23, ఫిబ్రవరి 2011, బుధవారం

వినదగునెవ్వరు చెప్పిన – భండారు శ్రీనివాసరావు


వినదగునెవ్వరు చెప్పిన – భండారు శ్రీనివాసరావు

“నిద్రపోతూ కలలు కనడం అన్నది జీవితంలో సాధారణ విషయం. కన్న కలలను నిజం చేసుకోవడానికి నిరంతరం శ్రమించడం సాధకుల జీవితం.”


“బాల్యంలో ఒక్క చెమట చుక్కను ధారపోసినా అది ముసలితనంలో పది కన్నీటి చుక్కలు రాలకుండా చేస్తుంది.”


“నన్ను ద్వేషించే వాళ్ళను ద్వేషించే వ్యవధానం నాకు లేదు. ఎందుకంటే నన్ను ప్రేమించే వాళ్ళను ప్రేమించడానికే ఎక్కడి సమయం సరిపోవడం లేదు.”


“సంకుచిత మనస్కులు ఇరుగుపొరుగువారిని గురించి మాట్లాడుకుంటారు. పెద్దమనసున్న వాళ్ళు ఇరుగుపొరుగు ఎదుర్కునే సమస్యల పరిష్కారం గురించి మాట్లాడుకుంటారు.”


“సానుకూల దృక్పధం కలిగినవారిని ఎలాటి విషం ఏమీచేయలేదు. ప్రతికూల మనస్తత్వం వున్నవారిని ఏ వైద్యుడు బాగుచేయలేడు.”


“మీ జీవితంలో మీరు ఎక్కువ సమయం గడిపేది ఎవరితోనో తెలుసా? అదెవరో కాదు. మీరే.”


“అదృష్టం అన్నది మీ చేతుల్లో వుండదు. కానీ పని చేయడం అనేది మీ చేతుల్లోనే వుంటుంది. మీరు చేసే పనివల్ల మిమ్మల్ని అదృష్ట దేవత పలకరించవచ్చు. కానీ అదృష్టం మాత్రం మీరు చేయాల్సిన పని ఎన్నటికీ చేయలేదు.”


“ఈ ప్రపంచంలో రెండే రెండు విలువయిన ప్రదేశాలు వున్నాయి. ఒకరి ఊహల్లో లేదా ఆలోచనల్లో మనం వుండగలగడం జరిగితే అంతకంటే మధురమయిన ప్రదేశం మరోటి వుండదు. అల్లాగే ఒకరి హృదయంలో మనం వున్నామంటే దానికంటే భద్రమయిన స్తానం ఇంకొకటి వుండదుగాక వుండదు.”


“జీవితంలో విషాదం ఏమిటంటే అది అంత త్వరగా ముగిసిపోవడం. దాన్ని తిరిగి మొదలుపెట్టడానికి ఎంతో కాలం వేచివుండాల్సిరావడం కూడా అంతే విషాదం.”


“ఒక్క క్షణం ఆగ్రహాన్ని అణచి పెట్టుకోగలిగితే, ఆ తర్వాత వంద రోజుల దుఃఖాన్ని దూరం చేసుకోగలుగుతాం.”

5 కామెంట్‌లు:

  1. కుసింత ఇటు ఓ లుక్కేసి మీ అభిప్రాయం చెప్పండి గురువుగారూ
    http://blogavadgeetha.blogspot.com/2011/02/blog-post_23.html

    రిప్లయితొలగించండి
  2. ఇదేదో మీ మనసులో, మీ గురించే, మీరు భావిస్తున్న అభిప్రాయంలా వుందేం గురువు గారూ...

    రిప్లయితొలగించండి
  3. @అజ్ఞాత - బాగా చెప్పారు. బ్లాగులో రాసుకునేవన్నీ 'ఆత్మావలోకనం'అనే అనుకుంటున్నాను. కాకపొతే -'వినదగునెవ్వరు చెప్పిన'వన్నీ మీలాటి మిత్రులనుంచి సేకరించినవే.నా సొంతం కాదు.ధన్యవాదాలతో -భండారు శ్రీనివాసరావు.(ఇలా అజ్ఞాత అని కాకుండా అసలు పేర్లతో రాస్తే మనసు విప్పి మాట్లాడుకునే అవకాశం వుంటుందేమో ఆలోచించండి.నేనందుకే నా మొబైల్ నెంబరు,ఈమెయిలు తప్పకుండా ఇస్తుంటాను)

    రిప్లయితొలగించండి
  4. Sreenivasa rao garu recent gane nenu mi post chadivanu and felt very interesting.mi blog lo raasina anni topics chaduvuthunnanu.parayidesam lo untunna malanti vallaku chakkani teluguni andisthunnaru and anni different topics gurinchi cheppi ma knowledge penchuthunnaru.

    Thank you
    Rayudu

    రిప్లయితొలగించండి
  5. రాయుడు గారికి - నేనూ మీలాగే కొన్నేళ్ళు పరాయి దేశంలో వుండివచ్చిన వాడినే. అప్పట్లో ఇప్పటిలాగా ఫోన్లూ, ఈ మెయిళ్ళూ లేవు.మాస్కోలో వున్నప్పుడు తెలుగు పేపర్ కోసం మొహం వాచిపోయేవాళ్ళం.ఎవరయినా చింతపండు పంపితే, ఆ పొట్లం పేపర్ నే అతి మురిపెంగా అనేకమార్లు చదువుకున్న జ్ఞాపకాలు అనేకం.మీ స్పందనకు నా ధన్యవాదాలు.మీ మెయిల్ ఐ డీ పంపితే సంతోషిస్తాను.-భండారు శ్రీనివాసరావు

    రిప్లయితొలగించండి