2004 నుంచి 2009
వరకు ఐదేళ్ళపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్
శాసనసభకు కే.ఆర్. సురేష్ రెడ్డి స్పీకర్
గా పనిచేశారు. ఆ రోజుల్లో ఆయన పూనికపై అసెంబ్లీ వ్యవహారాలు చూసే జర్నలిష్టులకు
వృత్తిపరమైన విషయాల్లో తోడ్పడేందుకు అసెంబ్లీ ప్రెస్ గ్యాలరీ కమిటీ ఏర్పాటు చేశారు. దాసు కేశవరావు (హిందూ)
చైర్మన్ గా, దేవులపల్లి అమర్ (అప్పట్లో ఆంధ్రప్రభ) కన్వీనర్ గా వున్న ఆ కమిటీలో రేడియో తరపున నేనూ ఒక సభ్యుడిని. ఆ రోజుల్లో స్పీకర్ తో కలిసి ఈ కమిటీ సభ్యులం దిగిన ఒక
ఫోటోను మిత్రుడు వ్యాకరణం రామ సుబ్రహ్మణ్యం షేర్ చేశాడు.
అతడికి కృతజ్ఞతలు.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి