టీచర్: ఏకాంబరం ఈ ప్రపంచ పఠంలో అమెరికా ఎక్కడ వుందో
కనుక్కో.
ఏకాంబరం: ఇదిగో
ఇక్కడ టీచర్.
టీచర్: సరే నువ్వు జవాబు చెప్పు లంబోదరం. అమెరికాని
కనుక్కున్నది ఎవరు?
లంబోదరం: ఏకాంబరం
టీచర్.
టీచర్: శంకరం నీరు ఈ పదానికి రసాయనిక ఫార్ములా ఏమిటి?
శంకరం: హెచ్ ఐ జె కె ఎల్ ఎం ఎన్ ఓ
టీచర్ : ఏమిటా జవాబు ? ఎవరు చెప్పారలా !
శంకరం : నిన్న మీరే అన్నారు కదా టీచర్ నీటికి కెమికల్ ఫార్ములా ‘హెచ్ టూ ఓ’ అని.
టీచర్ : స్వప్నా ఇవ్వాళ మన మధ్య వుండి పదేళ్ళ క్రితం
లేనిదేమిటి?
స్వప్న : నేనే టీచర్
టీచర్: కోటయ్య కొడుకు గొడ్డలితో ఇంటి పెరట్లో వున్న బాదం
చెట్టును అడ్డంగా నరికేశాడు. సుందరం నువ్వు చెప్పు కోటయ్య తండ్రి తన కొడుకును
ఎందుకు దండించలేదు?
సుందరం: ఎందుకంటె ఇంకా కొడుకు చేతిలో గొడ్డలి వుండడం చూసి.
టీచర్ : ఒరే రాఘవా! భోజనానికి ముందు దేవుడిని ప్రార్దిస్తావా?
నిజం చెప్పరా!
రాఘవ: ఆ అవసరం లేదు టీచర్. మా అమ్మ బాగా వంట చేస్తుంది.
టీచర్: గీతా నువ్వు కుక్క మీద రాసుకొచ్చిన వ్యాసం అచ్చం మీ
అన్నయ్య రాసిన దానికి నకలుగా వుంది. కాపీ కొట్టావా!
గీత: లేదు టీచర్. ఇద్దరం ఒకే కుక్క మీద రాసాం.
టీచర్: శేఖర్ ఈ ప్రశ్నకు జవాబు చెప్పు. వినే వాళ్లకు ఇష్టం లేదని తెలిసి కూడా అదేపనిగా మాట్లాడే వ్యక్తిని ఏమంటారు?
శేఖర్: టీచర్!
(19-02-2012)
(19-02-2012)
హ హ హ హ.. ఆఖరిది సూపర్ ఉంది సార్..
రిప్లయితొలగించండి@సుభ/Subha - శుభం భూయాత్
రిప్లయితొలగించండి