“చెబితే నమ్మరు కానీ - పిన్నిగారూ ఆ దేశంలో పనివాళ్ళు కూడా ఎంచక్కా ఇంగ్లీషే మాట్లాడుతారు”
కూతురు పురిటికోసం అమెరికా వెళ్ళివచ్చిన ఒకావిడ ఆ దేశపు విశేషాలు పొరుగావిడతో చెబుతూఅన్నమాటలివి.
నమ్మక పోవడానికి ఏమీ లేకపోయినా నమ్మలేని నిజం మరోటి వుంది. ఆ దేశంలో చాలామందికి ఇంగ్లీష్ అర్ధంకాదు. అంటే ఇంగ్లీష్ రాదని కాదు. మన ఇంగ్లీష్ ఉచ్చారణకు వాళ్ళు మాట్లాడేదానికీ తేడావుండడమే దీనికి కారణం. అయితే వాళ్ళు సంభాషించేటప్పుడు హావభావాలు కూడా ప్రదర్శిస్తారు కాబట్టి కాస్తో కూస్తో భావం అర్ధం అయ్యే అవకాశం వుంటుంది.
భాష సంగతి అటుంచి, అమెరికన్లు ‘అంటరానితనం’ పాటిస్తారేమోనని అనిపిస్తుంది
.
బెల్ వ్యూ స్క్వేర్ మాల్
డిస్నీలాండ్ లో సందర్శకులు
కార్ల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ నాగరీకం మరీ ముదిరిపోతుంది. పార్కింగ్ చేసే చోట మర్యాదలు చూసి తీరాలి. చాలాసేపు వేచివుండయినా ఎవరికీ అసౌకర్యం లేకుండా పార్క్ చేయడానికి ప్రయత్నిస్తారు.
వికలాంగుల కార్లకోసం రిజర్వ్ చేసిన పార్కింగ్
ఈ రోడ్లని గమనిస్తే అమెరికన్లని గురించి ఒకరు చెప్పిన విషయం గుర్తుకు వస్తుంది. సుఖప్రదమయిన జీవితం గడపడం వారి లక్ష్యం. అది సజావుగా నడవడానికి అవసరమయిన కొన్ని నియమనిబంధనలు ఏర్పరచుకుని వాటిని ఖచ్చితంగా పాటిస్తున్నారు. ఈ నిబంధనల అమలు మీద సర్కారు ఆజమాయిషీ కంటే స్వచ్చందంగా పౌరులు వాటికి కట్టుబడి వ్యవహరించడం వల్లే అవి విజయవంతంగా అమలు జరుగుతున్నాయని చెప్పవచ్చు.
నడిచే వాడిదే రోడ్డు
మరో మంచి విషయం ఏమిటంటే కార్లలో వెళ్లేవాళ్ళు - కాలినడకన వెళ్ళేవారిని చిన్నచూపు చూడరు. సరికదా, వారిపట్ల ఎంతో మర్యాదపూర్వకంగా ప్రవర్తిస్తారు. రోడ్డు దాటేవారిని చూసినప్పుడు ఈ మర్యాద కాసింత ముదిరి కూసింత భయంగా మారడం కద్దు. రోడ్డు కూడళ్ళ వద్ద – కాలినడకన వెళ్లే మనిషి కనిపిస్తే చాలు వేగంగా వెళ్లే వాహనాలు కూడా టక్కున ఆగిపోయి దారి ఇస్తాయి. ఏదన్నా జరగరానిది జరిగితే, ఆ నేరం మెడకు చుట్టుకుండేది వాహనాలు నడిపేవారికే.
NOTE:All images in the blog are copy righted to respective owners
anna anukokunda ee blog chusanu, saili bagundhi ,, ante saili ammayi peru kadu nee writing style,,, cute now today on wards i am the regular visitor of ur blog
రిప్లయితొలగించండిwhat can i say? except thanks-bhandaru srinivasrao
రిప్లయితొలగించండిసూర్య గారికి – మీ స్పందన చూసి ఎంతో ఆశ్చర్యం వేసింది. అంత బిజీగా వుంటూ నా బ్లాగు చదివి ‘వ్యాఖ్య’ రాసారంటే మరి ఆశ్చర్యపడాల్సిన విషయమే. పైగా వూళ్ళు తిరుగుతూ కూడా రాసారంటే ధన్యవాదాలతో సరిపెడితే కుదరదు కానీ ఇప్పటికి అలా సర్దుకోకతప్పదు. పోతే, మీరన్నట్టు నేను రాస్తున్నవి చాలా మామూలు విషయాలే. మన వైపు పరిస్తితులతో పోల్చి రాస్తుంటే చదివేవాళ్ళు దొరక్కపోతారా అని ఒక చిన్ని ఆశ. మీరన్నట్టుగా సాంకేతిక అంశాలు గురించి కూడా రాసే ప్రయత్నం చేస్తాను. కృతజ్ఞలతో – భండారు శ్రీనివాసరావు
రిప్లయితొలగించండి@డిస్నీలాండ్ లాటి కిటకిటలాడే టూరిస్ట్ కేంద్రాలలోలో సయితం వాళ్ళది ఇదే తీరు. తోసుకు పోవడం, రాసుకు తిరగడం వాళ్ళ దృష్టిలో అనాగరికం. క్యూలలో నిలబడేటప్పుడు కూడా ఒకరినొకరు తాకకుండా ఎడం వుండేలా చూసుకుంటారు. ఇతరులు కూడా తమ పట్ల ఇలాగే మసలుకోవాలని కోరుకుంటారు....
రిప్లయితొలగించండిశ్రద్దగా చదూతున్న నాకు ఈ వాక్యాలు చదవగానే నా మాటగా చెప్పాలనిపి౦చి౦ది..ఈ తోపుళ్ళు బాధ పడలేకనే నేను ఇష్ట దైవమయిన వె౦కన్నని చూడడ౦ కూడా మానుకున్నా ...రె౦డోది ..ఇలాగ పద్దతయిన వాళ్ళు కాబట్టే తెల్ల వాడన్నా ..అమెరికా అన్నా మన వాళ్ళకు ఒకరకమయిన...ఇది...