'ప్రతి రోజూ ప్రార్ధన చేస్తుంటావు. పాతికేళ్ళుగా
చూస్తున్నా నీ వరస. ఇలా దేవుడ్ని ప్రార్ధిస్తూ వున్నందువల్ల నీకు దక్కింది ఏమిటి?
కొత్తగా పొందింది ఏమిటి? ఒక్కటంటే ఒక్కటి
చెప్పు?'
'నువ్వు చెప్పింది అక్షరాలా నిజమే! ప్రార్ధన
చేస్తూ నేను పొందింది ఏమీ లేదు. సంపాదించుకున్నదీ ఏమీ లేదు. కాకపొతే ప్రార్ధనలతో
నేను చాలా చాలా పోగొట్టుకున్నాను. గతంలో నాకున్న గర్వం,
ఈర్ష్యా, అసూయా, మొండితనం, లోభితనం ఇవన్నీ పోయాయి. ఇప్పుడు చెప్పు, నేను సంపాదించుకున్నట్టా!
పోగొట్టుకున్నట్టా!'
(NOTE: Courtesy Image Owner)
>మొండితనం, లోభితనం
రిప్లయితొలగించండిలోభితనం అన్న మాట లేదండీ తెలుగులో. లోభం అనే. తనము అనేది తెలుగు ఉపసర్గ కాబట్టి అది సంస్కృతపదం ఐన లోభిః నుండి వచ్చిన లోభి అనే తత్సమం ప్రక్కన చేరదు.
(తెలుగుకు ఈ నియమాలేవిటీ మాకు ఇవి తెలియకపోతే నష్టం ఏమిటీ అనకండి మీరైనా దయచేసి. మనం అంతా ఇంగ్లీషులో వ్రాసే ప్రతి వాక్యమూ వ్యాకరణబధ్ధంగా ఉందా లేదా అని డేగకళ్ళతో పరిశీలించుకుంటాం, ప్రతి మాటకూ స్పెల్లింగ్ సరిగ్గా ఉందా లేదా అని ప్రత్యేకం స్పెల్ ఛెకర్స్ వాడి మరీ దిద్దుకుంటాం. దురదృష్టవశాత్తూ తెలుగులో నిర్లక్ష్యంగా బరికేస్తాం. మనపొరపాటో తెలుగు ఖర్మో మరి!)
@శ్యామలీయం - ధన్యవాదాలు
రిప్లయితొలగించండి