్గరికి వెళ్లి, 'మరికొద్ది నిమిషాలు పోలీసులు అక్కడ
వుంటే కొంపలు మునగవు కదా' అన్నాను. ఆయన నవ్వుతూ, 'అవును మీ సలహా బాగానే వుంది, కమీషనర్ గారితో
చెప్పి చూస్తాను' అన్నారు మర్యాదగా.
ఇది జరిగి కొంచెం అటూఇటుగా ముప్పయ్
ఏళ్ళు.
ఈ సమస్య పరిష్కారం కాకపోగా దాని తీవ్రత ముప్పయ్ రెట్లు పెరిగింది. కారణం
వీవీఐపీల సంఖ్యతో పాటు తీరుమారిన రాజకీయాల నేపధ్యంలో వారి రాకపోకలు మరింతగా
పెరగడం.
ఒకానొక కాలంలో సమయానికి అంత విలువ వుండేది
కాదు. బస్సులు, రైళ్లు కొంచెం ఆలస్యం అయినా జనం
సర్దుకు పోయేవాళ్ళు. ఇప్పుడలా కాదు. సమయం అంటే డబ్బుకు మరో రూపం. కార్పొరేట్
ప్రపంచంలో జీవించేవారికి ఆలస్యాలు అసలు పనికి రావు. అలాగే ఆసుపత్రులకు వెళ్ళే
వారికి కూడా సమయం అమూల్యం. అమృత ఘడియల్లో (గోల్డెన్ అవర్స్ అని డాక్టర్లు అంటారు)
రోగికి చికిత్స అందిస్తే రోగి బతికి బట్టకట్టే అవకాశాలు ఎక్కువ. అటువంటి వారిని
తీసుకువెళ్ళే అంబులెన్సులకు సయితం ఈ ట్రాఫిక్ సమస్య తప్పడం లేదు.
కొన్ని కొన్ని చిన్న చిన్న చర్యలతో ఈ
సమస్యకు పరిష్కారం లభిస్తుందేమో ప్రయత్నించి చూడడంలో తప్పేమీ లేదు.
అన్నింటికంటే ముందు చేయాల్సింది, ట్రాఫిక్ అధికారులు తమ ప్రాధాన్యతలను
నిర్ధారించుకోవడం. హెల్మెట్లు, సీటు బెల్టులవంటి నిబంధనల అమలుకు
తీసుకుంటున్న శ్రద్ధని, కొంతకాలంపాటయినా, ట్రాఫిక్ చిక్కుముళ్ళని చక్కదిద్దే
దిశగా మరల్చాలి. ఎక్కడ, ఏ సమయంలో వాహనాల రద్దీ ఎక్కువగా
ఉంటుందో అధ్యయనం చేసి అందుకు తగ్గట్టుగా అదనపు సిబ్బందిని ఆయా కూడళ్ళలో, అవుట్ సోర్సింగ్ పద్ధతిపై నియమించాలి. ఈ సిబ్బందికయ్యే ఖర్చుని ఆయా
కూడళ్ళ చుట్టు పక్కల ఉండే దుకాణాలు, నివాస
సముదాయాలనుంచి పారదర్శక పద్ధతిలో వసూలు చేసినా తప్పులేదు.
రోడ్లు దాటడానికి అనేక నగరాల్లో పలు చోట్ల లక్షలు ఖర్చు చేసి
ఫుట్ వోవర్ బ్రిడ్జీలు నిర్మించారు. వాణిజ్య ప్రకటనలకు మినహా, వాటిని జనం ఉపయోగిస్తున్న దాఖలాలు లేవు. స్త్రీ, బాల, వృద్ధులు ఆ వంతెనలు ఎక్కలేరు.
ఎక్కగలిగిన వారు ఎక్కనే ఎక్కరు. వాహనాల నడుమ రోడ్డు దాటి వెళ్ళడానికే
ప్రయత్నిస్తారు. అందువల్ల వాటిని మరింత
ఉపయోగంలోకి తీసుకురావడానికి వాటికి లిఫ్టులు అమర్చాలి. అందుకయ్యే వ్యయాన్ని కొద్ది
కొద్దిగా వినియోగదారుల నుంచి రుసుము రూపంలో రాబట్టుకోవాలి. హైదరాబాదు వంటి చాలా
నగరాలు, పట్టణాల్లో ఇప్పటికే కొన్ని చోట్ల ఈ
సదుపాయం వుంది. కానీ వాడుతున్న దాఖలా లేదు.
ప్రైవేటు విద్యాసంస్థల వద్ద నిర్మించిన
కాలి వంతెనల పూర్తి వ్యయాన్ని ఆ సంస్థల నుంచే వసూలు చేయాలి. విద్యార్ధుల నుంచి
భారీ మొత్తంలో ఫీజులు పిండుతున్న ఆ సంస్ధలకి ఇదేమంత పెద్ద భారం కాబోదు.
ఇలాటి ఏర్పాట్లకి వీలులేనిచోట్ల
ప్రత్యామ్నాయాలు పరిశీలించాలి. అనేక రద్దీ కూడళ్ల వద్ద రోడ్డు దాటలేక అవస్తలు
పడేవారు అనేకమంది కనిపిస్తుంటారు. భవసాగరం ఈదడం కంటే రోడ్డు దాటడం కష్టంగా
భావిస్తుంటారు.
బాగా అభివృద్ధి చెందిన ప్రపంచ నగరాలలో
రోడ్డుదాటడానికి పుష్ బటన్ వ్యవస్థలు
వుంటాయి. రోడ్డుపక్కన వున్న పుష్ బటన్ నొక్కగానే రోడ్డు క్రాస్ చేయడానికి వీలుగా
పచ్చ దీపం వెలుగుతుంది. వారు రోడ్డుదాటి వెళ్ళేవరకు ఎక్కడి వాహనాలు అక్కడే
ఆగిపోతాయి.
విద్యుత్ దీపాలతో కూడా పని లేకుండా, జండాలను ఉపయోగించే ఒక విధానం కొన్ని
విదేశాల్లో అమల్లోవుంది. అదేమిటంటే, రోడ్డుకు
ఇరువైపులా విద్యుత్ స్తంభాలకు తగిలించిన బాస్కెట్లలో కొన్ని
జండాలను ఉంచుతారు. రోడ్డు దాటాలనుకునేవారు ఒక
జండాను తీసుకుని చేతిలో పట్టుకుని ఊపుకుంటూ వెళ్లిపోవచ్చు. రోడ్డు దాటిన
తరవాత అవతలవైపు వున్న బాస్కెట్లో వుంచి తమదారిన వెళ్లిపోవచ్చు. ఇరుకైన రోడ్లు
వున్న పాత బస్తీ వంటి ప్రాంతాల్లో ఈ పద్దతి ఉపయుక్తంగా వుంటుంది. అయితే ఇచ్చిన
సదుపాయాన్ని దుర్వినియోగం చేయడమే పరమావధిగా భావించే జనం అధికంగా ఉన్న మన పౌరసమాజం
కారణంగా, ఇటువంటి చిట్కాలు ఏ మేరకు సత్ఫలితాలు
ఇస్తాయనేది అనుమానమే మరి.
పోతే, థియేటర్లు, పాఠశాలలు, ఆఫీసుల వేళల్లో తగుమార్పులు చేయడం ద్వారా, ఒకే సమయంలో, ప్రజలు, వాహనాలు భారీ సంఖ్యలో రోడ్ల మీదకు రాకుండా నియంత్రించడానికి
వీలుపడుతుంది.
కనిపించిన చోటల్లా `నోపార్కింగ్' బోర్డులు పెట్టకుండా పార్కింగ్ కి
అనువయిన స్ధలాలని ముందుగా గుర్తించాలి. పోలీసు వాహనాలు `నోపార్కింగ్' ప్రదేశాల్లో నిలపకుండా చూడాలి.
ప్రయివేటు బస్సులని ఎలాగూ అదుపు
చేయలేరు కనుక, రాత్రి సమయాలల్లో కొన్ని కొన్ని
విద్యాసంస్థలకున్న ఖాళీ జాగాలలో ప్రయాణీకులను ఎక్కించుకునేందుకు అనుమతి ఇవ్వాలి.
ఇందుకోసం వసూలు చేసే రుసుముని ఆయా విద్యా సంస్థలకే ఇవ్వాలి. ఇలా చేయడంవల్ల అనేక ప్రాంతాలలో
రాత్రివేళల్లో రోడ్ల మీద ట్రాఫిక్ జామ్స్
తగ్గిపోతాయి.
స్కూళ్ళకీ, ఆఫీసులకీ వెళ్ళే రద్దీ సమయాల్లో చెకింగులు జరిపే పద్ధతికి స్వస్తి
చెప్పాలి. కన్నూ మిన్నూ కానని అతి వేగంతో ద్విచక్ర వాహనాలపై దూసుకుపోయేవారిని,
సిగ్నల్ జంపింగ్ చేసే వాహనదారులను పట్టుకుని
భారీ జరిమానాలు విధించాలి. అసలు ఇలాటి వాహనదారుల వల్లనే ప్రమాదాలు జరిగే అవకాశం
ఎక్కువ.
అలాగే, రద్దీ సమయాలని దృష్టిలో పెట్టుకుని నగరాల్లో 'వీ.ఐ.పీ.' ల పర్యటనలు, రాకపోకల సమయాల్లో మార్పులు చేయాలి. వారికోసం రోడ్లపై వాహనాలను అంతూపొంతూ లేకుండా నిలిపివేసే పద్దతికి స్వస్తి చెప్పడానికి అత్యాధునిక కమ్యూనికేషన్
పరికరాలు వాడుకోవాలి. 'ప్రజలకోసమే మేము, ప్రజాసేవలో మేము' అంటూ నిత్యజపం చేసే నాయకులు, ఇందుకు ఏమాత్రం సహకరిస్తారో చూడాలి.
ప్రధానమైన ఆస్పత్రులు వున్న వీధుల్లో
రాస్తారోఖోలు, ధర్నాలు, ఊరేగింపులను నిషేధించాలి.
ఇవన్నీ చేసినా, సమస్య నూటికి నూరుపాళ్లు పరిష్కారం కాకపోవచ్చు. కానీ పరిస్థితి
కొంతలో కొంత మెరుగు పడడానికీ , పోలీసుల పట్ల ప్రజలకున్న అవగాహన,
అభిప్రాయాల్లో సానుకూల మార్పు రావడానికే ఈ
చర్యలు ఖచ్చితంగా దోహదం చేస్తాయి.
తోకటపా:
ట్రాఫిక్ ఇబ్బంది అంటే ఏమిటో ప్రముఖ రాజకీయ
నాయకుడు డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డికి కూడా ఒకసారి తెలిసివచ్చింది. ఆ
కధాక్రమంబు ఎట్టిదనిన:
హైదరాబాదు ప్రెస్ ఫొటోగ్రాఫర్ల సంఘం
వాళ్ళు ఏటా ఒకసారి సోమాజిగూడా ప్రెస్ క్లబ్ లో ఫోటో ఎగ్జిబిషన్ పెడుతూ వుండడం
రివాజు. అది జరిగినన్నాళ్ళు ప్రతిరోజూ ఒక అతిధిని ఆహ్వానిస్తుంటారు. అలాగే అప్పుడు
ప్రతిపక్ష నాయకుడిగా వున్న వైఎస్ రాజశేఖరరెడ్డిని పిలిచారు. రిసీవ్ చేసుకోవడానికి
క్లబ్ కార్యదర్శిగా నేనూ, ప్రెస్ ఫోటోగ్రాఫర్లు అందరం క్లబ్ మెయిన్ గేటు దగ్గర
నిలబడి ఉన్నాము. వైఎస్ కారులో కేవీపీ రామచంద్రరావు కూడా వస్తున్నారు. ఖైరతాబాదు
వైపు నుంచి వస్తున్న వాళ్ళ కారు, రోడ్డుకు అటువైపు వున్న ఈనాడు మీదుగా వెళ్లి యూ టర్న్ తీసుకుని ఆర్టీఏ ఆఫీసు పక్కనే ఉన్న ప్రెస్
క్లబ్ కు రావాలి. అయితే వై.ఎస్.
కారు టర్న్ తీసుకునేలోగానే, సీఎం వస్తున్నారని పోలీసులు ట్రాఫిక్
నిలిపి వేసారు. ఎదురుగా వున్న రోడ్డులో వాహనాల నడుమ నిలిచివున్న వైఎస్ కారుని
ఇటువైపునుంచి మేము చూస్తూనే ఉన్నాము. (అప్పట్లో మెట్రో లేదు). కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
కాన్వాయ్ రావడం, సచివాలయం వైపు దూసుకు పోవడం జరిగింది.
ట్రాఫిక్ కదిలింది. మలుపు తీసుకు వచ్చిన వైఎస్ కారు క్లబ్ దగ్గర ఆగకుండా గేటు
దగ్గర నిలబడి వున్న మా కళ్ళఎదుటే అలా
ముందుకు వెళ్ళిపోయింది. వెంటనే నేను కేవీపీ
మొబైల్ కి ఫోను చేశాను. ఆయన ‘అరెరే! బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ అనుకున్నాము’
అని నొచ్చుకుంటూ చెప్పారు. ఆ వెంటనే విశ్వేశ్వరయ్య చౌరాస్తాలో మళ్ళీ వెనక్కి
తిరిగి క్లబ్ కి చేరుకున్నారు.
రిప్లయితొలగించండితీసుకురావడానికి వాటికి లిఫ్టులు అమర్చాలి.అల్ల
ఆ లిఫ్టుల్లో జనాలెక్కడానికి ఎందుకు సుముఖంగా లేరు ? అవేదో భూతాల కొంప లా భయం భయంగా వుండడం వల్ల :). ఎస్కలేటర్ పెడితే మంచిదేమో
(అఫ్కోర్స్ ఆ ఎస్కలేటర్లపై లేని భయాన్ని తెచ్చేసుకుంటూ ఢామ్మని ఉబ్బితబ్బిబ్బులై పోయి జారి పడేదానికని రెడీ గా నాలాంటి జిలేబులు ఉండనే ఉంటారు :))
ఇక్కడ చెప్పిన కారణాలతో బాటు ఫుటోవర్ బ్రిడ్జిలను ఉపయోగించక పోవడానికి ముఖ్య కారణం భద్రత లేదనే భయం కావచ్చునని నా అభిప్రాయం. ఆదాయం మోజు కావచ్చు బ్రిడ్జికి రెండు వైపులా పెద్ద పెద్ద అడ్వర్-టైజ్మెంట్ బోర్డులు కట్టేయడం వలన బ్రిడ్జి మీద ఏం జరుగుతోందీ ఏమీ కనబడదు. ఏదైనా అఘాయిత్యం జరిగినా కింద ఎవరికీ కనబడని పరిస్ధితి.
తొలగించండిఅసలు పాదచారులు ఎందుకు అంత కష్టపడాలి?
రిప్లయితొలగించండిముఖ్యమైన జంక్షన్ ల వద్ద రోడ్డు కాస్త ఎత్తు పెంచి కింద చిన్న pedestrian underpass నిర్మిస్తే క్షేమంగా రోడ్డు దాటవచ్చును.
పాదచారులు కష్టపడటానికే పుట్టిన వాళ్ళు కదండీ? వాళ్లు కష్టపడక సోకులడిగితే ఎలా ?
రిప్లయితొలగించండిబోనగిరి గారు,
రిప్లయితొలగించండిపైన “అజ్ఞాత” గారు చెప్పినట్లు “పాదచారులు కష్టపడటానికి పుట్టిన వాళ్ళు”. ఇది అంతకంతకూ ఎక్కువవుతోంది (పాదచారులను లెక్క చెయ్యక పోవడం).
హైదరాబాద్ లోని హైటెక్ సిటీ ప్రాంతంలో రాయదుర్గం మెట్రో చుట్టు ప్రక్కలానూ కార్పొరేటాధములు తమ ఆఫీసు భవనం బయటనున్న ఫుట్ పాత్ ల రెండు వైపులా ట్రాఫిక్ కోన్స్ (cones) తో అడ్డం పెడుతున్నారు - ఫుట్ పాత్ మీదకు ఎక్కడానికి అవరోధంగా. వాళ్ళ ఉద్దేశమేమిటో అర్థం కాదు. బహుశః తమ భవనం బయట ఉన్న పబ్లిక్ అవసరాలకు ప్రభుత్నం ఏర్పాటు చేసిన ఫుట్ పాత్ లు కూడా తమ సేవ కోసమే అనే భ్రమలోనో అహంకారం లోనో ఉన్నారేమో మరి? ఇదేమి అని అడిగిన వారికి దురుసుగా జవాబిస్తున్నారు. పలు రకాల కబ్జాల గురించి వింటుంటాం కానీ ఈ corporate encroachment కూడా ఉందని అనిపిస్తోంది. దీని ఫలితం ఏమిటంటే పాదచారులు రోడ్డు మీదనే నడవాల్సి వస్తున్న అగత్యం పెరిగింది.
ఇంకా మీరేదో ఎందుకు కష్టపడాలి అని ఆశ్చర్య పోతున్నారు. విదేశాల్లో పని చేసి, అక్కడి డిసిప్లిన్ / కు / సివిక్ సెన్స్ కు గినా అలవాటు పడి వచ్చారా ఏమిటి?
అసలే జీవన విధానంలో కార్లే ముఖ్యం లాంటి హైప్ బాగా పెచ్చు మీరి పోయి పాదచారులంటేనూ వారి ప్రాణాలంటేనూ నిర్లక్ష్యం పెరిగి పోయినట్లు తోస్తోంది. దానికి తోడు ఈ corporate కబ్జాలు.
మన బోంట్లు ఫిర్యాదు చేసినా కూడా పోలీసులు గానీ, ఇతర ఉన్నతాధికారులు గానీ పట్టించుకుంటారనే నమ్మకం నాకు లేదు. మంత్రులతో సన్నిహితత్వం కలిగిన భండారు శ్రీనివాసరావు గారు వారికి తెలిసిన మంత్రికి చెప్పి చూస్తే ఫలితం ఉండవచ్చు.
కర్నాటక లింగాయతులు సైతం లూసిఫర్ మతస్థుల సృష్టియేనా?కర్నాటక మీద అధికారం కట్టబెట్టగలిగిన శక్తి లింగాయతులకి ఉండటం ప్రజాస్వామ్యానికి హానికరమే!
రిప్లయితొలగించండిఇప్పుడే తెలిసిన కొత్త విషయం ప్రకారం ప్రజాస్వామ్యానికి కాదు,హిందువులకి చాలా పెద్ద ప్రమాదం ఈ బసవణ్ణ.చందు తులసి అని ఒక వామమహిళ చిన్న క్లూ ఇచ్చింది - "స్వాతంత్రం వచ్చాక రాజ్యాంగం రాస్తున్న టైములో అప్పటి కర్నాటక ముఖ్యమంత్రిగా ఉన్న నిజలింగప్ప బసవన్న గురించి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కరుకి చెప్పారంట.ఆయన చెప్పిన విషయాలు విన్న తర్వాత అంత గొప్ప ఆలోచనలు ఉన్న వ్యక్తి ఒక్క కర్నాటకకే ఎందుకు పరిమితమై పోయారు.ఆయన్ని ప్రపంచం మొత్తానికి కూడ పరిచయం చెయ్యాలి కదా!ఒకవేళ అట్లా పరిచయం చెయ్యకపోతే గనక కర్నాటక ప్రజలు లేకపొతే కర్నాటకలో ఉండే నాయకులు చాలా పెద్ద తప్పు చేసినట్లవుతుంది అన్చెప్పి అంబేద్కర్ అభిప్రాయ పడ్డారంట" అని.
నిన్న గాక మొన్న ఒక పోష్టు వేశాను గద డంబేద్కర్ ఒకటో నంబర్ లూసిఫర్ మతస్థుల ఏజెంటు అని.దలైలామా గుర్తింపు లేని నవయాన బుడ్డిజాన్ని రుద్దిన త్రాష్టుడే బసవణ్ణనీ హిందువుల మీద రుద్దాడు,నో డౌట్!
చందు తులసి చెప్పిన జీవిత కధ ప్రకారమే బసవణ్ణ కూడా చారిత్రక యదార్ధత లేని కల్పిత పాత్ర గానీ చారిత్రక యదార్ధత ఉన్న వ్యక్తి యొక్క వూక్తిత్వాన్ని పూర్తి మార్పు చేర్పులతో మనముందు నిలబెట్టిన తోలుబొమ్మ గానీ అయ్యిండాలని అనిపిస్తున్నది నాకు.
ఎందుకంటే, బసవడు అనే బ్రాహ్మణ కుర్రాడు ఉపనయనం చేసే వయస్సు నాటికే అక్కలకి ఉపనయనం చెయ్యట్లేదు గాబట్టి నేనూ ఉపనయనం చేసుకోనని గోల చేసి జంఝాన్ని అవమానించిన సన్నివేశాన్ని చూపిస్తున్నారు.ఇది మతం మారిన క్రైస్తవులు "నేను బ్రాహ్మల ఇంట్లో పుట్టాను.మొదట్లో భక్తి చాలా ఎక్కువగా ఉండేది.రాన్రాను ప్రశ్నలు వచ్చాయి.నా ప్రశ్నాలకి జవాబులు దొరకలేదు.ఇంట్లోంచి పారిపోయాను.చివరాఖరికి క్రీస్తులో నాకు జవాబులు దొరికాయి" అంటున్న దొంగ సాక్ష్యపు కధలాగే ఉంది.
ఇప్పుడు మనం,అంటే నిజాల్ని వెలికి దియాలనుకున్న హిందువులం చెయ్యాల్సిన అతి చిన్న పని ఆ "స్వాతంత్రం వచ్చాక రాజ్యాంగం రాస్తున్న టైములో అప్పటి కర్నాటక ముఖ్యమంత్రిగా ఉన్న నిజలింగప్ప బసవన్న గురించి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కరుకి చెప్పారంట" అనే సన్నివేశానికి ముందు కర్నాటకలో బసవణ్ణ గురించి ఎవరికి ఎంత తెలుసు అనే పరిశోధన చెయ్యటం.ఎంతో వెనక్కి వెళ్ళనక్కర లేదు.రాజ్యాంగం రాసింది 1949 నుంచి 1950 మధ్య కాబట్టి ఒక దశాబ్దం నుందు నుంచి కర్నాటక దినపత్రికల సంచికల్ని వెతికి పట్టుకుని తిరగేసి చూస్తే చాలు జంఝాన్ని అవమానించిన బ్యాపన పోరడు డంబి గాడు హిందువుల మీద రుద్దక ముందు అనామకుడా ప్రముఖుడా అనేది తెలుస్తుంది.
చిన్నప్పుడే యజ్ఞోపవీతాన్ని అవమానించిన వాడు హిందువులని సంస్కరించడమా - ఎంత వింత?నీచ నికృష్ట హిందువుల్ని సంస్కరించడానికి ఇంతమది మహానుభావులు పుట్టారా - ఔర,ఔర.
జై శ్రీ రామ్!