ఇందాక ఏబీఎన్ ఆంద్ర జ్యోతిలో చెన్నై వరద
పరిస్తితి గురించి ప్రత్యేక కధనం చూసాను. పరిస్తితి దారుణంగా వుంటే ఆ నగర వాసుల
స్తితిగతులు మరింత దారుణం అనిపించాయి.
కేరళ నుంచి చెన్నై వచ్చి నగరంలో చిక్కుకు
పోయిన ఓ అమ్మాయి చెబుతోంది ఇలా,...”మా రాష్ట్రంలో ఇంతకంటే పెద్ద వానలే కురుస్తాయి.
అయితే డ్రైనేజి వ్యవస్థ పటిష్టంగా వుండడం వల్ల ఈ ఇబ్బందులు మాకు తెలవవు”
రాష్ట్రాలు గురించి ఇలా గర్వంగా చెప్పుకోగలిగిన
ఘడియ ఎప్పుడు వస్తుందో అప్పుడే ఆ రాష్ట్ర ప్రజలు అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు.
భారీ వర్షాలతో తమిళనాడు అతలాకుతలం అవుతోంది. చెన్నై సిటీ నడిసంద్రాన్ని తలపిస్తోంది.నగరంలోని పలు కీలక ప్రాంతాలు నీటమునిగాయి.more news and images
రిప్లయితొలగించండి