లోకంలోని మగవాళ్ళందరూ కలసి దేవుడి దగ్గరికి
వెళ్ళి అడిగారు.
'మంచి గుణవతి, సౌందర్యవతి, సౌశీల్యవతి, అణగిమణిగి
నడుచుకుంటూ తమ చెప్పుచేతల్లో పడివుండే భార్యల్ని' ఇమ్మని అడిగారు.
'ఓస్!
ఇంతేనా!' అన్నాడు దేవుడు.
'ఈ ప్రపంచం నలుమూలల్లో ఏమూలలో చూసినా మీరు చెప్పిన ఆడవాళ్ళు వెతక్కుండానే మీకు
దొరుకుతారు, పోయి చూసుకోండి' అన్నాడు.
వచ్చిన పని వెంటనే
అయిందని సంతోషపడుతూ వాళ్ళందరూ వెనుదిరగ్గానే, భూమిని గుండ్రంగా మార్చేసి, కడుపు
పగిలేట్టు నవ్వుకున్నాడు దేవుడు.
(Note: Courtesy Image Owner)
రిప్లయితొలగించండిఇంకా వెతుకుతూనే ఉన్నారన్న మాట !
భార్యా రూపవతీ గుణవతీ మైత్రాయిణీ !!
జిలేబి