శరత్ చంద్ర మంచి రచయిత. రచయిత పెట్టుకున్న కలం పేరు ఇది. అసలు పేరు ఆర్.డి. విల్సన్. శరత్ చంద్ర పేరుతొ సాహితీ వ్యవసాయం, విల్సన్ పేరుతొ రాజకీయ సేద్యం చేస్తుంటారు. అయితే ఈ రెండు విభిన్న పాత్రల స్వభావాల నడుమ ఆయనే ఒక స్పష్టమైన విభజన రేఖ గీసుకున్నారు.
కోరానా దుష్పరిణామాల నేపధ్యంలో సమాజం పట్ల బాధ్యత కలిగిన ఒక రచయితగా స్పందిస్తూ ఇలా ఒక పోస్టు పెట్టారు.
"కరోనా రోగి భారం ప్రభుత్వాలే భరించాలి.ఆ భరోసా ఇవ్వకపోతే రోగం వచ్చిన వాళ్ళు కుమిలిపోతారు.
"ఒక ఏడాది పాటు అందరూ రాజకీయాలు చేయడం మానేయాలి"
ఈ సలహాకు నేనిచ్చిన సూచన ఇది.
"రెండో సలహా భేషుగ్గా వుంది. అయితే, రాజకీయులు తమకు అలవాటయిన రాజకీయాలు మానడం అంత తేలిక కాదు. కాబట్టి వాళ్ళు ఈ మాట నిలబెట్టుకోవాలంటే ఒకటే మార్గం. దాన్ని మూడో సలహా కింద మీరే ఇవ్వండి. ఎందుకంటే మీ కత్తికి రెండు వైపులా పదును. రాజకీయ పార్టీ ప్రతినిధి గానే కాకుండా ప్రసిద్ధ రచయితగా మీ మాటకు విలువ వుంటుంది.
ఇంతకీ ఆ మూడో సలహా ఏమిటంటే... ఏమిటంటే.. చెప్పేస్తున్నాను.
"కనీసం ఓ ఆరు మాసాలపాటు టీవీల్లో రాజకీయ చర్చాకార్యక్రమాలు ప్రసారం చేయకుండా ఆంక్షలు విధించాలి"😊
రిప్లయితొలగించండిఏమండీ భండారు వారు మీ టీవీ వ్యాపకానికి మీరే యెసరెట్టేసుకుంటున్నారు :)
జిలేబి
>> కనీసం ఓ ఆరు మాసాలపాటు టీవీల్లో రాజకీయ చర్చాకార్యక్రమాలు ప్రసారం చేయకుండా ఆంక్షలు విధించాలి.
రిప్లయితొలగించండిచిన్నసవరణ అండీ
కనీసం ఓ ఆరు పుష్కరాలపాటు టీవీల్లో రాజకీయ చర్చాకార్యక్రమాలు ప్రసారం చేయకుండా ఆంక్షలు విధించాలి.