మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు భీష్మ ద్రోణులు నేల కూలిన తర్వాత సైన్యాధిపత్యం స్వీకరించిన కర్ణుడు కదనరంగంలో అర్జునుడు లేని సమయం చూసి చెలరేగిపోతాడు. ధర్మరాజుపై శరపరంపరగా అస్త్రాలు ప్రయోగించి తీవ్రంగా గాయపరుస్తాడు.
సూర్యాస్తమయం కాగానే నాటి యుద్ధం ముగుస్తుంది.
గాయపడ్డ శరీరంతో, బాధ పడుతున్న మనసుతో ధర్మజుడు గుడారం చేరతాడు. అక్కడ తమ్ముడు ఆర్జునుడిని చూడగానే మనసులోని మాట పైకి వస్తుంది.
కర్ణుడు బాణ ప్రయోగంతో తనను నిలువెల్లా గాయపరుస్తుంటే
వెంట వుండి కాపాడాల్సిన పాండవ మధ్యముడు కనిపించకుండా పోయాడని’ నిందారోపణ చేస్తాడు.
కౌరవులతో సాగిస్తున్న ఈ మహా సమరంలో తాను ఒక్కడే
పదుగురి పెట్టున ప్రాణాలకు తెగించి పోరాడుతున్నానని, అలాంటి తనపైనే ఈ నిష్టూరాలు ఏమిటని బాధపడతాడు. ‘ఇంతటి నింద మోస్తూ
జీవించడం కంటే మరణమే మేలు’ అని ప్రాణత్యాగానికి పూనుకుంటాడు. అది గమనించిన
యుధిష్టురుడు, ‘తొందరపడి మాట తూలినందున తాను ప్రాణాలు త్యజించడమే
సబబని’ తమ్ముడిని వారించబోతాడు.
వీరి సంభాషణను ఆలకించిన శ్రీ కృష్ణుడు వారితో ఇలా
అంటాడు.
“మీరిద్దరూ ప్రాణాలు తీసుకోవాల్సిన అగత్యం లేదు. ఎందుకంటే తమ్ముడిని
నిష్కారణంగా నిందించినప్పుడే ధర్మజుడు మరణించాడు. అలాగే ఆత్మస్తుతికి
పాల్పడినప్పుడే పార్ధుడు జీవచ్చవంగా మారిపోయాడు”.
మహాభారతంలో ప్రక్షిప్త కధనంగా ప్రాచుర్యంలో ఉన్న ఈ
వృత్తాంతం తెలిపేదేమిటంటే ఆత్మస్తుతి (స్వోత్కర్ష) పరనింద (ఆరోపణ) వీటికి పాల్పడే
వాడు జీవించి వున్నామరణించినట్టు లెక్కే అని.
Can you please give reference to what chapter stanza/poem this was in Mahabharata? Let us see your Mahabharata knowledge first 😜
రిప్లయితొలగించండి40th chapter 121 stanza
తొలగించండిఆఫీసు ఉద్యోగుల్లో చాలా మంది ఈ కళలో ఆరితేరినవారే కనిపిస్తారండి.
రిప్లయితొలగించండిఈ కాలపు రాజకీయ నాయకుల సంగతయితే చెప్పనక్కర లేదు.
>> 40th chapter 121 stanza
రిప్లయితొలగించండిOh really? See here. Entire karma parva has no such thing. Read before posting or give a solid reference.
https://ebooks.tirumala.org/downloads/maha_bharatham_vol_10_karna_parvam.pdf
“అజ్ఞాత”లారా,
రిప్లయితొలగించండిఈ ఉదంతం కర్ణపర్వం లోనిదే. TTD వారి ebook ప్రచురణ కవిత్రయం విరచిత శ్రీ మదాంధ్ర మహాభారతం లో కర్ణపర్వంలో తృతీయాశ్వాసంలో 52 వ నెంబరు పద్యం దగ్గర నుంచీ 90 వ నెంబరు పద్యం వరకు ఉంటుంది - ముఖ్యంగా 84, 90 నెంబరు పద్యాలలో.
Yes somewhat similar things exist in Karna parva but the statement was modified as ““మీరిద్దరూ ప్రాణాలు తీసుకోవాల్సిన అగత్యం లేదు. ఎందుకంటే తమ్ముడిని నిష్కారణంగా నిందించినప్పుడే ధర్మజుడు మరణించాడు. అలాగే ఆత్మస్తుతికి పాల్పడినప్పుడే పార్ధుడు జీవచ్చవంగా మారిపోయాడు”
తొలగించండిWhat Krishna said was different.
Finally you read now atleast to know what is there. good. Initially started nothing there to atleast something there is better.
తొలగించండిDood I think you are the writer commenting as anonymous. I read it first and gave the link and before reading it I even knew it. I gave link so that YOU CAN READ IT. You OTOH are like an opportunitist. You talk one thing and do something else. At least the general public doesn’t preach like you do. Disgusting.
తొలగించండి