గురువు ద్రోణాచార్యుడు కురుపాండవ
సోదరులకు విలు విద్యలో పోటీ పెడతాడు. ఒక వృక్షం కొమ్మల మధ్య పక్షి బొమ్మను పెట్టి
దాని కన్నుకు గురిపెట్టి బాణం కొట్టమని
ఆదేశిస్తూ, ఒకొక్కరిని విడివిడిగా ఆ
చెట్టుపై ఏం కనబడుతున్నదో చెప్పమంటాడు.
“చెట్టు, కొమ్మలు, ఒక కొమ్మపై పక్షి, ఆ
పక్షి కన్ను.”
“కొమ్మపై పక్షి, ఆ పక్షి కన్ను”
“పక్షి”
ఆఖరుకు అర్జునుడి వంతు.
“అర్జునా! ఏం కనబడుతోంది?” ద్రోణుడి
ప్రశ్న.
“పక్షి కన్ను”
“ఇంకా ఏమీ కనబడడం లేదా”
“లేదు. పక్షి కన్ను మాత్రమే”
అదీ గురి చూసి కొట్టడం అంటే. విలుకాడికి లక్ష్యసిద్ధి వుండాలనేది ఈ భారత కధ పరమార్ధం.
ఆ కధనే ఇప్పటి రాజకీయాలకు
వర్తింపచేస్తే వచ్చే సమాధానం.
పక్షి కన్ను కాదు, అధికారం.
అది గురిచూసి కొట్టగలిగిన వాళ్ళే నేటి రాజకీయ
నాయకులు.
కాకపొతే, ఇప్పుడు వారందరూ అర్జునులే!
అందరి గురీ అధికారం అనే పక్షి కన్ను మీదే!
వారికి ఏ పార్టీ పేరు పెట్టినా
అతికినట్టు సరిపోతుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి