నిర్ణయం మంచిదే, అమలే ఇబ్బందిగా మారిందని
కదా మన్మోహన్ సింగ్ నుంచి మామూలు మనిషి వరకు మనసులో అనుకునే మాట. నిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వం ముందు చూపుతో
వ్యవహరించలేదు, సరయిన కసరత్తు చేయలేదని కదా అందరం అంటున్నది. మనలో చాలామందిమి ఈ నల్ల ధనంతో సంబంధం లేనివాళ్ళమే. అయినా కొన్ని
ఇబ్బందులు తప్పవు. మరి ఒకటో తారీఖు వచ్చేస్తోంది. మనమన్నా కాస్త ముందు చూపుతో మనకు
ఎలాటి ఇబ్బందులు ఎడురవుతాయో కాస్త ఊహించుకుందామా! ఇబ్బందులు పూర్తిగా తొలగక పోయినా
కాసింత మానసిక ఉపశమనం అన్నా లభిస్తుందేమో చూద్దాం.
మా ఆవిడను అడిగితే మొదటి వారంలో
ఎదురుకాగల కొన్ని సమస్యలు చెప్పింది. పనివాళ్ళ జీతం, పాలవాడి బాకీ, పేపరువాడి బిల్లు. ఇలా అన్నమాట.
బ్యాంకులో డబ్బు వున్నా బయటకి వచ్చే వీలులేదు. చేతిలో డబ్బులు రేపోమాపో అయిపోయే
బాపతు. వాళ్లకి బ్యాంకు ఖాతాలు లేవంటున్నారు. మరి ఏమిటి పరిష్కారం.
ఒకరికొకరం ఇబ్బందులు చెప్పుకుంటే
పోయేదేమీ లేదు. నామోషీ కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడందరం ఒక పడవలోని ప్రయాణీకులమే.
రవంత రాజకీయాలు తగ్గిస్తే అసలు సంగతులు మాట్లాడుకోవచ్చు.
వీటన్నిటికి ఎక్కువలో ఎక్కువ పదివేలవుతుంది,అంతే. బేంక్ లో పదివేలిస్తారు, ఇప్పుడు తెచ్చుకోవచ్చు, నేను తెచ్చుకున్నా! రెడీగా ఉంచుకున్నా! ఎక్కువ తెచ్చేసుకోవాలనే ఆత్రం పడకుంటే చాలు ఒకటో తారీకు సవ్యంగానే వచ్చి వెళుతుంది. :)
రిప్లయితొలగించండి