14, జూన్ 2022, మంగళవారం

సాయ్ లెన్స్ – భండారు శ్రీనివాసరావు

 

స్కూలు రోజుల్లో చూసిన సినిమాలో ఓ కోర్టు సీను లీలగా జ్ఞాపకం వుంది.
కోర్టు హాల్లో న్యాయమూర్తి ఆసనం పక్కనే దండం ధరించిన ఓ దండధరుడు నిలబడి ఉంటాడు. హాల్లో వాళ్ళు గుసగుసలాడుతున్నప్పుడు ఏమీ పట్టించుకోకుండా వుండిపోయి, అంతా నిశ్శబ్దంగా వున్నప్పుడు గొంతు గట్టిగా పెంచి, సాయ్ లెన్స్ అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఈ లెన్స్ గురించి మా ఫిజిక్స్ మాస్టారు ఎప్పుడూ చెప్పలేదు. అంచేత ఈ లెన్స్ ఏమిటా అనే సందేహం బాధించేది. తర్వాత తర్వాత అర్ధం అయ్యింది ఏమిటంటే అది సాయ్ లెన్స్ కాదు, సైలెన్స్.
ఇప్పుడే ఓ టీవీ చర్చలో రాజకీయ పార్టీల ప్రతినిధులు గోలగోలగా వాదాలు వినిపిస్తున్నప్పుడు యాంకర్ మౌనంగా వుండి, వాళ్ళు చల్లబడ్డ తర్వాత ప్లీజ్ ప్లీజ్ ఆగండి ఆగండి అని అంటుంటే వెనుక ఎప్పుడో చూసిన సినిమాలో ఆ దండధరుడి పాత్ర గుర్తుకు వచ్చింది.
(14-06-2022)

1 కామెంట్‌:

  1. భారత దేశపు మొట్టమొదటి దండధారిణి ఈ మధ్యే అపాయింట్ అయ్యారని మీడియా వార్త

    రిప్లయితొలగించండి