15, సెప్టెంబర్ 2021, బుధవారం

ఇంజినీర్స్ డే

 ఈరోజు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతి

1908 లో మూసీ నదికి వరదలు వచ్చాయి. అవి కలిగించిన నష్టం అంతా ఇంతా కాదు. అప్పటి నిజాం నవాబు హైదరాబాదును ఇలా వొదిలేస్తే ప్రమాదం అని భావించి నగరాన్ని ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి చేయాలని సంకల్పించాడు. మైసూరు నుంచి ప్రముఖ ఇంజినీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని ప్రభుత్వం తరపున ఆహ్వానించి వరదలు రాకుండా అరికట్టడానికి, నగరాన్ని సుందరంగా అభివృద్ధి చేయడానికి తన సలహాదారుగా నియమించుకున్నారు. విశ్వేశ్వరయ్యగారి దూరదృష్టి పుణ్యమా అని నగరానికి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ అనే రెండు మంచి నీటి జలాశయాలు ఏర్పడ్డాయి. మూసీ వరదలకు కూడా ముకుతాడు వేసినట్టూ అయింది. అలాగే 1912 లోనే నిజాం నగరాభివృద్ధి మండలిని ఏర్పాటు చేసారు. ఈ మండలి ముందు చూపు ఫలితంగా హైదరాబాదు నగరానికి అప్పట్లోనే చక్కని రహదారులు, మార్కెట్లు, దుకాణ సముదాయాలు ఏర్పాటయ్యాయి.



(15th September)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి