18, ఫిబ్రవరి 2012, శనివారం

పది నోటు ఎటు పోయింది చెప్మా!



పది నోటు ఎటు పోయింది చెప్మా!







ముగ్గురు వెంగళప్పలు పట్నం వెళ్లి హోటల్లో ఓ గది తీసుకున్నారు.
ముగ్గురికీ కలిపి రోజుకు మూడువందల రూపాయలు అవుతుందని హోటల్ క్లర్కు చెప్పిన మీదట తలా ఒక వంద వేసుకుని ఆ మొత్తాన్ని అతడికి చెల్లించారు.
అయితే హోటల్లో వేడి నీరు రాకపోవడంతో హోటల్  యజమాని వారినుంచి రెండువందల యాభయ్ రూపాయలు మాత్రమే తీసుకుని మిగిలిన యాభయ్ వారికి వాపసు చేయమని క్లర్కుకు చెప్పాడు. అతగాడు అందులో ఇరవై నొక్కేసి మిగిలిన ముప్పై ఆ ముగ్గురికీ తలా  పది చొప్పున  తిరిగిచ్చేశాడు.
అంటే ఏమిటన్న మాట.  ముందు ఇచ్చిన వందలో పది రూపాయలు వెనక్కి వచ్చాయి.  వందలో పది పోతే తొంబై చొప్పున  ముగ్గురూ హోటల్ కు రెండువందల డెబ్బై రూపాయలు చెల్లించినట్టయింది.  క్లర్కు కొట్టేసిన ఇరవైతో కలిపితే ఆ మొత్తం రెండువందల తొంబై. మరి  మిగిలిన పది రూపాయలు ఏమయిపోయినట్టు చెప్మా!
జవాబు చెప్పగలిగినవారికే ఆ పది రూపాయలు.  (18-02-2012)

4 కామెంట్‌లు:

  1. మీరు లెక్క పెట్టిన 20 రూపాయలూ, ఒక్కొక్కరికి ఐన 90 రూపాయల లోనే ఉన్నాయి. మిగతా ముప్పయి అంటారా? అవి వాళ్ళు ముగ్గురు పంచుకున్నారు కదా! లెక్కించడం లో ఉన్న తప్పుడు క్రమం వల్ల , ఈ చిక్కు వస్తుంది అంతే.!!!

    రిప్లయితొలగించండి
  2. నకిరంగా ఇక్కొక వెంగళప్ప 90 రూపాయలు చెల్లించారు.
    అంటే ముగ్గురూ కలసి చెల్లించినది 270 రూపాయలు.
    ఇందులో 250రూపాయలు హోటలు యజమాని తీసుకుంటే,మిగిలిన 20 రూపాయలు క్లర్కు నొక్కేసాడు.
    డబ్బుల లెక్కలో తేడా లేదు 10 రూపాయలు పోలేదు. మీరు లెక్కించిన విధానంలోనే తప్పుంది.

    రిప్లయితొలగించండి
  3. @Baddipadige Sathish @ శ్యామలీయం - మిగిలింది పదే కదా ప్రైజ్ మనీ కింద ఇద్దామనుకుంటే ఈ లెక్కన అవీ మిగిలేట్టు లేవు.-భండారు శ్రీనివాసరావు

    రిప్లయితొలగించండి
  4. ఈ సారి ఇంకొక ప్రశ్న ఇవ్వండి శ్రీనివాస రావు గారు , అందులో మిగిలితే మాకు ఇద్దురు కానీ. :)

    రిప్లయితొలగించండి