“రేపు సాయంత్రం మన ప్రెస్ క్లబ్ డైరీ ఆవిష్కరణ. మాజీ కార్యదర్శిగా మీరు వుంటే బాగుంటుంది. తప్పకుండా రండి” అన్నారు ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ రెడ్డి గారు. ఉ.. అనాలా? ఉహు అనాలా? అనే సందిగ్ధంలో ఉండగానే ఆ వెంటనే మరో ఫోను కార్యదర్శి రాజమౌళి చారి గారి నుంచి. అదే ఆహ్వానం.
వెళ్లాను. చాలామంది పాత స్నేహితులు కలిసారు.
దేవులపల్లి అమర్,
ప్రెస్ అకాడమీ అల్లం నారాయణ, హిందూ
రవికాంత్ రెడ్డి,
సీ.ఎం. పి.ఆర్.ఓ హజారే, దూరదర్సన్ మాజీ డైరెక్టర్ భగవాన్, షరీఫ్, నందిరాజు రాధాకృష్ణ, జాగర్లమూడి, అనిల్
కుమార్, ఈనాడు
ఉండ్రు నరసింహారావు, మెట్రో టీవీ జయప్రసాద్, సత్యమూర్తి,
వనజ అలా జాబితా రాసుకుంటూ పొతే చాలా పెద్డది. ఎన్నో ఏళ్ళ తర్వాత ఉమాదేవి కలిసింది.
క్లబ్ కార్యవర్గ సభ్యురాలు. మూడేళ్ల క్రితం వరకు దాదాపు వారానికి మూడు సార్లు మా
ఇంటికి వచ్చేది, టీవీ 5 కోసం బైట్లు రికార్డు చేయడానికి. మా ఆవిడతో మంచి
దోస్తీ. రికార్డింగ్ టైము అయిదు నిమిషాలు. వాళ్ళిద్దరి
ముచ్చట్లు కాఫీ తాగుతూ పావుగంట.
డైరీ ఆవిష్కరణ మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంపీ
సంతోష్ కుమార్ చేతుల మీదుగా జరిగింది. తర్వాత ఊహించని విధంగా నన్ను స్టేజ్ మీదికి పిలిచారు.
ముఖ్య అతిధుల చేతుల మీదుగా శాలువా కప్పి ఓ
పూల మొక్క అందించారు. ఎందుకు అంటే లోగడ కార్యదర్శిగా ప్రెస్ క్లబ్ కోసం పనిచేసినందుకు
అని చెప్పారు.
ఇంకా ఈరోజుల్లో ‘గుర్తుపెట్టుకోవడాలు’ ఇంకా
మిగిలే వున్నందుకు సంతోషపడాలి కదా! పడ్డాను.
ఒకరోజు ఆలస్యం అయినా గుర్తు పెట్టుకుని ఫోటోలు షేర్
చేసిన క్లబ్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు భూపాల్
రెడ్డికి ధన్యవాదాలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసంతోషం. అభినందనలు. మాజీని గుర్తుంచుకుని సన్మానించడం మెచ్చుకోదగిన పనే. ఈ కాలంలో అరుదు.
రిప్లయితొలగించండికరోనా విజృంభిస్తోందిట, జాగ్రత్తగా ఉండండి, సభలకు వెళ్ళడం గురించి ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటుండండి.
ఎందుకంటున్నాను అంటే మంత్రి జగదీశ్ రెడ్జికి కరోనా పాజిటివ్ వచ్చిందనీ, హోమ్ క్వారంటైన్ లోకి వెళ్ళాడనీ, ఇటీవల తనను కలిసిన వారందరూ పరీక్ష చేయించుకుంటే మంచిదన్నాడనీ ఇందాకే ఓ టీవీ ఛానెల్ లో వార్త (స్క్రోలింగ్) చూశాను. కాబట్టి జాగ్రత్తండి. పై ఫొటోలో చూస్తే మీరు మాస్క్ వేసుకున్నట్లు కూడా లేదు.
వాక్సిన్ బూస్టర్ డోస్ నిన్న మొదలైంది కదా, వేయించుకోండి. నేను నిన్న వేయించుకున్నాను.
ఉ.బో.స ఇచ్చానని అన్యధా భావించకండి.
మంత్రి జగదీశ్ రెడ్డి కి కరోనా పాజిటివ్
https://m.andhrajyothy.com/telugunews/corona-positive-to-minister-jagadish-reddy-mrgs-telangana-1922011110121369
విన్నకోట గారికి మీ మిత్ర వాత్సల్యానికి ధన్యవాదాలు. మరో విధంగా అనుకునే ఛాన్సే లేదు. - భండారు శ్రీనివాసరావు
రిప్లయితొలగించండి