7, ఆగస్టు 2022, ఆదివారం

పుట్టిన రోజు దేవుడి కానుక – భండారు శ్రీనివాసరావు

 ఈరోజు తొలి వెలుగు రేఖలు విచ్చుకుంటూవుంటే,  నా కంటి ముందు మరో వెలుగు కనబడింది. కనబడడమే కాదు నాతో మాట్లాడింది కూడా.

‘నా పొరబాటో, నీ గ్రహపాటో తెలియదు. మొత్తం మీద  77 లోకి వచ్చావు. నువ్వు అడగకుండానే నీకో  అపూర్వమైన వరం ఇవ్వాలని అనిపించింది. అయితే ఓ షరతు. దానికి ఒప్పుకుంటేనే సుమా!’

‘.............’

‘చెబుతా విను. నువ్వు  ఆనందంగా వుండు. ఇతరులని సంతోషంగా ఉంచు. ఇలా చేస్తే ఇచ్చే వరమేమిటో తెలుసా? సంతృప్తి. ఇంగ్లీషులో  కంటెంట్ మెంట్ అంటారుట. అది సాధిస్తే  ఇక నాకిది కావాలి అని నన్ను ఎప్పుడూ సాధించవు. ఇలా తెల్లవారకుండానే వచ్చి  నీకు వరాలు ఇచ్చే పని నాకూ వుండదు. తెలిసిందా! డెబ్బయి ఏడేళ్లు వచ్చిన తర్వాత కూడా తెలియకపోతే నీ ఖర్మ. వస్తా!’  

(07-08-2022)

2 కామెంట్‌లు: