కన్నంతలో విన్నంతలో అమెరికా
:::
సియాటిల్ తిరిగి
వచ్చేటప్పుడు మార్గం మార్చుకుని పసిఫిక్ తీరంలో వున్న మరో పెద్ద టూరిస్ట్ రిసార్ట్
కానన్ బీచ్ కి వెళ్లి ప్రపంచ ప్రసిద్ది పొందిన ‘హేస్టాక్ రాక్’ ని చూసాము. సముద్రంలో వుండే ఈ కొండ- సముద్రాన్ని చీల్చుకు పైకి
వచ్చిందా అన్నట్టుగా వుంటుంది. దాన్ని పక్షుల సంరక్షణా కేంద్రంగా అభివృద్ధి
చేసారు. మేము
వెళ్ళిన రోజు సముద్రం ఎందుకో లోపలకు వెళ్ళిపోయి ఆ కొండ వరకూ వెళ్ళడానికి వీలుచిక్కింది.
అక్కడి వారు చెప్పిన దాని ప్రకారం ఇది అరుదైన
విషయమే. వేలమంది దాన్ని చూడడానికి రావడంతో ఆ బీచ్ అంతా ఎంతో కోలాహలంగా
కానవచ్చింది.
మనవైపు ఏటి వొడ్డున ఇసకలో గుజ్జన గూళ్ళు కట్టినట్టు అక్కడ పిల్లలందరూ
ఆ తీరంలో పెద్ద ప్రాకారాలు నిర్మించి ఆడుకోవడం గమనించాము. ఇందుకు అవసరమయిన
పరికరాలన్నీ వారు వెంట తెచ్చుకున్నట్టున్నారు.
ఇవికాక అనేక రకాల ఆకారాలతో పెద్ద
పెద్ద పతంగులు (గాలిపటాలు) ఎగురవేస్తూ కాలక్షేపం చేసేవాళ్ళు వందల సంఖ్యలో
కనిపించారు.
చూసినవాటిని
మనస్సులో భద్రపరచుకుంటూ సియాటిల్ రోడ్డు ఎక్కాము.
(2010)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి