కన్నంతలో విన్నంతలో అమెరికా
:
లింకన్
సిటీ సముద్ర తీరంలో ఒక ‘బుల్లి’ అద్భుతాన్ని కూడా చూసాము.
నిజానికి అది అద్భుతమేమీ కాదు. దేన్నయినా టూరిస్ట్ ఎట్రాక్షన్ గా అమెరికన్లు ఎలా
మార్చుకుంటారనడానికి ఇది మరో ఉదాహరణ.
‘ప్రపంచంలో అతి ’పొట్టి’ నదిని ఇక్కడ చూడవచ్చు.’ - అన్న బోర్డు చూసి దాన్ని
చూడడానికి ఎంతో ఉత్సాహపడ్డాము. తీరా చూస్తె అదొక పిల్ల కాలువలా వుంది. తీరం పక్కన
రోడ్డుకు ఆవల వున్న కొండల్లో పుట్టి సముద్రంలో కలుస్తున్న నది అని తెలిసింది. దాని
పొడవు కేవలం 440 అడుగులు. అంత ‘చిన్న’ నది వచ్చి కలుస్తున్నది
దేనిలో? సముద్రాలు
అన్నింటిలో అతి పెద్దదయిన పసిఫిక్ మహాసముద్రంలో. అది మరో విశేషం. దాన్ని
దొరకబుచ్చుకుని టూరిస్ట్ ఆకర్షణగా మార్చివేసారు.
ఈ చిట్టి పొట్టి నది సముద్రంలో కలుస్తున్న చోట ఇంకో విశేషం గమనించాము. అదేమిటంటే – ఈ నదిలో నీళ్ళు గోరువెచ్చగా వుంటాయి. ఒక్క అడుగు ముందుకు వేసి సముద్రంలో కాలు పెడితే గడ్డకట్టేంత చల్లగా వుంటాయి.
(ఇదే ఆ నది. నీళ్ళ రంగు తేడా చూసారుగా)
ఈ చిట్టి పొట్టి నది సముద్రంలో కలుస్తున్న చోట ఇంకో విశేషం గమనించాము. అదేమిటంటే – ఈ నదిలో నీళ్ళు గోరువెచ్చగా వుంటాయి. ఒక్క అడుగు ముందుకు వేసి సముద్రంలో కాలు పెడితే గడ్డకట్టేంత చల్లగా వుంటాయి.
(2010)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి