1, ఏప్రిల్ 2021, గురువారం

రజనీకాంత్ కి ఫాల్కే అవార్డ్

 

‘రజనీకాంత్ కి  ఫాల్కే అవార్డ్ అని స్క్రోలింగ్ వస్తోంది. అదేమిటి ఆయన స్టేచర్ కి  ఎప్పుడో వచ్చి ఉండాలే. ఇప్పుడేమిటి ఇలా! నిజానికి ఆయనకి ఇవ్వాల్సింది భారతరత్న

అన్నాడు ఓ మిత్రుడు ఫోన్ చేసి.

సరే  ఆయన భాషా అభిమాని, కాబట్టి ఆయనకు అర్ధం అయింది అది.

నాకు అర్ధం కాని విషయం ఓటుంది. ఇలా ఫాల్కే అవార్డుల వంటివి  సమయం సందర్భం చూసుకోకుండా ప్రకటించవచ్చా!

గతంలో ఇలాగే తమిళనాడు ఎన్నికలకు ముందు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్జీ రామచంద్రన్ కు ఏకంగా భారత రత్న ప్రకటించింది కదా! ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఫాల్కే అవార్డ్ ప్రకటించింది అని సర్దిపుచ్చుకుంటే పోలా!

కానీ ఈ ట్రిక్కులు ఓట్లు రాల్చవని కాంగ్రెస్ కు అప్పుడు బోధ పడిన సంగతి ఇప్పటి పాలకులకు గుర్తు లేదేమో!

ఏదిఏమైనా ఒక మంచి నటుడికి ఒక మంచి అవార్డ్ ఇవ్వడం సంతోషించదగ్గ విషయం.

ఇచ్చిన ప్రభుత్వానికి, పుచ్చుకునే భాషాకు అభినందనలు.   

(01-04-2021)

10 కామెంట్‌లు:

  1. అవార్డులకు ఇంకా విలువలు ఉన్నాయని ఎవరన్నా నమ్ముతున్నారా అని నా సందేహం. మీరన్నట్లు అవార్డులు కూడా రాజకీయతాయిలాల్లాగా ఎప్పుడో మారిపోయి పరిహాసభాజనమైపోయాయి. అందుచేత అవార్డులు పొందిన వారందరూ అంత అర్హులు కాకపోవచ్చును - అవార్డులు రానివారిలో ఆ అవార్డులకన్నా మిక్కిలి గొప్పవిలువైన జాతిరత్నాలు ఉండవచ్చును.

    రజనీకాంత్ గొప్ప నటుడే అని ఇప్పుడు చెప్పకతప్పదు. కాని ఆయన తెలుగుసినీప్రపంచం నుండి అక్షరాలా త్రోసివేయబడ్డాక పత్రికల్లో తెలుగు డిస్కార్డ్ అన్న బిరుదంతో ఆయనపేరు పడిన సందర్భాలు ఉన్నాయని ఎందరికి ఇప్పుడు తెలుసును?

    రజనీకాంత్ కమ్మర్షియల్ నటుడిగా గొప్ప విజయం సాధించిన మాట వాస్తవం. ఐతే ఆయన సినిమారంగం అభివృధ్ధికి చేసినకృషి యేమిటి అని అడిగితే సమాధానం ఏమి వస్తుంది? అయన వ్యక్తిగత విజయం సినిమా రంగ విజయం కాదే.

    పోనివ్వండి. అసలు దక్షిణాది వారికి అవార్డులు రావటమే అపురూపం కదా. ఆనందించండి.

    రిప్లయితొలగించండి
  2. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం టెండూల్కర్ కి భారతరత్న, రాజ్యసభ సభ్యత్వం ఇచ్చింది. అయినా ఘోరంగా ఓడిపోయింది.‌

    రిప్లయితొలగించండి
  3. రజనీకాంత్ కు దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం ఏమిటండీ బాబూ?????? 😳😳

    ఏదో సీనియారిటీ బట్టి ప్రమోషన్ ఇచ్చినట్లుగా ఫాల్కే అవార్డ్ కూడా ఇచ్చేస్తున్నారా ఏమిటి? అదే ప్రాతిపదికన ఏదో ఒక రోజున తెలుగు సినీరంగంలోని రజనీ కాంత్ సమకాలీనుల్లో ఎవరికైనా కూడా ఆ అవార్డ్ దక్కినా ఆశ్చర్యం లేదు.

    లోకం లోని సమస్యలను సింగిల్ హేండెడ్ గా పరిష్కరించినట్లు చూపించుకోవడం, వైర్ వర్క్ తోనో, డూపుల తోనో ఫిజిక్స్ సూత్రాలకు కూడా అంతుపట్టని విన్యాసాలు చేయించడం, ఓ ఏభై మంది మూక తన వెనక తైతక్కలాడుతుంటే తను అర్థం పర్థం లేని పాటలకు సోకాల్డ్ డాన్సులు చెయ్యడం, పది నిమిషాలకొకసారి తనొక్కడే చిత్రవిచిత్ర ఆయుధాలతో ఓ ఇరవై మందిని చితక్కొట్టినట్లు చూపిస్తూ వయొలెన్సే హీరోయిజం అని తయారు చేసి పెట్టిన ట్రెండుని అంతకంతకూ వృద్ధి చెయ్యటం (వెరైటీ పేరున) - వగైరా వగైరాలు కదా వీళ్ళ చిత్రరాజాలు? వీళ్ళ ఫార్ములా సినిమాలతో సమాజం లోని యువత ఎంతగా ప్రభావితమై పోతున్నారన్నది వాళ్ళకు అనవసరమేమో అనిపిస్తుంది. ఇంకా అవార్డులు కూడానూ?
    పాపం ఫాల్కే గారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. ఆయ్ ! మా రజినీని ఇంతేసి మాటలంటారా!
      దమ్ముంటే మెరీనా బీచ్ కాడికొచ్చి మైకెట్టి ఈ మాటలనండీ చూద్దాం


      బస్తీ మే సవాల్

      జిలేబి

      తొలగించండి
    2. తెలుగు సినిమా రంగం మోహన్ బాబు గారుండగా మాకేం బయ్యం, ఛాలెంజా 🥶?

      తొలగించండి
  4. ఏముందీ. ఒస్తే కొండ.. పోతే వెంట్రుక(ఓ అవార్డు)

    రిప్లయితొలగించండి
  5. Netflix లో “Harishchandrachi Factory” అనే మరాఠీ భాషా చిత్రం ఉంది. తప్పక చూడండి (మరాఠీ భాష రానివారు - నాకూ రాదు లెండి 🙂 - ఇంగ్లీషు సబ్ టైటిల్స్ పెట్టుకుని చూడవచ్చు). భారతీయ చలనచిత్ర రంగ చరిత్రలో మొట్టమొదటి చలనచిత్రం “రాజా హరిశ్చంద్ర” ను ఎంత తపనతో ఎంత శ్రమ కోర్చి నిర్మించడంలో ఫాల్కే గారు చేసిన “కృషి” ని బాగా చూపిస్తుంది ఆ సినిమా. ఆ విధంగా ఫాల్కే గారు శ్రీకారం చుట్టారు.
    ఆ మహానుభావుడి పేరున నెలకొల్పిన పురస్కారం ఇది.

    రిప్లయితొలగించండి
  6. విన్నకోట వారు "పాపం ఫాల్కే గారు" అన్నారు. చిరు డ్రీమ్స్ గారు "ఏముందీ. ఒస్తే కొండ.. పోతే వెంట్రుక(ఓ అవార్డు)" అన్నారు. నిజానికి అంతే.

    ఈరోజున అసలా ఫాల్కే గారు ఎవరో, సినీరంగానికి ఆయన ఏమవుతారో ఏలాగు సేవచేసారో అవార్డుకమిటీల్లో కూర్చున్న వాళ్ళకూ చూచాయగా మించి తెలియకపోయినా, అసలు వారిలో ఎక్కువమంది అసలెవరీ ఫాల్కే అని కూడా తెలియని పరిస్థితిలో ఉన్నా కొంచెం కూడా మనం ఆశ్చర్యపోనక్కర లేదు. అటువంటప్పుడు జరుగుతున్నదల్లా, ఏదో ఒక ఫలానా ఒక మంచి అవార్డు ఉంది, ఫలానా వారికి ఇస్తే లాభం ఉండే అవకాశం ఉంది అనిపిస్తే చాలును, ఆ ఫాల్కే ఆత్మ ఎంత కటకటపడితే మాత్రం మనకేం?

    ఇకపోతే విన్నకోట వారు "తెలుగు సినీరంగంలోని రజనీ కాంత్ సమకాలీనుల్లో ఎవరికైనా కూడా ఆ అవార్డ్ దక్కినా ఆశ్చర్యం లేదు" అని అన్నారు. అది మాత్రం గొప్ప అత్యాశ. అస్సలు తెలుగువాణ్ణి ఢిల్లీలో ఎవరూ పట్టించుకోరు - రాజకీయ అవసరం అన్నది మీదుమిక్కిలి ఐతే తప్ప. కాని ఈరోజున తెలుగువాడు అంటే జాతీయరాజకీయవర్గాల్లో ఎంతమాత్రం‌ ఖాతరు లేదు. తెలుగువాళ్ళు నాలుగుడబ్బులు పడేస్తేనో, మరేదైనా తాయిలాలు చూపిస్తేనో, లేదా కాస్త భయపెడితేనో దడాదడా ఓట్లు కురిపించేస్తారని ఘాట్టిగా నమ్ముతున్నారు.ఈ తెలుగువాళ్ళు ములిగినా తేలినా జాతీయస్థాయిలో ఏమాత్రమూ ప్రభావం పడదన్నది రూఢి ఐపోయిందనే రాజకీయపార్టీల నమ్మకం. అదే‌ం కాదూ, "మా తడాఖా చూడండి ఖబడ్దార్" అనే దమ్ము తెలుగువాడికి లేదని వారానికి ఒకసారైనా ఈమధ్య ఋజువు అవుతోందే, ఇంకా తెలుగువాళ్ళకి అవార్డుల తాయిలాలు వేయటం దేనికండీ బాబూ - అవి మరెవరికైనా ఇచ్చి రాజకీయప్రయోజనం ఆశించవచ్చు కదా. మాటవరసకు విశాఖఉక్కు గొడవ చూడండి. మొన్నా భోగరాజు వారు స్థాపించిన తెలుగు గౌరవపతాక ఆంధ్రాబ్యాంక్ చూడండి. ఏది తెలుగుపౌరుషం కథ? ఇలంటి వేషాలు తమిళులు సహించే వారా? అసలు వారి జోలికి పోయే దమ్ముందా అక్కడ ఢిల్లీలో? అసలే అంతంత మాత్రం గౌరవం మనకి. దానికితోడు మనలో మనం నిత్యం తన్నుకు చావటం. దేశం అంతా తమాషా చూడటం. "గతమెంతొ ఘనకీర్తి కలవోడా" అని పాడుకొని మురవటం తప్ప ఈ తెలుగువాళ్ళు ఎందుకు పనికివస్తారండీ?

    రిప్లయితొలగించండి
  7. ఎవరో ఒక తెలుగు రంగ నటుడికో / నటికో ఫాల్కే అవార్డ్ రావడం అంత అసాధ్యమేమీ కాదేమో? ఈ నాడు తమిళ నటుడికి ఎన్నికల ముందు ఇచ్చినట్లుగానే రేపు ఏపీలో ఎన్నికల ముందు కూడా ఇలాగే ప్రకటించరని గట్టిగా చెప్పలేం - చిరు డ్రీమ్స్ గారి "ఏముందీ. ఒస్తే కొండ.. పోతే వెంట్రుక(ఓ అవార్డు)" థియరీ ప్రకారం.

    రిప్లయితొలగించండి
  8. విశ్వనాధుడికి ఫాల్కే అవార్డు ఇచ్చారు.
    రాముడే ఇచ్చాడు బ్లాగు ఒకటి...

    రిప్లయితొలగించండి