24, జూన్ 2020, బుధవారం

గోపీ చెప్పిన తీర్పు

‘హోటల్ భేటీ మీద మీ అభిప్రాయం ఏమిటి?’

‘శ్రీ సుజనా చౌదరి, శ్రీ కామినేని శ్రీనివాస్ ఇద్దరూ ఒకే  పార్టీ వాళ్ళు. వారిద్దరూ ఎక్కడ కలుసుకున్నా, ఎప్పుడు కలుసుకున్నా  ఎవరికీ ఎలాంటి అభ్యంతరం వుండనక్కరలేదు. ఇక శ్రీ నిమ్మగడ్డ రమేష్ కుమార్  విషయానికి వస్తే, ఆయన అక్కడికి వెళ్ళడం ఔచిత్యమా కాదా అన్నది ఆయన ప్రస్తుత హోదా మీద ఆధారపడిఉంది. ఇంతవరకు అంటే ఈకలయిక జరగడానికి ముందు వరకు  వైసీపీ వాళ్ళు చేస్తున్న వాదనల ప్రకారం నిమ్మగడ్డ ఆ పదవీ బాధ్యతలు స్వీకరించనట్టే లెక్క. అంటే ఆయన ప్రస్తుతం ఒక స్వేచ్చాజీవి. కాబట్టి హోటల్లో కలవడంలో తప్పులేదు. కానీ ఆయనే తన ముందరి కాళ్ళకు బంధాలు వేసుకున్నారు. ఆయన తొలగింపుపై  రగడ నడుస్తున్నప్పుడు ఆయన స్వయంగాను, ఆయన లాయరు కూడా సుప్రీం మధ్యంతర ఆదేశాలు వచ్చిన మరుక్షణం నుంచీ నిమ్మగడ్డే  ఎస్.ఈ.సి. అని పలుమార్లు పలు టీవీ ప్రత్యక్ష ప్రసారాల్లో స్పష్టం చేశారు. అదే నిజమని అనుకున్నప్పుడు అలా రాజ్యాంగ బద్ధమైన హోదాలో ఉన్న వ్యక్తి వేరేవారిని అదీ రాజకీయ నాయకులను అలా  హోటలుకు వెళ్లి  కలవడం నైతికంగా పొరబాటే అవుతుంది.

ఈ నెల పదమూడో తేదీ నాటికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఏపీ ప్రభుత్వంలో ఎస్.ఈ.సి. అవునా కాదా (రాజ్యాంగబద్ధమైన పదవిలో వున్నారా లేదా) అన్నదానిబట్టి ఈ కలయికలోని మంచిచెడ్డలను విశ్లేషించుకోవాల్సివుంటుంది. వైసీపీ తరపున వాదించేవాళ్ళు, నిమ్మగడ్డ తరపున వాదించేవాళ్ళు ఈ విషయాన్ని ముందు నిర్దారించుకోవాల్సివుంటుంది’.

అంటే ఏమిటన్నమాట! నిమ్మగడ్డ ఆ పదవిలో కొనసాగుతున్నారని వైసీపీ వారయినా ఒప్పుకోవాలి. లేదా ఆయన ఆ పదవిలో లేరని నిమ్మగడ్డ మద్దతుదారులు అయినా అంగీకరించాలి’    (24-06-2020)   


2 కామెంట్‌లు:

  1. అసలు విషయం అది కాదు. కుమ్మక్కు అయ్యాడా లేదా అన్నది తెలిసి పోయింది.

    కుల కుట్ర రాజకీయం బట్ట బయలు అయ్యింది.

    రిప్లయితొలగించండి
  2. అసలు విషయం ఆయన పదవి లో ఉన్నారా ? లేరా ? అని కాదు .
    కానీ ఒక బాధ్యత మైన పదవి లో ఉన్నప్పుడు , ఒక పార్టీకి మద్దతు గా వ్యవహరిస్తున్నారు అని ఆరోపణలు ఉన్నాయి .
    ఈ భేటీ చుస్తే అదే నిజమేమో అనిపిస్తుంది . వేరే డిపార్ట్మెంట్ లు కాకూండా , ఎలక్షన్ కమిషన్ లాంటి ఇండిపెండెంట్ బాడీ లో ఉంటూ చంద్రబాబు రైట్ లెగ్ , లెఫ్ట్ లెగ్ లాంటి వ్యక్తులతో , ఈయన కలవడం , .. . మరీ ఇలా సీక్రెట్ గా కలవడం .

    నిజం చెప్పాలంటే నిజాయితీ గా ఉండటం ( ప్రాధమిక లక్షణం ) కూడా ఒక ఆభరణం అయిపొయింది .


    రిప్లయితొలగించండి