మొదటి ప్రశ్న :
ఆవిడ కడుపుతోవుంది. అప్పటికే ఆమెకు ఎనిమిదిమంది
సంతానం. వారిలో ఇద్దరు చెవిటి పిల్లలు. ఇద్దరు పుట్టు గుడ్డివారు. ఒక పిల్లవాడికి
మానసికంగా ఎదుగుగుదల లేదు. మొగుడివల్ల అధిక సంతానం ఒక్కటే కాదు దిక్కుమాలిన లైంగిక
వ్యాధులు కూడా సంక్రమించాయి. ఈ పరిస్థితుల్లో ఆవిడకు మీరు యేమని సలహా ఇస్తారు? ఇక
కన్నది చాలు, గర్భస్రావం చేయించుకోమని చెబుతారా?
ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు ఒక్కసారి రెండో
ప్రశ్న కూడా ఏమిటో కూడా గమనించండి.
అదే ఇది :
ఒక ప్రపంచ స్తాయి నాయకుడిని ఎన్నిక చేసుకోవాల్సిన
సందర్భం వచ్చింది. ముగ్గురు అభ్యర్ధులు పోటీలో వున్నారు. మీ ఒక్క వోటుతోనే వారి
భవితవ్యం తేలుతుంది. అంటే మీ వోటే నిర్ణయాత్మకం అన్నమాట.
ఆ ముగ్గురి గుణగణాలు ఇలా వున్నాయి.
మొదటివాడు పక్కా తాగుబోతు. రోజుకు కనీసం పది పెగ్గులు
పట్టించనిదే నిద్రపోడు. పైగా తిరుగుబోతు కూడా. ఇవి చాలవన్నట్టు ఇద్దరు ఉంపుడుగత్తెలు. ఒకదానివెంట మరో చుట్ట వెలిగించడమే కాని ఆర్పడం తెలియదు.
ఇక రెండో అభ్యర్ధి సంగతి ఇంకా ఘోరం. అప్పటికే రెండు
సార్లు ఉద్యోగం నుంచి ఉద్వాసన చెప్పారు. అర్ధరాత్రిదాకా మేలుకుంటాడు. మధ్యాహ్నం బారెడు
పొద్దెక్కిన దాకా మంచం దిగే అలవాటు లేదు. కాలేజీ రోజుల్లోనే నల్లమందుకు బానిస. ఇక
సాయంత్రం అయ్యిందంటే చాలు దేవదాసు అవతారం
ఎత్తినట్టే లెక్క.
పోతే మూడో అభ్యర్ధి వున్నాడే బహు బుద్దిమంతుడు.
వీర సైనికుడు. అనేక యుద్ధాల్లో పాల్గొని అనేకానేక
పతకాలు సంపాదించుకున్నాడు. పచ్చి శాకాహారి. మాంసం ముట్టడు. పొగ తాగడు. కాకపొతే
మద్యం అప్పుడప్పుడు పుచ్చుకుంటాడు. కానీ
చాలా మితంగా. అదీ తక్కువ
మైకం కలిగించే బీరు వంటి వాటినే. కట్టుకున్న
భార్యను మోసం చేయాలని కలలో కూడా అనుకోని అపర శ్రీరామచంద్రుడు. పరస్త్రీలను
పొరబాటున కూడా కన్నెత్తి చూడడు.
ఇదీ ఈ ముగ్గురి సంక్షిప్త జీవిత చరిత్ర.
ఇప్పుడు వాళ్ళలో ఒక్కడ్ని ప్రపంచ స్తాయి నాయకుడిగా
ఎన్నుకోవాల్సిన చారిత్రాత్మక బాధ్యత మీ
భుజస్కంధాలపై పడింది. ముందే చెప్పినట్టు మీ ఒక్క వోటే కీలకం. మీరు వోటు వేసినవాడే
ఎన్నికవుతాడు. ఈ విషయం గమనంలో పెట్టుకుని రెండో ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఈ ముగ్గురిలో
ఎవరిని ఎంపిక చేసుకుంటారు.
జవాబు దొరికితే మంచిదే. లేకపోతే కింద చూడండి.
మొదటి ప్రశ్నకు మీ జవాబు ‘అవును’ అయితే, అంటే ఆ
గర్భవతికి గర్భస్రావం చేయించడం మంచిదని మీరు అనుకుని వుంటే –
అలాటి నిర్ణయం వల్ల ఒక మంచి సంగీతకారుడు ఈ
ప్రపంచానికి దక్కకుండా పోయేవాడు. బీతోవెన్
అనే ప్రపంచ ప్రసిద్ది చెందిన సంగీతకారుడు అప్పుడు ఆమెకు తొమ్మిదో సంతానంగా జన్మించాడు.
అలాగే రెండో ప్రశ్నకు జవాబు చెబుతూ తాగుబోతు,
తిరుగుబోతు అని మొదటి ఇద్దర్నీ మీరు తిరస్కరించివుంటే ఫ్రాంక్లిన్ డి రూజ్ వెల్ట్,
విన్ స్టన్ చర్చిల్ వంటి రాజకీయ దురంధరులను మీరు పక్కనబెట్టినట్టు అయ్యేది. ఇక
రాముడు మంచి బాలుడు వంటి లక్షణాలు కలిగిన మూడో అభ్యర్ధి అందరికీ తెలిసినవాడే. ఆడాల్ఫ్
హిట్లర్
కాబట్టి
నీతి ఏమిటంటే పైకి కనబడే లక్షణాలు చూసి మనుషుల మంచి చెడ్డలు గురించి వెంటనే ఒక
నిర్ణయానికి రాకూడదు అని.
(ఒక
ఇంగ్లీష్ గల్పిక ఆధారంగా)
అన్ని పోస్టుల్లానే ఈ పోస్ట్ కూడా మీ నుంచి బావుందండీ.. మీ ప్రతీ పోస్ట్ చూస్తాం..ప్రతీ ఒక్కటి చక్కగా ఉంటుంది...ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటయ్. వృత్తి లోనివీ,వ్యక్తి గతమైనవీ అయిన అనుభవాలూ,ప్రముఖులతో పరిచయాలూ చాలా చక్కగా అందరికీ పరిచయం చేస్తున్నారు....కానీ, కనీసం మేము కామెంటనందుకు క్షమించేయండి.....
రిప్లయితొలగించండి@ kvsv - ధన్యవాదాలు - భండారు శ్రీనివాసరావు
రిప్లయితొలగించండిVery interesting post . Thanks for sharing andi.
రిప్లయితొలగించండి@జలతారు వెన్నెల - ధన్యవాదాలు - భండారు శ్రీనివాసరావు
రిప్లయితొలగించండిthanks for sharing sir...
రిప్లయితొలగించండి