ఇంతకీ ఆ కార్డు ముక్కలో ఏమున్నదంటే !
బందరులో ఒక పెద్దమనిషి గారున్నారు. ఇస్కస్ (ఇండో సోవియట్ సాంస్కృతిక సంస్థ)ద్వారా సోవియట్ యూనియన్ పర్యటనకు రావాలనుకుంటున్న ఆంద్ర ప్రదేశ్ ప్రతినిదివర్గంలో ఆయన వున్నారు. శాకాహారి అయిన ఆయన రష్యాలో తిండీ తిప్పలు గురించి ముందే వాకబు చేసుకుని, నా అడ్రసు తెలుసుకుని ఆ కార్డు రాసారు. ఫలానా రోజున మాస్కోలో ఫలానా హోటల్ లో ఉంటాననీ, వచ్చికలుసుకోవాల్సిందనీ అందులో కోరారు.
దాని ప్రకారమే ఆ ఫలానా రోజున ఆ ఫలానా హోటల్ కు వెళ్లి ఆయన్ని కలుసుకున్నాను. మాస్కో రావడానికి ముందే రష్యాలోని మరో రెండు మూడు నగరాలు వారిని తిప్పి తీసుకువచ్చారు.బడలికతో నీరసించివున్న ఆయన నన్ను పక్కకు తీసుకువెళ్ళి- 'ఈ రోజు మీ ఇంటికి రావాలనుకుంటున్నాను ఏమయినా అభ్యంతరమా' అని అడగలేక అడిగారు. పరిస్తితిని అర్ధంచేసుకుని వెంటనే ఆ పెద్దమనిషిని మా ఇంటికి బయలుదేరదీసాను. ఈ విషయం ఎలాతెలిసిందో ఏమో ఒక్కక్కరుగా వచ్చి అదే కోరిక కోరారు. ఇప్పట్లోలాగా ఆరోజుల్లో సెల్ ఫోనులు లేవు. ఇంటికి ఫోను చేసి ఇంతమంది వస్తున్నారని చెప్పే వీలు లేదు. ఏమయితే అయిందని వాళ్ళతో వున్న రష్యన్ దుబాసీతో సహా అందర్నీవాళ్ళ కోసం ఏర్పాటు చేసిన బస్సులో ఎక్కించుకుని ఇంటికి తీసుకువెళ్లాను. బిలబిలమంటూ ఇంటికి వచ్చిన అతిధులను చూసి మా ఆవిడ ముందు కంగారు పడినా - తరవాత తమాయించుకుని అందరికీ పచ్చళ్ళు, సాంబారు, పెరుగుతో భోజనాలు పెట్టింది. 'అన్నదాతా సుఖీభవా' అని అంతా ఆశీర్వదిస్తుంటే-' ఇచ్చుటలో వున్న హాయీ వేరెచ్చటనూ లేనేలేదనీ- లేటుగ తెలుసుకున్నాను' అన్న బాపూ రమణల బుద్దిమంతుడి పాట గుర్తుకు వచ్చింది. ఆ రోజు మా ఇంట్లో నాలుగు మెతుకులు తిన్న వారందరూ పోతూ పోతూ ఇచ్చిన టీ పొట్లాలు, కాఫీ పొడి పాకెట్లు, వక్కపొడి మొదలయిన- 'అమూల్య కానుకలతో' ఆ తరవాత కొన్నాళ్ళు మాకు పండగే పండగ.
పోతే మరో విషయం తప్పక చెప్పాలి. అలా ఆ రోజు మా ఇంటికి వచ్చిన వాళ్ళల్లో చాలామంది ఇన్నేళ్ళ తరవాత ఇప్పటికీ కూడా ఏటా గ్రీటింగ్ కార్డులు పంపిస్తూనే వున్నారు. వాళ్ళ సహృదయతకు ఖరీదు కట్టే షరాబు యెవ్వడు?
(మరికొన్ని మంచి జ్ఞాపకాలతో మరోసారి)
NOTE: All the images in this blog are copy righted to their respective owners.

(రేడియో మాస్కోలో గుజరాతీ న్యూస్ రీడర్ శ్రీ వ్యాస్)
పోతే మరో విషయం తప్పక చెప్పాలి. అలా ఆ రోజు మా ఇంటికి వచ్చిన వాళ్ళల్లో చాలామంది ఇన్నేళ్ళ తరవాత ఇప్పటికీ కూడా ఏటా గ్రీటింగ్ కార్డులు పంపిస్తూనే వున్నారు. వాళ్ళ సహృదయతకు ఖరీదు కట్టే షరాబు యెవ్వడు?
(మరికొన్ని మంచి జ్ఞాపకాలతో మరోసారి)
NOTE: All the images in this blog are copy righted to their respective owners.
ఇలాంటిదో ఒక అనుభవం మా తలిదండ్రులది.
రిప్లయితొలగించండిదేవీపట్నంలో సినిమాషూటింగుకు వచ్చి పొద్దుతెలియకుండా వళ్ళు మరచిన స్టూడెంటు కుర్రాళ్ళు కొందరు రంపచోడవరం దాకా రాగలిగారు కాని లాష్టుబస్సు ఎనిమిదిన్నరకే వెళ్ళిపోయిందనీ తెలిసి తల్లడిల్లారు. అందులో ఒకడికి అపాయంలో ఉపాయం స్ఫురించింది. వాళ్లవూరు కొత్తపేటలో మేం పదేళ్ళున్నాం అంతకుముందు ఏడాదిదాకా. అక్కడి హైస్కూల్లో మానాన్నగారు సీనియర్ టీచర్. ఇక్కడ రంపచోడవరంలో ఆయన హెడ్మాష్టరుగా ఉన్నారని గుర్తుకొచ్చిందన్నమాట. అంతే బిలబిల్లాడుతూ, ఆకలితో నకనకలాడుతూ మాయిటికి వచ్చారట. 'ట' అనటం ఎందుకంటే అప్పట్లోనే నేను ఉద్యోగం దొరికి హైదరాబాదు వచ్చాను, ఈ సంఘటన జరిగినప్పుడు రంపచోడవరంలో లేను.
ఇరవై, ఇరవై ఐదు మధ్యన కుర్రాళ్ళు తిండీ నిద్రా కోసం ఇంతి మీదకు వచ్చేసరికి మా అమ్మగారు అప్పటికప్పుడు వండి పెట్టారట. వళ్ళందరికీ స్కూలు క్లాసురూము ఒకదానిలో నాన్నగారు వసతి కల్పించారట. ఇదంతా ఆ తరువాత కొద్ది నెలలకు ఇంతికి వచ్చినప్పుడు తెలిసింది.