లోక్ సభ, రాజ్య సభల్లో రణగొణ ధ్వనుల నడుమ తూతూ
మంత్రంగా సాగిపోతున్న బిల్లుల ఇంట్రడక్షన్, ఆమోదం ప్రక్రియ చూస్తుంటే
ఏమనిపిస్తోంది?
"వచ్చే ఎన్నికల్లో వోటర్లందరూ
కూడబలుక్కుని కనీసం ఒక్కసారయినా మూకుమ్మడిగా బ్యాలట్ పత్రంలోని 'నోటా' (NONE
OF THE ABOVE) అవకాశాన్ని ఉపయోగించుకుని అన్నే పార్టీలవారినీ
ముక్తకంఠంతో తిరస్కరిస్తే బాగుండునని"
లోక్ సభ, రాజ్య సభల్లో రణగొణ ధ్వనుల నడుమ తూతూ మంత్రంగా సాగిపోతున్న బిల్లుల ఇంట్రడక్షన్, ఆమోదం ప్రక్రియ చూస్తుంటే ఏమనిపిస్తోంది?
రిప్లయితొలగించండినీకు కళ్లు మూసుకునిపోయినయి అనిపిస్తుంది. పార్లీమెంట్ లో సీమాంద్ర్లులు చేసే అల్లరి
కనిపించడం లేదా.
కికురె ముఖ్యమంత్రిగా ఉండి అంత భీబత్సంగా వ్యతిరేకించడం నుంచీ లోక్ సభ లో జరిగిన ఈ రౌడీజం వరకూ అంతా కాంగ్రెసు వాళ్ళు కూడబలుక్కుని చేసిన దుష్ట నాటకం. తెరాసా లో విలీనానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని విలీనానికి ఒప్పించడానికి వేసిన మాస్టర్ ప్లాన్.
రిప్లయితొలగించండితెరాసాతో విలీనం వల్ల తప్ప సీట్ల సర్దుబాటు వల్ల కూడా తెలంగాణాలో పార్టీకి పరువు నిలబడదని తేలిపోయింది.విలీనానికి ఒప్పుకున్న తెరాసా అధినేతకూ, పక్క తాళం వాయించే ఉద్దండ పండితుడికీ కాంగ్రెసులో సుఖ ప్రయాణానికి మంచి బెర్తులు జమ అయిపోయినాయి. మధ్య అంతరువుల నుంచి కింది వాళ్లకి కూడా కాంగ్రెసు బెర్తులు ఇస్తే పార్టీలో ఉన్న తెకావాలు వూరుకోరు. విలీనం తిరుగుబాట్లు లేకుండా సున్నితంగా జరిగి పోవాలి.అందుకని తెరాసా లో విలీనాన్ని వ్యతిరేకించే వాళ్ళని మానసికంగా బ్రేక్ చెయ్యటానికి. ఈ ప్లాన్ తెరాసా అధినేతకూ తెలిసే ఉండొచ్చు, బహుశా ప్లాను ఇచ్చిందే అతను అయి ఉండవచ్చు.
ఇంతకీ జరిగిందీ జరగబోయదీ యేమిటంటే, సభ బయట తమకు మరొకరితో ఉన్న ఒప్పందాన్ని ఖరారు చేసుకోవటానికి పార్లమెంటుని వాడుకోవటం.భారత ప్రజాస్వామ్యానికి మూలమయిన రెండు సభలూ కాంగ్రెసు రాజకీయ వ్యాపారానికి తక్కెడ సిబ్బెములుగా ఉపయోగ పడుతున్న్నాయి.పార్లమెంటు భవనం ఒక వ్యాపార వేత్త తన క్లయింటు తో తనకున్న ఒక ఒప్పందానికి ఆఖరి సంతకాలు చేసుకునే కాంఫరెన్స్ హాల్ గా ఉపయోగపడుతున్నది.
100+ యేళ్ళ అచరిత్ర గలిగి యెక్కువ కాలం అధికారం లో ఉండి సభాసాంప్రదాయాల్ని పాటించటంలో మిగిలిన వాళ్ళ కన్నా యెక్కువ బాధ్యతగా ఉండాల్సిన పార్టీ సిగ్గు యేమాత్రమూ లేకుండా భాజపా లాంటి జాతీయ పార్టీ లన్నింటి సహకారం తో చెయ్యబోతున్న ఘనకార్యం ఇది.
వచ్చిన రెండు వ్యాఖ్యలూ కూడా అసలు టపా స్ఫూర్తికి భిన్నంగా కనిపించాయి నాకు.
రిప్లయితొలగించండివిషయంలోకి వస్తే. ఈ నోటా వల్ల ఒరిగేది ఏమీ లేదు. జనం అంతా వ్యతిరేకించినా, చివరకు అభ్యర్థుల తాలూకు తైనాతీలు వేసుకునే ఓట్లు నోటాలు కావుగా? ఉదాహరణకు, పదివేల ఓట్ల కోసం నలుగురు పోటీపడ్డా రనుకుండాం. ఊరంతా నలుగుర్నీ వెలివేస్తుంది. ఐనా, అభ్యర్థులకు వారివారి మనుష్యుల ఓట్లరూపంలో చెల్లేవిగా పడ్డవి ఒక యభై ఓట్లే. వాటిలో ఓ పెద్దమనిసికి అక్షరాలా పదమూడు ఓటు వచ్చి అతడు గెలిచాడు. మన ఎన్నికల వ్యవహారం రూల్సు ప్రకారం, ఆ పదమూడు ఓట్ల విజేతగారే జననాయకుడుగా ఎన్నికైనట్లు. ఇప్పుడు చెప్పండి? లెక్కలోకి రాను ఈ నోటా వల్ల ఏ మాత్రం లాభమో. ఇలా గైతే, బేలట్ పేపర్ మీద "అందరూ దొంగలే" అని వ్రాసి పోల్ చేసినా, నోటా అని స్టాంప్ వేసి పోల్ చేసినా ఫలితం ఒకటే. ఈ నోటాతో కొత్తగా ఏమి ఇచ్చారండీ ప్రజలకు? చెప్పండి దయచేసి!