మూడేళ్ళ క్రితం అమెరికా వెళ్ళినప్పుడు మధ్యలో వినాయక
చవితి పర్వదినం వచ్చింది. కొబ్బరికాయలతో సహా పూజా సామగ్రి యావత్తు ఇండియన్ స్టోర్
లో దొరుకుతాయి కానీ మట్టి వినాయకుడు యెట్లా. మా వాడు సందీప్ కొనుక్కున్న ఇంటి
పెరట్లో చక్కటి బంక మన్ను కనబడింది. అంతే ! దాంతో వినాయకుడి ప్రతిమను కాస్త అటూ ఇటూగా
గుర్తుపట్టే విధంగా తయారు చేసాను. ఇందులో మా మనుమరాళ్ళు సఖి, సృష్టి బాగా
సహకరించారు. పూజ పూర్తి అయింది. వుండ్రాళ్ళు తయారు చేయడం, ఆ సాయంత్రం ఇళ్ళ కప్పుపై విసరడం అంతా సజావుగా
సాగిపోయింది. కానీ అసలు చిక్కల్లా గణేష్ ప్రతిమను నిమజ్జనం చేయడం ఎల్లా అన్నదే.
సియాటిల్ నీటి వనరులకు ప్రసిద్ధి. కనుచూపు మేరలో ఎటు
చూసినా పెద్ద పెద్ద సరస్సులే. కానీ గణేష్
ప్రతిమను నిమజ్జనం చేయడం అంత తేలిక కాదు. అక్కడి చట్టాలు వొప్పుకోవు. అందుకని
కారేసుకుని లాంగ్ డ్రైవ్ లో వూరు దాటి వెళ్ళి అనేక మైళ్ల దూరంలో నిర్జన ప్రదేశంలో కనబడిన
ఓ సరస్సులో, ఒక రకంగా చెప్పాలంటే, ఎవ్వరికంటా పడకుండా నిమజ్జనం చేసివచ్చాము.
(08-09-2013)
గుర్తుపట్టేలా ఉండటమేంటండీ?మీ వినాయకుడు చాలా బాగున్నాడండీ,నిజంగా.
రిప్లయితొలగించండి@ nagarani yerra - మీరు మొహమాటానికి అంటున్నారు కాని - నాకు తెలుసు గణేష్ పాదాల దగ్గర తన్నింది. సరిదిద్దుకునే వ్యవధి లేక అలానే కానిచ్చేశాము.- భండారు శ్రీనివాసరావు
రిప్లయితొలగించండిSrinivas Garu
రిప్లయితొలగించండిeppudu pedutunna plaster of paris bomma la kanna me matti vigraham chala bagundi
alage meku vinayaka chavithi susbhakakshalu
@Pratap Reddy Devagiri- Thanks- మీకు కూడా చవితి శుభాకాంక్షలు -భండారు శ్రీనివాసరావు
రిప్లయితొలగించండి