28, జూన్ 2022, మంగళవారం

చాయ్ పే చర్చ

 నిరాడంబరత్వం వ్యక్తిత్వ శోభని పెంచుతుంది.

జర్మనీలో  జరిగిన  అగ్రదేశాధినేతల సదస్సులో ఇద్దరు దేశాధినేతలు, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ,  ఫ్రాన్స్ అధ్యక్షులు ఎమ్మాన్యుయేల్  మర్కాన్ కలిసి  కూర్చుని చాయ్ తాగుతూ మాట్లాడుకుంటున్న ఈ దృశ్యం ఎంత రమణీయంగా వుంది. మన దేశంలో ఇది సాధ్యమా!  ఎంత హడావిడి చేస్తారు. పెద్ద పెద్ద టర్బన్లు పెట్టుకున్న సెవెన్ స్టార్  స్టివార్డ్స్,  స్టెన్ గన్ లు ధరించిన సాయుధ  అంగరక్షకులు, కనుసన్నల్లో వుండి కనిపెట్టి చూసే వ్యక్తిగత సిబ్బంది, టీవీ కెమెరాల హడావిడి! ఎంత గోలగోలగా వుంటుంది? ఇలా ఏ బాదరబందీ లేని దృశ్యాలు చూడడం మన దేశంలో ఎందుకు సాధ్యం కాదు?

బ్రిటిష్ రాచరికపు  శృంఖలాలు  తెంచుకున్నాము కానీ రాచరికపు వైభోగాలు ఇంకా మనల్ని ఇంగువ కట్టిన గుడ్డలా వెంటాడుతూనే వున్నాయి.

భారత్ స్వాతంత్ర అమృతోత్సవ్ సందర్భంగా అయినా ఆ  రాచరికపు అవశేషాలను కొంత మేరకు వదుల్చుకుంటే బాగుండు.  



(28-06-2022)

1 కామెంట్‌:

  1. సీను చూడడానికే హాయిగా ఉంది.

    ఇప్పటి ట్రెండ్ ఏమిటంటే (మీకు తెలుసుగా) వేదిక మీద మైకులో ప్రసంగిస్తున్న ప్రముఖుడి వెనకాల ఓ పది మంది ఉంటారు. ఆ నల్లకళ్ళ జోళ్ళ బలిష్ఠ సెక్యూరిటీ వాళ్ళని సరే అనుకున్నా వేరే వాళ్ళు కూడా గుమిగూడి కనుపిస్తారు. ఆ ప్రముఖుడికి తాము చాలా దగ్గర వాళ్ళం అని చూపించుకోవాలనే తాపత్రయమేమో? ఈ ప్రవర్తన వల్ల ఆ వక్త మీద (వక్త మీద మాత్రమే) ఉండవలసిన ఫోకస్ ఉండడం లేదు. సీను చూడడానికే చాలా చిరాకుగా ఉంటోంది.

    రిప్లయితొలగించండి