14, సెప్టెంబర్ 2021, మంగళవారం

పుస్తక దాతా! సుఖీభవ!

 

సాయంత్రం ఎవరో ఫోన్ చేసి అమెజాన్ డెలివరీ బాయ్ ని, ఇంట్లో వున్నారా అని అడిగాడు. వున్నానని చెబితే కిందనే వున్నాను, మీకు ఒక పార్సెల్ ఇవ్వాలి అన్నాడు.

అమెజాన్ కు కాదు కదా అసలు ఈ ఆన్ లైన్ లో నేను ఏదీ కొనను. అతడు వచ్చి పార్సెల్ ఇచ్చిన తరువాత చూస్తే నాపేరు, అడ్రసు స్పష్టంగా కనిపించాయి. ఓపెన్ చేస్తే ఒక ఇంగ్లీష్ పుస్తకం వుంది. ప్రచురించింది రూపా పబ్లికేషన్స్, ఢిల్లీ. పంపింది చిత్రప్రసాద్ బహదూర్, భువనేశ్వర్. రాసింది అత్యుత సామంత. (సామంత అనాలో సమంత అనాలో తెలియని పరిస్థితి. పుస్తకం పేరు My Mother My Hero.

వెనుక అట్టమీద ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు ఈ పుస్తకం గురించి రాసిన మాటలు వున్నాయి.

When I was going through the pages of the book, I could not but feel enormous respect and reverence for a mother who fought every odd to single-handedly raise her seven children. Despite abject poverty and lack of resources, she ensured that all her children got good education and became responsible citizens. I was moved by the account of Dr. Achyuta Samanta’s father’s death.

“We read biographies of entrepreneurs, explorers, and scientists, but writing the biography of a mother is something different and unique. Very inspiring.”

అని రాశారు ఆయన.

రెండువందల పేజీల ఈ పుస్తకం ఖరీదు Rs.295/- అని అమెజాన్ Invoice లో వుంది.

నా ముక్కూ మొహం తెలియక పోయినా పుస్తకాన్ని నా చిరునామాకు భద్రంగా పంపిన చిత్ర ప్రసాద్ బహదూర్ వారికి నమోవాకాలు.






(14-09-2021)       

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి