31, అక్టోబర్ 2014, శుక్రవారం

సబ్ కా మాలిక్ ఏక్ హై!


బుడుగును 'బుడుగూ' అని పిలుస్తారు బాపూరమణలు
'బుడ్గూ' అంటాడు గోపాళం
'హారి బుడుగు కన్నా' అంటుంది వాళ్ళమ్మ
'బుడుగా ఏంటి అసహ్యంగా మడుగూ బుడుగూ పేరు లేదా ఆయ్' అంటాడు అగ్నిహోత్రావధాన్లు
'బుడుగు అసలు పేరు చాలా పొడుగు. అందుకే బుడుగూ అంటాం వాయ్' అంటాడు రమణ గారి జోకుకి కాపీరైట్ తీసుకుంటూ గిరీశం  
'ఏంగురూ ఈ పేర్ల గోల' అంటుంది సీగానపెసూనాంబ
శాల్తీ ఒక్కడే. పేర్లు అనేకం. బుడుగన్నా, కన్నా అన్నా, ఏం గురూ అన్నా ఏ పేరు పెట్టి పిలిచినా పలుకుతాడు. ఇక ఏమిటి సమస్య.
అలానే  దేవుడొక్కడే!


కావాల్సింది నమ్మకం. దేవుడున్నాడనే నమ్మకం. దేవుడి పేరుతొ మనుషులు ఘోరాలు చేయకుండా కనిపెట్టి చూడడం.
మిగిలినవి ఆ దేవుడే చూసుకుంటాడు.
'కలడు కలండనెడి వాడు కలడో  లేడో' అని పోతన్న గారికే అనుమానం వచ్చింది.
మనమనగానెంత?

4 కామెంట్‌లు:

  1. అయ్యయ్యో.
    అనుమానం వచ్చింది పోతనగారికి కాదండీ.

    ఆ గజేంద్రుడికే.

    ఆ గజేంద్రుడి కథకూడా పోతనగారు సంస్కృతభాగవతంలో ఉంది కాబట్టి దానిని తెలుగులో వ్రాస్తున్నప్పుడు గజేంద్రుడి నోట తెలుగులో అలా అనిపించారన్నమాట.

    పాపం. పోతన్నగారిని ఏమీ అన కండి. ఆ పోతన్నగారు తెలుగుల పుణ్యపేటి అని విశ్వనాథవారు చెప్పారు కూడా.

    రిప్లయితొలగించండి
  2. @ శ్యామలీయం - "రాస్తున్నప్పుడే అనుకున్నాను ఖచ్చితంగా 'మీకే' ఈ అనుమానం వస్తుందని. ఆ సద సంశయం పోతనదా, గజేంద్రుడిదా అన్నది కాదు సమస్య. పోతన భాగవతంలో మూలంలో లేని ఎన్నో విషయాలను సందర్భానుసారంగా, మూలానికి, దాని ఔచిత్యానికి భంగం కలగకుండా అతి రమ్యంగా జొప్పించారు. అందులో ఇదొకటి. - భండారు శ్రీనివాసరావు

    రిప్లయితొలగించండి
  3. @ శ్యామలీయం - "రాస్తున్నప్పుడే అనుకున్నాను ఖచ్చితంగా 'మీకే' ఈ అనుమానం వస్తుందని. ఆ సద సంశయం పోతనదా, గజేంద్రుడిదా అన్నది కాదు సమస్య. పోతన భాగవతంలో మూలంలో లేని ఎన్నో విషయాలను సందర్భానుసారంగా, మూలానికి, దాని ఔచిత్యానికి భంగం కలగకుండా అతి రమ్యంగా జొప్పించారు. అందులో ఇదొకటి. - భండారు శ్రీనివాసరావు

    రిప్లయితొలగించండి
  4. పోతన గారు కాదు గజేంద్రుడు అని శ్యామలీయం గారు సరిదిద్దే ప్రయత్నం చెయ్యటము, ఆహా ఈ అనుమానం మీకే వస్తుందని నేననుకున్నదే అని మీరు అనటమూ, బాగుంది. గజేంద్రుడి మొరగా పోతన గారు పలికించినది అని పోతన భాగవతంతో పరిచయం ఉన్నవారికి తెలిసినదే. అన్నివేళలా ప్రత్యేకించి ఆ పాత్ర పేరు చెప్పనవసరం లేదు కదా. అయినా శ్యామలీయం గారి లాంటి పండితులకి ఇది తెలియక కాదు గదా. అందుకని పైన ఆయన చేసిన వ్యాఖ్య సరదాగా చేసారనిపిస్తోంది.
    పి.ఎస్ :- వ్యాఖ్యలకి భండారు శ్రీనివాస రావు గారు జవాబివ్వటమే పెద్ద ఆశ్చర్యము. అరుదున్నూ. సాధారణంగా మౌనముద్రలో ఉంటారు గదా తన బ్లాగులో వ్యాఖ్యల విషయంలో.

    రిప్లయితొలగించండి