(తండ్రులకు మాత్రమే!)
ఏ తండ్రి
చరిత్ర చూసినా!
‘ఒపీనియన్స్
చేంజ్’ అన్నాడు గిరీశం.
వయసు
పెరుగుతున్నకొద్దీ ఓ తండ్రి గురించి అతడి కొడుకు అభిప్రాయాలు యెలా మారిపోయాయో
గమనిస్తే నిజమే కామోసు గిరీశం మాటలు అనిపిస్తుంది.
(నాలుగేళ్ల
వయస్సులో)
“మా
నాన్నకు అన్నీ తెలుసు”
(ఆరేళ్ళ వయస్సులో)
“ఏదో
అనుకుంటాడు కానీ మా నాన్నకు అన్నీ తెలియవు”
(ఎనిమిదేళ్ళ
వయస్సులో)
“ఏవిటో
చెబితే అర్ధం చేసుకోడు.అసలు పిల్లల సంగతి ఆయనకేం తెలుసని”
(పద్నాలుగేళ్ల
వయస్సులో)
“మా
నాన్నవన్నీ పాతచింతకాయ పచ్చడి ఆలోచనలు”
(ఇరవైఒక్క
ఏళ్ళ వయస్సులో)
“ఈ
ముసలాయనకు ఏం చెప్పినా, యెలా చెప్పినా ఓ పట్టాన అర్ధం కాదు”
(ఇరవై అయిదేళ్ళ
వయస్సులో)
“ఈ విషయం
గురించి మా నాన్నకు ఏదో కొంత తెలుసు కానీ, ఆయన వయసుని దృష్టిలో పెట్టుకుని చూస్తే
పోనీలే పాపం అనిపిస్తుంది”
(ముప్పయ్యేళ్ళ
వయస్సులో)
“ఈ
విషయంలో మా నాన్నను అడిగివుంటే బాగుండి వుండేదేమో కదా!”
(ముప్పయి
అయిదేళ్ళ వయస్సులో)
“ఇక
నుంచి నాన్నను సంప్రదించకుండా ఒక్క పనీ చేయనుగాక చేయను”
(యాభయ్
ఏళ్ళ వయస్సులో)
“ఇలాటి
సంకట పరిస్తితి ఎదురయినప్పుడు మా నాన్నే బతికివుంటే ఏమి చేసి వుండేవాడో!”
(అరవై
ఏళ్ళ వయస్సులో తండ్రి సమాధి చెంత)
“నిజంగా మా నాన్న చాలా గొప్పవాడు. ఆయన
వున్నప్పుడు ఆయన్ని పూర్తిగా అర్ధం
చేసుకోలేక పోయాను
వ్చ్! ఇప్పుడు అనుకుని ఏం లాభం?”
(నెట్లో అందుకున్న ఓ ఇంగ్లీష్ కధనం ఆధారంగా)
09-05-2012
True, All sons must read.
రిప్లయితొలగించండి