శ్రీనివాసరావు గారు,
మీరు ఇక్కడ నెమరు వేసుకునే జ్ఞాపకాలు ఆసక్తికరంగా ఉంటున్నాయి. అప్పుడప్పుడు కొన్ని రిపీట్ అవుతున్నప్పటికీ ... ఫరవాలేదు, ఎప్పటికప్పుడే చదివించేలా ఉంటున్నాయి.
ఒక మాటడుగుతాను, ఏమనుకోకండి. విలేకరిగా మీ అనుభవాలను చెబుతుంటే చాలాసార్లు నాకొక సందేహం కలుగుతుంటుంది. ప్రతి ముఖ్యమంత్రికి, ప్రభుత్వంలోని ఉన్నతొద్యోగులకు మీరు అంత సన్నిహితులవడం ఎలా సాధ్యమయింది? ప్రతి రేడియో / దూరదర్శన్ విలేకరికి అది మామూలేనా? ముఖ్యమంత్రితో కలిసి వారి కారులోనే వెళ్ళడం, మిమ్మల్ని రోడ్డు మీద చూసి ముఖ్యమంత్రి గారు తన కారాపి మిమ్మల్ని కూర్చోబెట్టుకోవడం, ఫొటోలో పడేటంత దగ్గరగా వారి పక్కనే నిలబడుండటం, మీకు కాలు ఫ్రాక్చర్ అయితే మీ ఇంటికొచ్చి పరామర్శించడం, వగైరాలు ... అంత సన్నిహితులు ఎలా అవగలిగారు? మీ విజయరహస్యం ఏమిటి? మీలో ఉన్న ఆ స్పెషల్ క్వాలిటీస్ ఏమిటి?
సాధారణంగా మీ బ్లాగులో వ్యాఖ్యలకు మీరు మౌనం వహిస్తుంటారు అని తెలిసినదే అనుకోండి. కానీ నా ఈ సందేహాన్ని మాత్రం తీర్చమని మనవి. ఎందుకంటే మీ జవాబుని బట్టి "విలేకరినైనా కాకపోతిని, సి ఎం కారులో వెళ్ళగా" అని నా గురించి నేను వాపోవచ్చా లేదా అనేది తేల్చుకుందామని (వాపోయినా ఒక జీవితకాలం లేటనుకోండి, ఈసారికిలా పోనియ్యి అనుకోవడమే), హ్హ హ్హ హ్హ :)

నిజాయితీ+సిన్సియారిటి+ప్రతిభ+లౌక్యం
- awesome combination
-అజ్ఞాత
@విన్నకోట నరసింహారావు గారూ. (And
also @ అజ్ఞాత)
మీ అభిమానానికి ధన్యవాదాలు. నేను ప్రతి వ్యాఖ్యకి ప్రతిస్పందించని మాట నిజం. మీ
ప్రశ్నకు కింద ఎవరో అజ్ఞాత చక్కటి సమాధానం ఇచ్చారు
(నిజాయితీ+సిన్సియారిటి+ప్రతిభ+లౌక్యం - awesome combination). నిజాయితీ, సిన్సియారిటీ, ప్రతిభ వీటి సంగతి పక్కన బెడితే
చివరిది లౌక్యం కరక్టేమో అనిపిస్తోంది. అందుకే అజ్ఞాత గారికి కూడా ధన్యవాదాలు
తెలియచేసుకుంటున్నాను.
ఈ విషయాలు అన్నీ లోగడ నా బ్లాగులో వచ్చినవే. ఈ మధ్య నా వ్యక్తిగత జీవితంలో సంభవించిన ఒక పూడ్చుకోలేని నష్టంతో (నా భార్య మరణం) బాధ పడుతున్నప్పుడు మనసు మళ్ళించుకోవడానికి నేను ఎన్నుకున్న మార్గం ఇది. సూర్య పత్రిక సంపాదకులు కూడా ప్రోత్సహించారు. అందువల్ల ఈ పాత కధలు చాలావరకు పునర్దర్సనమిస్తున్నాయి.
ఇకపోతే మరో ప్రశ్న అడిగారు. పెద్దపెద్ద వారితో ఈ విధమైన సాంగత్యం, సాన్నిహిత్యం ఒక రేడియో విలేకరికి ఎలా సాధ్యమని?. ఈ రోజుల్లో అది అసాధ్యం. నా ఉద్యోగం చివరి దశలో నాకీ వైభోగంలేదు. వందలో ఒకడిని. మందలో అంటే బాగుంటుందేమో.
ఒక ఈనాడు, ఒక టీవీ నైన్ ఇప్పుడు ఎలాగో, ఇన్ని రకాల ప్రచార, ప్రసార మాధ్యమాలు లేని రోజుల్లో రేడియోదే అగ్రస్థానం. నేను వచ్చానా లేదా అన్నది చూసుకున్న తర్వాతే ముఖ్యమంత్రులు ప్రెస్ కాన్ఫరెన్సులు మొదలు పెట్టిన రోజులు వున్నాయి. అది నా గొప్పతనం ఎంతమాత్రం కాదు, అది నూటికి నూరు శాతం రేడియోదే. నమస్కారాలు.

-
భండారు శ్రీనివాసరావు
జవాబిచ్చినందుకు Thanks శ్రీనివాసరావు గారూ. ఆ గొప్పతనం మీది కాదు అని చెప్పడం మీ వినమ్రత.
రిప్లయితొలగించండిఇప్పుడు రేడియో వార్తలు పట్టణాలలో ఎవరూ వినడం లేదు అనిపిస్తుంది.
రిప్లయితొలగించండి24 గంటలు గొట్టం వార్తలు వచ్చిన తరువాత రేడియో వినే ఓపిక తీరిక ఎవరికీ లేదు.
భండారు శ్రీనివాసరావు సర్ గారు రేడియో ఇప్పటికీ వింటున్నారా.
Still radio can play a role.
People over 50 like me recall radio with nostalgia.
భండారు గారిది మధ్యే మార్గం గా తోస్తుంది. ఆయన మాటలు రచనల్లో మెచ్చుకోళ్లు విరివిగా నలుగు పెట్టినట్టుగా, విమర్శలు పైపూతల్లా ఉంటాయి కాబట్టి ఆయన అందరివాడు అయ్యారు.
అజ్ఞాతంగా వ్యాఖ్యలు వ్రాయడంలో అదో తుత్తి.
అది సార్ గారికి నచ్చినందుకు బుచికోయమ్మ బుచికి.
@ అజ్ఞాత: రేడియో ఇప్పటికీ వింటున్నారా అని అడిగిన అజ్ఞాత చదువరికి ధన్యవాదాలు. మొబైల్ ఫోన్లో దాన్ని రింగ్ టోన్ అంటారో, ఇంకేదైనా అంటారో నాకు తెలవదు. నాకేవరయినా ఫోన్ చేస్తే వినబడేది ఆలిండియా రేడియో సిగ్నేచర్ ట్యూన్. రేడియో కార్యక్రమాలు ప్రతి ఉదయం మొదలు కావడానికి ముందు ఈ ట్యూన్ వినబడుతుంది, ఇప్పటికీ వినొచ్చు.
రిప్లయితొలగించండి