17, సెప్టెంబర్ 2020, గురువారం

మూడు పరిష్కారాలు, పరిమితులు – భండారు శ్రీనివాసరావు

మొట్టమొదటిది, మీడియా స్వేచ్ఛగా తన విధులు నిర్వహించుకునేందుకు వీలుగా ఎలాంటి నిర్బంధాలు లేకుండా చూడడం. అదే సమయంలో మీడియా సైతం తన బాధ్యతగా స్వీయ నియంత్రణ పాటించడం. అయితే దీనికి ప్రధానమైన అడ్డంకి స్వీయ ప్రయోజనాలు. వీటిని వదులుకోవడం నేటి పోటాపోటీ ప్రపంచంలో సాధ్యమా?

రెండు,  ప్రభుత్వ వ్యవహారాల్లో పూర్తి పారదర్సకత. తీసుకుంటున్న నిర్ణయాలు,  జారీ చేసిన జీవోలు ఎప్పటికప్పుడు పబ్లిక్ డొమైన్ లో వుంచడం. (దేశ భద్రత, మత విద్వేషాలు రెచ్చగొట్టే  అంశాలకు సంబంధించిన వాటిని మినహాయించి, మిగిలిన అన్నింటినీ ఎటువంటి భేషజాలకు పోకుండా ప్రజలకు అందుబాటులో వుంచడం)

ఇక మూడవది, అతి ప్రధానమైనది ఏమిటంటే, న్యాయస్థానాలు కూడా స్వీయ నియంత్రణ పాటించడం. రాజ్యాంగం ప్రసాదించిన విశేష హక్కులు, అధికారాలను సంయమనంతో ఉపయోగించుకోవడం. తాముకూడా రాజ్యాంగ వ్యవస్థల్లో ఒక భాగమని  ఎల్లప్పుడూ గుర్తెరిగి వ్యవహరించడం. ఇటీవలి కాలంలో ఈ వ్యవస్థపై ముసురుకుంటున్న అనుమానాలు, చోటు చేసుకుంటున్న అవాంఛనీయ పరిణామాల దృష్ట్యా న్యాయ వ్యవస్థే తనకు తానుగా ముందుకు వచ్చి కోర్టు ధిక్కరణ వంటి అంశాల్లో ప్రజల్లో పెరుగుతున్న సందేహాలను నివృత్తి చేయడానికి వీలుగా వాటిపై  దేశవ్యాప్త బహిరంగ చర్చను ఆహ్వానించడం.

ఈ మూడు వ్యవస్థలలో దాపరికం లేకుండా చేయగలిగితే అంతకంటే ఉత్తమ పరిష్కారం మరోటి వుండదు.

ఇవన్నీ జరిగే పనులు కావని తెలుసు. కానీ సామాన్యుడి మనసులో మాట చెప్పుకోవాలిగా, అదీ స్వీయ నియంత్రణ  పాటిస్తూ. (17-09-2020)  

5 కామెంట్‌లు:

  1. స్వీయ నియంత్రణ అనేది పెద్ద బోగస్ పదం . మీడియా ప్రభుత్వ నియంత్రణ నుండి తప్పించుకోవడానికి తెలివిగా తెచ్చుకున్న పదం . అందరికి తెలుసు , మీడియా ఎంత నియంత్రణ లో ఉంటుందో . TRP లేకపోతె పూట గడవని మీడియా స్వీయ నియంత్రణ లో ఉంటుందా ? ఆకలేసినోడికి , ఎదురుగా ఉన్న ఆహారాన్ని తినొద్దు , నైతిక విలువలు , స్వీయ నియంత్రణ అంటే వాడు ఆగుతాడా ?

    రిప్లయితొలగించండి
  2. @ అజ్ఞాత : "...... ప్రధానమైన అడ్డంకి స్వీయ ప్రయోజనాలు. వీటిని వదులుకోవడం నేటి పోటాపోటీ ప్రపంచంలో ( మీడియాకి) సాధ్యమా?" ఈ వాక్యం చదవలేదా!

    రిప్లయితొలగించండి
  3. Self-restraint and regulation are much more desirable, less costly, less intrusive, and more effective at all times. Otherwise, we will need government regulation (by bureaucrats in practice) for everything, and it has its own serious issues. Self-regulation and restraint require tremendous commitment whether it is at an individual or institutional level. This has been the lesson from all our puranas. Ultimately, in a democratic society, it is the society at large which has to enforce this with appropriate rewards and punishment structure. An open and healthy debate on how to do this is highly desirable.

    రిప్లయితొలగించండి
  4. కేంద్ర న్యాయ శాఖ మంత్రి శ్రీ రవిశంకర్ ప్రసాద్ గారు ఇటీవల ఒక మంచి వ్యాసం వ్రాశారు.

    Ravi Shankar Prasad writes: Those who have been defeated repeatedly by the people of India through a popular mandate cannot and should not control the polity and governance through collusive cases from the corridors of the Supreme Court and other courts. This is unacceptable.

    రిప్లయితొలగించండి
  5. మీరు చెప్పింది ఎలా ఉందంటే ,మానవులంతా నీతి,నిజాయితీలతో ఉండాలి,అవినీతికి పాల్పడకూడదు అన్నట్టు ఉంది.
    చట్టాలు చేసే ప్రభుత్వాలలో నిజాయితీ లేనప్పుడు,ఓటుకు ప్రజలు విలువ ఇవ్వని నాడు ,ఇవి వినడానికి బాగుంటాయి.పగటి కలలుగా మిగిలిపోతాయి.

    రిప్లయితొలగించండి