27, డిసెంబర్ 2022, మంగళవారం

వాళ్ళని గురించి వాళ్లకు పట్టదా

 ‘ఏమండీ చొక్కా గుండీలు సరిగ్గా పెట్టుకోకుండానే వెడుతున్నారు

‘ఒకసారి అద్దంలో చూసుకుని వెళ్ళండి, జుట్టు దువ్వుకోవడం మరచిపోయారు

‘ఎంచక్కా షేవ్ చేసుకోవచ్చు కదా! పైగా పోయేది పెద్దవాళ్లు వచ్చే ఫంక్షన్ అంటున్నారు!’

పాపం ఇప్పుడు ఏ లోకంలో వుందో ఏమో! ఇంట్లోనుంచి కాలు బయట పెట్టే ముందు ఎన్నిసార్లు ఇలా జాగ్రత్తలు చెప్పి పంపించిందేమో మరి.

ఇప్పుడు బతికుండి ఇప్పటి సినిమాలు చూసే భాగ్యం వుండివుంటే ......

అయ్యో లోకమే ఇలా తగలడిందని అనుకుని వుండేదేమో!

27-12-2022

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి