జెట్ లాగ్ కోడి
మా వాచ్ మన్ కొండల రావుకి
ఇద్దరు పిల్లలు. పండక్కి వాళ్ళ వూరు వెళ్లినప్పుడు వస్తూ వస్తూ ఇంకో 'పిల్లాడిని'
వెంటబెట్టుకొచ్చాడు. పల్లెటూళ్ళో వేళపట్టున కూతబెట్టే ఆ కోడి పుంజు నిద్ర ఎరుగని నగరంలో ఓ వేళాపాళా లేకుండా కూతపెడుతూ
వుంటుంది. బహుశా జెట్ లాగ్ అయివుండవచ్చు. నాకు మాత్రం అది ఎన్నిసార్లు కూసినా
మళ్ళీ ఓమారు కూస్తే బాగుండు అనిపిస్తుంది.
నిజమే, కోడి కూత విని లేవడంలో బలే సరదా వుంతుంది!
రిప్లయితొలగించండి