ఇది ఇప్పటి మాట కాదు. ఈ రోజుల్లో అయితే ఇలాంటి అనుభవాలకు ఆస్కారమే లేదు.
“ఏమండీ ఆయన గారు వచ్చారు, మళ్ళీ ట్రాన్స్ ఫర్ అయిందేమో!”
బయటకు వచ్చి చూస్తే ఆయనే. మొహం
వాడిపోయినట్టు వుంది. మనిషి దిగాలుగా వున్నాడు.
పేరుకు పెద్ద అధికారి. పైగా సీనియర్
ఐ.ఏ.ఎస్. మా ఇంటికి వచ్చి నాకోసం ఎదురు చూడడం ఏమిటి చిత్రం కాకపోతే!
నిమిషాల్లో తయారై ఆయన్ని తీసుకుని
ఆటోలో వెళ్ళాల్సిన వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళాను. ఆయన్ని బయట కూర్చోబెట్టి లోపల
చెప్పాల్సిన వాళ్లకు ఆయన గురించి చెప్పాను.
‘నువ్వు ఇంతగా చెప్పాలా శ్రీనివాసరావ్!
ఆయన గురించి నాకు బాగా తెలుసు. నిజాయితీపరుడు. తన డ్యూటీ శ్రద్ధగా చేస్తాడు.
కానీ..”
“ఆ కానీ ఏమిటో నాకూ తెలుసండీ. మీరు ఆయన
అడిగిన పోస్టు ఇస్తే, రేపు నేను వెళ్లి ఆయన్ని కలిసినా కూడా, ఎవరు నువ్వు అన్నట్టే చూస్తారు. ఫోన్ చేసినా
రెస్పాన్స్ వుండదు. మళ్ళీ బదిలీ అయిన దాకా నేనెవరన్నది ఆయనకు గుర్తు కూడా వుండదు.
ఏ పని చేయాలన్నా రూలు బుక్కే వేదం. మీరే కాదు, ముఖ్యమంత్రి చెప్పినా వినే రకం కాదు. నిజంగా ఇలాంటి అధికారులే కావాలి.
అందుకే వెంట బెట్టి తీసుకువచ్చాను. ఇక మీ ఇష్టం” అనేశాను.
“నేనూ అదే చెబుతున్నా! ఇక నీ ఇష్టం.
ఈసారి చేస్తాను. ఆరు నెలల్లో మళ్ళీ నువ్వే వస్తావు, ఆయన సంగతి చూడమని. రూలు బుక్కు అంటూ ఎక్కడా ఇమిడే రకం కాదు. ఎవరి
మాటా వినే రకం కాదు.” అన్నాడా మంత్రిగారు.
మూడు రోజుల్లో ఆయన కోరుకున్న పోస్టు
దొరికింది. నాకు తెలుసు దొరుకుతుందని. మరో విషయం కూడా తెలుసు తిరిగి బదిలీ
అయ్యేదాకా నేను ఎవరన్నది ఆయనకు గుర్తు కూడా ఉండదని.
అయితే ఇలాంటి నిజాయితీ అధికారులు
వుండాలి అని కోరుకునే వాడిని కనుక ఆయన నన్ను పట్టించుకున్నాడా లేదా అనే విషయాన్ని
పట్టించుకునే వాడిని కాదు.
పొతే, ఇంత నిబద్ధత కలిగిన అధికారికి
పోస్టింగుల మీద ఈ వ్యామోహం ఏమిటి
అనే అనుమానం తొలుస్తూ వుండేది.
ఒకసారి బదిలీ అయినప్పుడు ఆయనే చెప్పారు
ఇలా.
“సాయం చేయగలిగిన అదీ అవసరంలో వున్న
పేదవారికి సహాయపడగలిగిన పోస్టులో వుంటే చేయగలిగింది చేస్తాను. కలక్టరుగా
వున్నప్పుడు ఆ స్వేచ్ఛ వుండేది కొంతవరకు. కానీ సచివాలయానికి వచ్చిన తర్వాత అలా
కుదరదు. అవసరంలో ఉన్నవారికి సాయం
చేయగలిగిన మంచి పోస్టుల్లో ఎక్కువకాలం నన్ను వుంచుతారనే నమ్మకం నాకు లేదు. ఎవరికీ ఉపయోగపడలేని పోస్టులో వేస్తె, గోళ్ళు గిల్లుకుంటూ కూర్చుని జీతం
తీసుకుకోవడం తప్పిస్తే ఏం చేయగలను చెప్పు”
“అది సరే! మీకు బదిలీల్లో సాయం చేసిన వారి మాట చెవిన పెడితే, మీ గురించి అలా మాట్లాడరు కదా!”
“సరి సరి భలే మాట చెప్పావు. వాళ్ళ మాటలు
వినడం మొదలు పెడితే నాచేత వాళ్ళు చేయించేవి పనులు కాదు, అకృత్యాలు”
విజయనగర్ కాలనీలో నివాసం వుండే ఈ అధికారి భార్య రెండు సిటీ బస్సులు మారి, నారాయణ గూడాలో దీపక్
మహల్ పక్క సందులో వుండే నర్సింగ్ హోం కి
వచ్చేవారు. ఆఫీసు కారుని భార్యాపిల్లలను కూడా వాడనిచ్చే మనిషి కాదు.
మేనకోడలు వరసయ్యే ఓ లేడీ డాక్టర్ ది ఆ
హాస్పిటల్. పైగా మా ఆవిడకి వాళ్ళ కుటుంబంతో చిన్నప్పటి స్నేహం. ఒకసారి ఆ అయ్యేఎస్
భార్యగారిని వెంటబెట్టుకుని మా ఇంటికి తీసుకువచ్చింది. అప్పుడు నేను ఇంట్లోనే
వున్నాను. ఆ అధికారి భార్య ఇలా అన్నారు. ‘మీ వారు మా వారి పనుల మీద ఎన్నోసార్లు మా
ఇంటికి వచ్చారు. మా ఆయన బయటే నిలబెట్టి మాట్లాడే వారు. మీరు (అంటే మా ఆవిడ)
మద్రాసులో చదువుకున్నారు. మీకు తెలిసే వుంటుంది, మాకు (తమిళులకు) ఎన్ని పట్టింపులో.
ఇవ్వాళ మీ ఇంట్లో కూర్చుని కాఫీ తాగుతుంటే నాకు సిగ్గనిపిస్తోంది”
(ఆ అధికారి ఎవరన్నది ముఖ్యం అనుకోను.
ఆయనిప్పుడు జీవించి కూడా లేరు. సర్వీసులో ఉన్న రోజుల్లో తోటి ఉన్నతాధికారులు ఆయనకి
పెట్టిన పేరు పిచ్చోడు)
-
రిప్లయితొలగించండిఓహో ఆయనేనా ఈ పిచ్చోడు ఇంతకు ముందు కూడా ఈ కథాకమామీషు మీరు వ్రాసేరు ఆ ఆఖరు అరవ లింకు తప్పించి.
ఇప్పుడా అరవ లింకుతో ఆ ఆర్యుడెవరో తెలిసివచ్చె.
జిలేబి
“జిలేబి” గారు,
తొలగించండిIAS లో అరవలకేం కొరత. ఆ మాత్రం క్లూ తోనే నిజాయితీ గల ఈ ఆఫీసరెవరో మీరు కనిపెట్టేసారా? మీరు “అసామాన్యులండీ”.
మరి మీకు తెలిస్తే … పబ్లీకున బ్లాగులో కాకపోయినా … కాస్త మా చెవిలో చెప్పరాదూ (అంటే ఇ-మెయిల్ ద్వారా అని కవిహృదయం)?
తొలగించండివిన్న కోట వారు
పై టపాలో ఆఖరి బ్రాకెట్ టపా గమనించగలరు :)