‘ఏమోయ్! ఒసే! ఇలా పిలుపులు లేవు. నేను
ఆమెకు ‘ఏమండీ’. ఆమె నాకు ‘మిస్టర్’. పెళ్ళయిన మొదటి రోజునుంచీ ఇంతే!
'నా బాసూ నా బానిసా నా భార్యే. నా
తప్పులు సరిదిద్దడానికి బాసు. నా తప్పులు భరించడానికి బానిస. ఇలా 48 ఏళ్ళు నాతో కాపురం వెళ్ళదీసింది'
‘మా ఆవిడ భయపడదు, నాకు కాదు. నేనూ భయపడతాను,అయితే ఆవిడకి
కాదు.
‘ఇప్పటికే రెండు గుండె ఆపరేషన్లు. ఏటా
ఒకసారి పుట్టింటికి వెళ్ళినట్టు ఆసుపత్రిలో మూడు నిద్రలు చేస్తుంది. ఇంటికి రాగానే
జబ్బుల సంగతి మర్చిపోతుంది.
‘నేనలా కాదు. ప్రపంచం నా ముందు బలాదూర్
అనుకుంటా. కానీ చిన్న అస్వస్థత వస్తే చాలు
జావకారిపోతాను.
‘అలాంటిది నన్ను ఇన్నేళ్ళుగా
కనిపెట్టుకుని వున్న ఆ 'గుండే' జారిపోతే.....
రోజు గడవడం ఎలా!
ఓ పాతికేళ్ళకు పూర్వం కమ్యూనిస్ట్
రష్యాకు వెడుతున్నాను అని ఓ మిత్రుడితో
చెబితే ఇలా అన్నాడు.
‘నువ్వు మాట్లాడకుండా బతకలేవు. అక్కడ
మాట్లాడితే బతకలేవు’
రోజుకి 24 గంటలు, 1440 నిమిషాలు
ఇప్పటికి ఎన్ని గడిచాయో, ఇంకా ఎన్ని
గడవాలో, ఎలా గడవాలో !
ఓకే! అందరూ చెబుతున్నట్టు గుండె దిటవు
పరచుకుంటాను. మామూలుగా రోజులు గడిపే ప్రయత్నం చేస్తాను. రెండు గంటలు టీవీ చర్చలు,
ఓ నాలుగుగయిదు గంటలు ఇలా పిచ్చి రాతలు. ఓ గంట తిండీతిప్పలు. నిద్ర పడితే ఓ
ఆరుగంటలు. పట్టక పొతే పద్నాలుగు గంటలు ఎలా గడుస్తాయి. ఇప్పుడు నా చుట్టూ వున్న ఈ జనం ఒక్కసారి మాయమై పోయి ఒక్కడినే మిగిలితే!
శ్రీనివాసరావు గారు, కొంత అయోమయంలో పడేసారు. మిస్టర్ నిర్మలగారు కుశలమేనా?
రిప్లయితొలగించండిMay her soul rest in peace sir
రిప్లయితొలగించండిI am really sorry to hear this news Sir. Please be strong. I have been following your blog for last few years, read your Russian stories and many other experiences that you wrote.
రిప్లయితొలగించండిmee bharya gari aatma ki santhi kalagalani aa bhagavantudini vedukuntunnaanu.
@ అన్యగామి : లేదండీ. మంచాన పడకుండా ఎవరితో చేయించుకోకుండా అనాయాస మరణం.
రిప్లయితొలగించండిశ్రీనివాసరావు గారూ.... నేను మీ అభిమానిని. మీ ధర్మపత్ని గారు పోయారని తెలిసి నిర్ఘాంతపోయాను. వారి ఆత్మకు శాంతి కలగాలనీ, మీకు మనోధైర్యం కలగాలనీ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను.
రిప్లయితొలగించండి