ఐయ్యేయస్లంటే మాటలా ? మరి ‘మాటలే!’
(ఐ.ఏ.ఎస్., ఐ.పి.ఎస్.,ఐ.ఎఫ్.ఎస్. వంటి అఖిలభారత
సర్వీసు అధికారులను ఎంపిక చేసే యూపీఎస్సీ ఇంటర్వ్యూ లలో అడిగే ప్రశ్నలు జవాబులు
ఇలా వుంటాయిట.)
ప్రశ్న: పదిమంది
కూలీలు కలసి పదిగంటల్లో ఒక గోడ కట్టారు. ఆ గోడ కట్టడానికి నలుగురు కూలీలకు యెంత
టైం పడుతుంది?
జవాబు:
పదిమంది కలిసి ఆ గోడ అప్పటికే
కట్టేశారంటున్నారు కదా! ఇక కొత్తగా పట్టే
టైం ఏముంటుంది? (యూపీఎస్సీ ఇరవై మూడో రాంకర్. ఇతగాడు ఐ.ఎఫ్.ఎస్. సర్వీసును ఎంచుకున్నాడు.
ప్రశ్న: ఒక చేతిలో మూడు యాపిల్స్ నాలుగు బత్తాయిలు వున్నాయనుకో. రెండో చేతిలో నాలుగు యాపిల్స్ మూడు బత్తాయిలు వుంటే నువ్వు ఏది కోరుకుంటావు?
ప్రశ్న: ఒక చేతిలో మూడు యాపిల్స్ నాలుగు బత్తాయిలు వున్నాయనుకో. రెండో చేతిలో నాలుగు యాపిల్స్ మూడు బత్తాయిలు వుంటే నువ్వు ఏది కోరుకుంటావు?
జవాబు:
ఇంకా పెద్ద చేతులు వుంటే బాగుంటుందని.(యూపీఎస్సీ పదకొండో ర్యాంకు. ఐ.పీ.ఎస్. ను ఎంచుకున్నాడు.)
ప్రశ్న: నిద్రపోకుండా మనిషి ఎనిమిది రోజులు గడపగలడా?
ప్రశ్న: నిద్రపోకుండా మనిషి ఎనిమిది రోజులు గడపగలడా?
జవాబు:
తప్పకుండా. రాత్రిపూట నిద్రపోతే సరి. (యూపీఎస్పీ
ఐ.ఏ.ఎస్. 98 వ ర్యాంకు)
ప్రశ్న:
యెర్ర రాయిని నీలం సముద్రం లోకి విసిరితే ఏమవుతుంది?
జవాబు:
మునిగిపోతుంది.(యూపీఎస్సీ ఐ.ఏ.ఎస్. రెండో ర్యాంకు)
ప్రశ్న:
సగానికి కోసిన యాపిల్ పండు యెలా
కనబడుతుంది?
జవాబు:
సగం యాపిల్ మాదిరిగా.(యూపీఎస్సీ - ఐ.ఏ.ఎస్.
టాపర్)
ప్రశ్న :
బ్రేక్ ఫాస్టులో నువ్వు తినలేనిది ఏమిటి?
జవాబు:
డిన్నర్
ప్రశ్న: పది తేలిక ప్రశ్నలు అడగమంటావా లేక ఒక్క గొట్టు ప్రశ్నకు జవాబు
చెబుతావా ?
అభ్యర్ధి: ఒక్క గట్టి ప్రశ్నే అడగండి.
ప్రశ్న: అయితే ఈ ప్రశ్నకు తడుముకోకుండా జవాబు చెప్పు. రాత్రి ముందు
వస్తుందా? లేక పగలా?
జవాబు: పగలే సర్.
ప్రశ్న: యెలా?
జవాబు: మీరు ఒక్క ప్రశ్నే అడుగుతామన్నారు సర్.
1987 ఆక్స్ ఫర్డ్ ఫిలాసఫీ పరీక్షలో ఒక
ఎస్సే ప్రశ్న ఇచ్చారు. యాభయి మార్కులు.
‘ధైర్యమంటే ఏమిటి?’
ఒక అభ్యర్ధి పది సమాధాన పత్రాలు
తీసుకుని తొమ్మిది ఖాళీగా వొదిలి పదో దాంట్లో
చివర్న ఇలా రాసాడు.
“ధైర్యమంటే ఇదే!” (23-05-2012)
మా రోజుల్లో అనగా ఏభై/ అరవైల్లో ప్రశ్నలు ఇలా ఉండేవిట, ఇప్పుడు నువ్వు ఎక్కి పైకి వచ్చిన మెట్లెన్ని? మద్రాస్- కలకత్తా మైల్ వరుసగా అగే మూడు స్టేషన్లు చెప్పు.
రిప్లయితొలగించండిఆ రోజుల్లో కొవ్వూరు, గోదావరి, రాజమంద్రి లలో తప్పించి మద్రాస్-కలకత్తా మైల్ వరుసగా ఎక్కడా మూడు స్టేషన్లలో ఆగేదికాదు. మరి ప్రశ్నల సొగసు పెరిగిందా? పరిజ్ఞానం పెరిగిందో తెలీదు.