అవకాశాలు రాని సమర్దులకన్నా, అవకాశాలు వచ్చిన అసమర్ధులకు మంచి పేరు వచ్చే రోజులివి. ఈ రెండో రకానికి చెందిన నేను ఆ రకంగా మా సీనియర్ల కంటే అదృష్టవంతుడిని. రిటైర్ అయిన తరువాత కూడా యేవో మనసులోని మాటలు వ్యాసాల రూపంలో రాసుకోగల బంగారు అవకాశం సాంఘిక మాధ్యమాల రూపంలో నాకు లభించింది.
వెనుకటి రోజుల్లో పత్రికలకు వ్యాసాలూ అవీ రాయడం గగనంగా వుండేది. ముందు రాయాలి. రాసింది మళ్ళీ సాఫు చేసుకుని తిరగ రాయాలి.
రాసింది ‘తిరుగు టపాకు తగినన్ని స్టాంపులు జతచేసి’ మరీ పోస్టులో పంపాలి. అది చేరిందో లేదో తెలవదు. చేరినా చేరిందనే
కబురు తెలవదు. ఆశ ఒదులుకున్న తరువాత ఎక్కడి నుంచో ఓ మిత్రుడు పోస్ట్ కార్డు రాసి పడేస్తాడు, ‘పలానా పత్రికలో మీ వ్యాసం చదివానని’. ఆ రచన పడ్డ పత్రిక వెతికి పట్టుకోవడానికి నానా ఇబ్బందులు పడాల్సివచ్చేది.
ఇప్పుడలా కాదు. అంతా ఇన్ స్థంట్ కాఫీ మాదిరి. ఇలా రాసి అలా పోస్ట్ చేయడం తరువాయి బాగుందనో, బాగాలేదనో కామెంట్లు కూడా తయారు. కొందరయితే శ్రద్ధగా చదివి తప్పొప్పులను
ఎత్తి చూపెడతారు. సరిదిద్దుకునే సదవకాశం కూడా వుంటుంది. అందుకే నేను పత్రికలకోసం
రాసినప్పుడు, వారికి ఇష్టం వున్నా లేకపోయినా ఒక రోజు ముందే వాటిని ఫేస్ బుక్, బ్లాగు వంటి మాధ్యమాల్లో పోస్ట్ చేస్తాను. యెంత
జాగ్రత్తగా రాసినా కొన్ని స్ఖాలిత్యాలు దొర్లడం కద్దు. వాటిని ఎంచక్కా
దిద్దుకోవచ్చు. అదీ నా స్వార్ధం.
కాకపోతే ఇందులో కూడా కొన్ని ఇబ్బందులు లేకపోలేదు. పత్రికల్లో రాసినప్పుడు
ఎవరికయినా నచ్చకపోయినా ఆ విషయం మనకు తెలిసేనాటికి చాలా రోజులు పడుతుంది. ఇక్కడ అలా
కాదు, వెంటనే, మొట్టి కాయలు ఎలాంటి మొహమాటం లేకుండా వేసేస్తారు.
ఇన్నేళ్ళ వయస్సులో అవన్నీ పట్టించుకుంటే కష్టం. అందుకే ఎవరి ఇష్టం కోసమో
కాకుండా నా ఇష్ట ప్రకారమే రాసుకుంటూ పోతుంటాను.
పాత జోకు ఒకటి వుంది కదా!
దుకాణం బయట రాసి వుంటుంది.
“మీరు అరువు అడుగుతారు. నేను ఇస్తాను. మీరు తిరిగి డబ్బు కట్టరు. చివరికి నేను బాధ పడతాను.
“మీరు అడుగుతారు. నేను ఇవ్వను. ఇవ్వలేదని మీరు బాధపడతారు.
“నేను బాధ పడడం కంటే మీరు బాధ పడడమే మేలు కదా!”
అల్లాగే ఇక్కడ కూడా. మీకు నచ్చాలని నాకు నచ్చనివి నేను రాయను.
మీరు ఏమనుకున్నా సరే!
NOTE:
COURTESY IMAGE OWNER
మీకు రాయాలనిపించినవి రాస్తూ వుండండి, సర్! రోజూ కమెంట్ చేయలేకపోయినా మీ ప్రతి పోస్టూ చదువుతూనే వుంటాను నేను.
రిప్లయితొలగించండిమీకు నచ్చినట్లు మీరు వ్రాయండి. అలాగే మా అభిప్రాయం నిర్మొహమాటంగా చెబుతాము.
రిప్లయితొలగించండిఏమిటీ కండకావరము ! మాకు నచ్చినట్టుగా రాయరా ! ఔరా! :)
రిప్లయితొలగించండిమీకు జనుల, జనులనేలే మహరాజుల పల్స్ బాగా తెలుసు ఎలా ఎప్పుడు యితరుల నొప్పింపక తానొవ్వక రీతిలో రాయాలో తెలుసు . కాబట్టి రాస్తూండండి. చదివేవాళ్లు చదువుతారు. చదవని వాళ్లు ( పూర్తిగా) వాళ్లకు కావలసిన దానిని చదివి మొట్టికాయలేస్తారు.
జిలేబి
-
Lalitha గారికి, అజ్ఞాత గారికి, జిలేబి గారికి ధన్యవాదాలు - భండారు శ్రీనివాసరావు
రిప్లయితొలగించండి