23, ఫిబ్రవరి 2010, మంగళవారం

Waah Akbar… Wah wa Akbar…! - bhandaru srinivasrao (iis)

Waah Akbar… Wah wa Akbar…! - bhandaru srinivasrao (iis)











One should appreciate the ‘guts’ of the MIM floor leader in the state legislative Assembly to declare openly his ‘support’ to those who are branded as “settlers’ by the Telangana Rashtra Samiti, who are fighting for separate statehood. His ‘courage’ and ‘commitment’ to ‘secularism’ abundantly paraded when he went to the extent of suggesting to the government on the floors of the House that anyone who held out threats against these ‘settlers’ may be treated under non-bailable offence.



The young legislator obviously peeved by the TRS and its T-Joint Action Committee members holding out threats against the people belonging to the other two regions during their agitations programmes, especially Rayalaseema and coastal Andhra. They term those who belonging to these regions were staying in Hyderabad for some reason or the other as ‘settlers’. The TRS main accusation is that these two region people have exploited Telanganites by making properties in-and-around Hyderabad.



On the other hand, they (Rayalaseema and Andhras) claim that they too did contribute for overall growth of historic Hyderabad from time immemorial. They feel uncomfortable for being called ‘settlers’ as majority of them might have migrated more than 2 to 3 decades ago. Though, the antecedents of even the TRS founder President K Chandrasekhara Rao and the Congress leader K Keshava Rao are believed to have roots in north coastal Andhra and one of the costal district, respectively.



With the movement for separate statehood turning more and more volatile with tempers too running high and all walks of people vertically getting divided, the T-JAC call for boycotting Andhra-made products is what more disturbing trend emerged out of the ongoing agitation. Should tempers run such high, when the Centre had taken the initiative to constitute a Committee headed by a retired Supreme Court judge, Justice Srikrishna, to begin the process? Can Andhras be considered as foreigners in their own land?



Article 3 of the Constitution clearly enshrines that the states were formed in 1956 under linguistic basis. A case is also pending in the Supreme Court regarding this challenging the Centre’s move for bifurcation of Andhra Pradesh. People of the other two regions are chanting ‘integration’ song, while the people of Telangana of ‘separatist’. And, the Centre had to elicit views of all sections in the society of the entire Andhra, if not three regions, and take a decision. Hence, it constituted the Committee. Considerable consensus should emerge before taking such major decision. To arrive at this, considerable time is required.



Today, people in the region may appear united on the issue. But, the fact remains that when had the opportunity to show this unity in democratic process, they apparently not done reasons best known to them. Not once, but twice or thrice since TRS was formed and fight their first electoral battle in 2004. TRS performance in all the elections held since then proved disastrous. What does it mean? If that is not the yardstick to be used to gauge and understand the mood of the people, what else has to be?



Even TRS leaders’ effort to build consensus among national parties indeed failed when the CPI-M turned down any more divisions in the country. Though the TDP had given a letter of support, today that party too vertically split into two groups and the one which extending ‘support’ for separate statehood, however, unwilling to sacrifice their assembly seats to bring pressure on the Centre. They show Congress as an excuse, to fall in line with TRS. Incidentally, the people of the two other regions – Andhra and Rayalaseema – were looking at TDP for help and protection to their properties in Hyderabad. Though, the TDP had promised support just before the civic polls, today, it remains non-commital in the wake of split in opinion of their own party members on bifurcation.



In this confused and helpless atmosphere, the MIM leader’s assurance undoubtedly has come as moral boost to those Andhra and Rayalaseema people residing in the city. Now they feel more than ‘secure’ .



Restraint is the need of the hour and no two groups should get emotionally surcharge creating lawless in the society. Let both the warring groups achieve their goals in more peaceful and democratic manner, instead of taking the violent path.



Telangana or no telangana, united state or devided one, commonman should not be put to inconvenience. He should be allowed to lead his life peacefully.

Let the socalled leaders lay down the their lives for the genuine cause, rather than provoking the innocent and future citizens of the nation. (23-02-2010)

NOTE: All the images in this blog are copy righted to their respective owners.

18, ఫిబ్రవరి 2010, గురువారం

ఎటు పోయాయ్‌ ఆ రోజులు? -భండారు శ్రీనివాసరావు



ఎటు పోయాయ్‌ ఆ రోజులు?  - భండారు శ్రీనివాసరావు


మా తాతగారి కాలం నాటికి మా వూళ్లో కరెంటు లేదు. ఆముదపు దీపాలు మినహా కరెంట్‌ బల్బ్ ని కూడా చూడకుండానే ఆయన కాలం చేశారు.
మా నాన్న గారి కాలం వచ్చేసరికి కరెంట్‌ రాలేదు కానీ రేడియోలు, గ్రామఫోన్లూ ఉండేవి.


 కాకపోతే ఆ రేడియోలు మోటారుకార్లలో వాడే పెద్దసైజు బ్యాటరీల సాయంతో పనిచేసేవి.
మా వూరి మొత్తం జనాభాలో ఆరోజుల్లో యాభయి మైళ్ల దూరంలో వున్న బెజవాడకి వెళ్లి, సినిమా చూసొచ్చిన పెద్దమనిషి ఆయన ఒక్కరే. ఆ మాటకి వస్తే ఆయన తప్ప రైలుని చూసిన వాళ్లు కానీ, బస్సు ఎక్కిన వాళ్లు కానీ, మా వూళ్లో ఎవరూ లేరని కూడా చెప్పుకునే వా ళ్లు.
ఇక మా అమ్మ-
కట్టెల పొయ్యి ముందు కూర్చుని - పొగచూరిన వంటింట్లో పదిమందికి వండి వార్చేది. ఆమె సామ్రాజ్యంలో రకరకాల పొయ్యిలు ఉండేవి. పాలు కాగబెట్టడానికి దాలిగుంట - కాఫీ కాచుకోవడానికి బొగ్గులకుంపటి, వంట చేయడానికి మూడు రాళ్ల పొయ్యి, ఇలా దేనికి దానికి విడివిడిగా ఉండేవి. ఇక పెరట్లో బావి ప్రక్కన స్నానాలకోసం కాగులో నీళ్లు  మరగపెట్టడానికి మరో పెద్ద పొయ్యి సరేసరి. దాలిగుంట విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వంటింటి వసారాలోనే ఓ మూలగా ఉండేది. నిప్పంటించిన పిడకలను ఆ దాలిగుంటలో దొంతరగావేసి పాలకుండని వాటిపై ఉంచి - పైన ఒక రాతిపలకని కప్పేవారు. సన్నటి సెగపై ఆ పాలు తీరిగ్గా కాగేవి. ఎరగ్రా కాగిన ఆ పాలపై - అరచేతి మందాన మీగడ కట్టేది. మర్నాడు - ఆ కుండలోని పెరుగుని నిలబడి వయ్యారంగా కవ్వంతో చిలికేవారు. మజ్జిగ నీటిపై తెట్టెలా కట్టిన తెల్లటి వెన్నని చేతుల్లోకి తీసుకుని, అరచేతిలో ఎగురవేస్తూ ముద్దగా చేసేవారు. పక్కన నిలబడి ఆశగా చూసే చిన్న పిల్లలకి చిన్న చిన్న వెన్న ముద్దలు పెట్టే వాళ్లు.  ఆహా ఏమి రుచి! అని లొట్టలు వేస్తూ తినేసి- ఆటల్లోకి జారుకునే వాళ్లు.   మగవాళ్ల సంగతేమో కానీ, ఆడవాళ్లకి ఆ రోజుల్లో చేతినిండా పనే. భోజనాలు కాగానే - అంట్లగిన్నెలు సర్దేసి - వంటిల్లు ఆవు పేడతో అలికేవారు. బాదం ఆకులతో విస్తళ్లు  కుట్టేవారు.  రోకళ్లతో వడ్లు దంచేవారు. ఇంటికి దక్షిణాన ఉన్న రోటిపై కూర్చుని పప్పు రుబ్బేవారు. ఈ పనులు చేయడానికి విడిగా పనిమనుషులు ఉన్నా వారితో కలిసి ఈ పనులన్నీ చేసేవారు. వాటితో పాటు శ్రమతెలియకుండా పాటలు పాడుకుండేవారు. విలువ కట్టని వారి శ్రమా, విలువ కోరని వారి నిబద్ధతా చిన్న నాటి జ్ఞాపకాల దొంతర్లలో పదిలంగా ఉండిపోయాయి.
ఇక మారోజులు వచ్చే సరికి - రోజులు పూర్తిగా మారిపోయాయి. కట్టెల పొయ్యిలు పోయి - గ్యాస్‌ స్టవ్‌లు వచ్చాయి. నీళ్ల కాగుల్ని బాయిలర్లు భర్తీ చేశాయి. కరెంట్‌ దీపాలు వచ్చి లాంతర్లని వెనక్కి నెట్టేశాయి. కరక్కాయ సిరాలు- పుల్ల కలాలు తరువాతి రోజుల్లో రూపాలు మార్చుకుని ఫౌంటెన్‌ పెన్నులుగా, బాల్‌పాయింట్‌ పెన్నులుగా అవతరించాయి. రూపాయికి పదహారణాలు అనే లెక్కకాస్తా మా చిన్నతనంలోనే నూరు నయాపైసలుగా మారిపోయింది. బేడలూ, అర్ధణాలూ, కాసులూ, చిల్లికాసులూ జేబుల్లోంచి జారిపోయి నిగనిగలాడే రాగి నయా పైసలు, నికెల్‌ నాణేలు చెలామణిలోకి వచ్చాయి. రామాయణ కాలంనుంచీ ఎరిగిన ఆమడలు, కోసులు, మైళ్లు  కాలగర్భంలో కలిసిపోయి, కిలోమీటర్‌ రాళ్లు  రోడ్లపై వెలిశాయి. ఏడాదికోమారు జరిగే తిరుణాళ్లు - నిత్యకృత్యంగా మారి - అశ్లీల నృత్యాల వేదికలుగా మారిపోతున్నాయి. కోలాటాలు, పందిరి నాటకాలు, హరికథలు, బురక్రథలు, పిట్టలదొర కథలు చరిత్రపుటల్లో చేరి కనుమరుగవుతున్నాయి.


ఆరోజుల్లో సెలవులు ఇస్తే చాలు - పిల్లలంతా పల్లెటూళ్లకి పరిగెత్తేవాళ్లు.  ఇన్ని రకాల ఆటలుంటాయా అనేట్టు అనేక రకాల ఆటలతో, పాటలతో కాలం గిర్రున తిరిగిపోయేది. అష్టాచెమ్మాలు, తొక్కుడు బిళ్లలు, వామన గుంటలు, వెన్నెలముద్దలు, వైకుంఠపాళీలు, పచ్చీసాటలు, చింతపిక్కలు, బావుల్లో ఈతలు, వాగు ఒడ్డున కబడ్డీ పోటీలు- ఒకటేమిటి - ఒక జీవితానికి సరిపడా ఆనందాన్ని గుండెల్లో నింపేసుకుని- ఇంకా ఇంకా ఇలాగే రోజుల్ని సరదాగా గడపాలన్న కోరికని మనసులోనే చంపేసుకుని - పాడు సెలవులు అప్పుడే అయిపోయాయా అని నిట్టూరుస్తూ బడిబాట పట్టేవాళ్లు.
ఇక మా పిల్లల కాలం వచ్చేసరికి - మాయాబజారు సినిమాలో మాదిరిగా - కళ్లముందు ప్రపంచం ఒక్క మారుగా మారిపోయింది. గతం తలచుకోవడానికే మిగిలింది. చిన్నతనంలో చూసినవేవీ - ఈనాడు కలికానికి కూడా కానరావడం లేదు. జీవితం, ఇంత చిన్నదా అనిపించేలా, విన్న పదాలు, చూసిన దృశ్యాలు - ఆడిన ఆటలు, పాడిన పాటలు - కనురెప్పలకిందే కరిగి పోతున్నాయి. జ్ఞాపకాల పొరల్లోకి జారిపోతున్నాయి.
ఆ గురుతుల దారుల్లో వెనక్కి వెడుతుంటే -
తెలతెలవారుతూనే బావి గట్టున చేదతో తోడుకుని చేసే స్నానాలు-


జొన్న చేల నడుమ కాలిబాటలో పరుచుకున్న దోసతీగెలూ-
లేత జొన్న కంకుల్ని వొడుపుగా కొట్టి తీసి వేయించిన ఊచ బియ్యం-
రోజూ తినే వరి అన్నానికి - ఎప్పుడో ఒకప్పుడు సెలవిచ్చేసి - పనివాళ్లు  వండిన జొన్నన్నంతో కూడిన మృష్టాన్న భోజనం-కళ్లాల„సమయంలో - కొత్త వడ్లు కొలిచి - కొనుక్కుతినే కట్టె మిఠాయి-
సాయంత్రం చీకటి పడేవేళకు - మైకులో ఊరంతా వినవచ్చే పంచాయితీ రేడియోలో సినిమా పాటలు-
వెన్నెల్లో ఆరుబయట నులకమంచాలపై పడుకుని ఊ కొడుతూ వినే అమ్మమ్మ కథలూ-
ఏవీ ! అవేవీ! ఎక్కడా కనబడవేం! ఇవన్నీ ఒక నాడు వున్నాయని అన్నా - కంప్యూటర్లతో ఒంటరిగా ఆడుకునే ఈనాటి పిల్లలు నమ్ముతారా? కళ్లతో చూసిందే నమ్ముతాం అని వాళ్లంటే మీరేం చేస్తారు?
(16 -7- 2008)

NOTE: All the images in this blog are copy righted to their respective owners.

17, ఫిబ్రవరి 2010, బుధవారం

TDP’s hypocrisy exposed! - Bhandaru Srinivasrao

TDP’s hypocrisy exposed!




Telugu Desam Party MPs and MLAs belonging to Telangana region’s decision to link their resignations with the ruling Congress members over ‘bifurcation’ of state issue not only sounds ‘funny’ and ‘ridiculous’ and exposes its dual policy and hypocrisy.



In fact, Telugu Desam party was born only to enhance the pride of Telugus world over. The man who fathered the party, N T Rama Rao, indeed accomplished his dream as the hitherto “Madrasi” tag to Telugus among north Indians was permanently detached. Yet, for political compulsion, the party might have voiced its concern to the bifurcation issue, but never willing to be sincere.

This is clearly evident from its recent decisions. After fighting the 2009 general elections under the banner of “Mahakutami” along with separatist Telangna Rashtra Samiti, later parted ways after benefiting winning 39 seats of its 50-odd contested. On the other hand, the TRS, which had won 27 in 2004 elections combining with Congress, could end up winning just 10 out of 40-odd it contested. These results clearly exhibits that there was no uniformity in the so called ‘Telangana sentiment” and had it been there, the people of their region could have voted enthusiastically to either TRS per se or to “Mahakutami.’

Here political analysts may argue that since the Congress had also promised to ‘look into’ the ‘bifurcation’ issue had made voters of the region to side with the ruling party and help them win 56 seats of the total 119. Yet, it holds no water, as the 2009 elections, I personally as a political analyst, feel was ‘positive vote’ in favor of the ruling Congress under Y S Rajasekhara Reddy’s stewardship, pushing other contentious issues, including separate Telangana to backdrop. That’s why the Telanganites voted enthusiastically in favor of Congress and never got attracted to the provocative statements of TRS leader K Chandrasekhara Rao. This pattern of voting was even witnessed after the party split, and the reduced 17-member KCR’s TRS forced by-elections and could retain just four or six.

Thus far, the so called ‘sentiment’ prevalence had not really reflected in the voting pattern. But, today, the scenario might have changed drastically for variety of reasons. People, cutting across their professions and practices, might have divided vertically and vociferously spearheading their agitations in favor of separate statehood. But, will they show same unity, in case of by elections, if they were forced? This is the million dollar question and none are willing to discuss.

As it is the Telangana JAC, which was formed by voluntary organizations and forums, besides roping in all major political parties of the region into it, today looks seized to exist. Fearing to face the wrath of party high command, the Congress MLAs walked out of JAC. The TRS, which in fact was born to fight for separate statehood and take the fight to its logical conclusion, had taken the decision to resign and they did precisely what they had been promising. So were others, one of the two BJP members and one of the two PRP members. Though two of the Congress legislators submitted their resignation, the Speaker is yet to accept hoping they may relent after following the party high command’s diktat.

Contrary to this, the Telugu Desam, which forms second largest party in T-JAC, decided to submit their resignations of 39 MLAs to JAC Convenor, Prof Kodandaram, rather than hand them over to the Assembly Speaker. Even their handing over of resignation was with a rider – i.e., provided 35-40 Congress MLAs too give their resignation letters. The TDP members argue that by resigning 40 or 50 MLAs from the region cannot create Constitutional crisis, as the government had the option to hold by-elections. It argues that unless majority of the 119 (at least 100) resign, then the Centre will have no other option, but to concede the separatists demand. Though their argument has some logic, yet their sincerity and earlier commitment got exposed.

Even the TRS leader finds fault with TDP for backing out as it feels, rightly so, if the entire Opposition resigns, the Congress members of the ruling party bound to get exposed. KCR is also confident Congress legislators facing the wrath of their constituents, if they relent. That the Congress members are being caught between ‘devil and deep sea’ kind situation is understandable. And the TRS strategy is to yet again prove the Congress as the ‘real Villain’ and solicit the other Opposition members’ support.

Contrary to this, the TDP member’s fear, if they too resign and the determined Congress which chose to order (read recommend) by-elections, then they may land in soup. Can they retain all their seats? Or face the same fate that of the TRS in the past, losing few even to the Congress?

I, for one, continue to ponder, whether the voting pattern too will be on ‘sentiment’, rather than other local and personalized issues like ‘caste’, ‘party’ and ‘individual’ factors?

In other words, the TDP too caught in identical situation like its arch-rivals Congress, though in a different format. Yet, what it failed to understand is that its ‘rigid’ stand linking with Cong got ‘exposed’. Its dual policy may as well do more harm than good to the party in coming days. (17-02-2010)

NOTE: All the images in this blog are copy righted to their respective owners.

11, ఫిబ్రవరి 2010, గురువారం

ఏరీ! వారేరీ! కనరారే! - భండారు శ్రీనివాసరావు

ఏరీ! వారేరీ! కనరారే! - భండారు శ్రీనివాసరావు



ఆ దృశ్యం చాలా అపురూపం. చూడ ముచ్చటగా వుంది. సెల్ ఫోన్లో ఫోటో తీసి శాశ్వితంగా భద్రపరచుకోవాలనిమనసులో గట్టిగా అనిపించి కూడా  కూడా సభ్యత కాదని తమాయించుకున్నవారు ఎంతోమంది.

అందులోకనబడుతున్నవారందరూ పెద్ద వాళ్లే! ఆరేడుపదుల వయస్సు పైబడ్డ వాళ్లే!

చేతికర్ర ఊతంతో కొందరు-

భార్య భుజం ఆసరాతో మరి కొందరు-

మొగుడిచేయి పట్టుకుని ఇంకొందరు-

'రంగుల' మాయా బజార్ ఆడుతున్న అదునాతన థియేటర్ కాంప్లెక్స్ లో

నెమ్మదిగా పైపైకి పాకుతున్న ఎస్కలేటర్ పై నిలుచుని వెడుతున్నదృశ్యం 'జగన్మోహనంగా' గోచరించింది.

జీవన పధంలో మూడు వంతులకు పైగా నడిచివచ్చిన ఆ ముదివగ్గులందరూ - గతంలోని మధురిమను మరోసారి మనసారా నెమరు వేసుకోవాలని వచ్చిన వారిలా కానవచ్చారు.

వీళ్ళల్లో కొందరయినా- .

బళ్ళు కట్టుకుని పోరుగునవున్న బస్తీకి పోయి - మూడు నాలుగు ఇంటర్వెల్స్ తో టూరింగ్ టాకీస్ లో ఆ సినిమా చూసివుంటారు.

లేదా సినిమా చూడమని అమ్మా నాన్నా ఇచ్చిన అర్ధ రూపాయిలో ఒక బేడానో, పావులానో పెట్టి ముంతకింద పప్పుకొనుక్కొని, గోలీ సోడా తాగి నేల టిక్కెట్టుతో సరిపెట్టుకున్న వాళ్ళుంటారు.

బెజవాడ దుర్గా కళా మందిరంలో మేడ మీద గోడను ఆనుకుని నిర్మించిన పరిమిత సీట్ల చిన్న బాల్కానీలో దర్జాగా కూర్చుని చూసినవాళ్ళు వుండివుంటారు.

మొదటిసారి వచ్చినప్పుడు, రావడం ఆలస్యమై చిన్న శశిరేఖమ్మ పాట చూడలేకపోయినవాళ్ళు - మరునాడు ముందుగా వచ్చేసి ఆట మొదటినుంచీ చూసినవాళ్ళు వుండేవుంటారు.

సినిమాలు ఇలా కూడా తీస్తారా అని బోలెడు బోలెడు ఆశ్చర్య పోతూ మళ్ళీ మళ్ళీ చూసినవాళ్ళు తప్పకుండా వుంటారు.

అందుకే ఈ రోజున ఆ సినిమా మళ్ళీ చూస్తూ ఆ నాటి సంగతులను గుర్తుకు తెచ్చుకునే వుంటారు.

పెద్ద తెరపై, స్టీరియో ఫోనిక్ సౌండ్ సిస్టం తో, సినిమాస్కోప్ లో 'విజయా వారి' హనుమ కేతనం హోరున ఎగురుతుంటే కళ్ళార్పకుండా ఒక పక్క చూస్తూనే మరో పక్క తమ మనోఫలకాలపై పాత జ్ఞాపకాలను 'రీవైండ్' చేసుకునే వుంటారు.
 అందుకే అంత నిశ్శబ్దంగా వున్న హాలులో అన్ని గుసగుసలు. అన్ని ధ్వనులు చెలరేగుతున్న థియేటర్ లో ముందుకు ముందే వినబడుతున్న డైలాగులు. నటులు నోరు తెరవకముందే వాళ్ళు ఏమంటారో ముందే ప్రేక్షకులు అనేస్తుంటారు.  చిన్న చిన్న సంభాషణలలో యెంత పెద్ద అర్ధం దాగునివుందో పక్కవారికి చెప్పేస్తుంటారు. పాటలు వస్తూనే గొంతు కలిపి పాడుతుంటారు. జరగబోయేది చెప్పేస్తుంటారు. వినే వాళ్లకి కూడా అంతా తెలిసే వింటుంటారు. ఆహా ఓహో అని ముక్తాయింపు ఇస్తుంటారు. హోల్ మొత్తం హాలంతా ఇదే తంతు. ఎవరూ విసుక్కునే వాళ్ళుండరు. ఎందుకంటె అందరిదీ ఇదే వరస.

వున్నట్టుండి, కనీకనబడకుండా, లైట్లు వెలుగుతాయి.  అప్పుడే ఇంటర్వెల్లా! అని చూస్తే- ఆ వేళ కాని వేళలో , సంధ్యాసమయంలో 'వర్కింగ్ డే' రోజునవేసిన ఆ ఆటకు హాలు మూడువంతులు నిండి పోయి వుంటుంది.   కానీ ఆ సంతోషం వెంటనే ఆవిరి అయిపోతుంది. అవును!  ఈ సినిమా తప్పకుండా చూడాల్సిన చిన్నారులేరీ! ఏరీ! వారేరీ! కనబడరేమీ!

బహుశా పరీక్షల రోజులేమో! సినిమాకు తీసుకురావాల్సిన తలిదండ్రులకు తీరుబడి దొరకలేదేమో. మరో రోజు చూపిస్తారేమో. అని మనసు మూలల్లో ఎక్కడో ఒక చిన్న ఆశ.

'వుయ్ డోంట్ లైక్ టెల్గూ మూవీస్ ఎటాల్!' అంటున్న ఈనాటి తెలుగు యువతరానికి- 'మనమూ గొప్ప చిత్రాలు తీయగలం - కాదు, కాదు ఎప్పుడో చిన్నప్పుడే తీసేసాం' అని చాటి చెప్పుకోవడానికైనా - ఈ సినిమా చూపిస్తే యెంత బాగుంటుందో కదా!.

(09-02-2010)

NOTE: All the images in this blog are copy righted to their respective owners.

రోశయ్యగారికి కోపమొచ్చింది -భండారు శ్రీనివాసరావు

రోశయ్యగారికి కోపమొచ్చింది -భండారు శ్రీనివాసరావు




-

ముఖ్యమంత్రి పదవి రోశయ్య గారికి కోరుకుంటే వచ్చింది కాదు. ఆ మాటకి వస్తే ఆయన కోరుకున్నదీ లేదు. ఈ పదవిని కోరుకునేవారు, కోరుకున్నవారు ఎంతోమంది ఉన్నప్పటికీ - అదే వెతుక్కుంటూ వచ్చి ఆయన్ని వరించిందంటే సబబుగా ఉంటుందేమో. అందుకే, ఆరు నెలలు గడిచిన తరవాత కూడా ఆయన దాని మీద మమకారం పెంచుకున్న దాఖలాలు సయితం లేవు.

ఈ పదవి శాశ్వితం కాదని - అధిష్టానం ఆదేశిస్తే అరక్షణం కూడా ఆలస్యం చేయకుండా తప్పుకుంటాననీ గతంలో ఆయనే స్వయంగా అనేక పర్యాయాలు బాహాటంగా ప్రకటించారు. ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచే నీడలా వెంటపడి వచ్చే 'హంగూ ఆర్భాటాలను' సయితం ఆయన చాలా రోజులు దూరం పెట్టారు. అంతేకాదు, లోగడ రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ ముఖ్యమంత్రులు పాటిస్తూ వచ్చిన సంప్రదాయానికి విరుద్ధంగా - పదవిని స్వీకరించిన వెంటనే డిల్లీ విమానం ఎక్కని 'అరుదయిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి' అనే రికార్డ్ కూడా ఆయన ఖాతాలో చేరింది. ఇంకా చెప్పాలంటే, కొరకరాని కొయ్య అని పేరుగాంచిన 'పోలీసు బాసు'ని రాత్రికి రాత్రే మార్చేసారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు, అంతకుముందు కొందరు కాంగ్రెస్ ముఖ్యమంత్రులతోను అతి సన్నిహితంగా పనిచేసిన అధికారిని కేవలం సమర్ధత పాతిపదికపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించగలిగారు. అనేక జిల్లాలలో కలెక్టర్లను, ఎస్పీలను బదిలీ చేశారు. ఇంతకాలం రాజకీయ పార్టీలు అన్నింటికీ 'వోట్ల వనరు'గా ఉంటూ వస్తున్న తెల్ల రేషన్ కార్డుల ప్రక్షాళనకు సయితం నడుం కట్టారు.జనాకర్షక పధకాలలోని ఆర్దికపరమయిన మంచి చెడుల పట్ల దృష్టి సారించారు. ఆపద్ధర్మ ముఖ్య మంత్రి అని అందరూ అంటున్న వేళ - ' ఆంధ్ర ప్రదేశ్ కు ఇక రోశయ్యే ముఖ్య మంత్రి' అంటూ అధిష్టానం చేత ఆమోద ముద్ర వేయించుకుని- ఇన్ని చేసినా, చేస్తున్నా 'అసమర్ధ ముఖ్యమంత్రి' అన్న ముద్ర నుంచి తప్పించుకోలేకపోతున్నారు.

కీర్తిశేషులు సంజీవ రెడ్డి, బ్రహ్మానంద రెడ్డి, ఆచార్య రంగా వంటి ఉద్దండ రాజకీయ నేతలతో సాహచర్యం చేసి, రాజశేఖరరెడ్డి వంటి యువతరం నాయకులతో కలసి మెలిసి పని చేసి- అనేక సంవత్సరాలపాటు వివిధ మంత్రిత్వ శాఖలకు సారధ్యం వహించి, సర్వం వ్యాపారపరమయిన ప్రస్తుత రాజకీయరంగంలో ఇక ఇమడ లేనని తెలుసుకుని, ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేసే వయసే కాదు, 'శక్తులూ యుక్తులూ' లేవని తెలుసుకుని తనకు తానుగా తప్పుకున్న తత్వం రోశయ్య గారిది. ఇంత సుదీర్ఘ కాలంనుంచీ రాజకీయ జీవితం గడుపుతున్నా అవినీతి ఆరోపణల మరక పడని నిబద్ధత ఆయనది.

ఆరుమాసాల క్రితం,

ఒక పెనువిషాదం రాష్ట్రాన్ని కమ్ముకున్న దురదృష్ట సమయంలో,

మేరు పర్వతం లాంటి ఒక నాయకుడిని రాష్ట్ర కాంగ్రెస్ కోల్పోయిన విపత్కర తరుణంలో,

రోశయ్య గారు ముఖ్య మంత్రి అయ్యారు.

అప్పటినుంచి ఇప్పటిదాకా ఆయన ప్రశాంతంగా గడిపిన సమయం బహు తక్కువ. ఒక దానివెంట మరొకటి చొప్పున సమస్యలు వరదల్లా వెల్లువెత్తాయి. సంబంధం వున్నవాటికీ, లేనివాటికీ ఆయన పరిష్కారాలు చూపలేకపోతున్నారన్న నిష్కారణ విమర్శలు ముంచెత్తాయి. అయినదానికీ, కానిదానికీ ఆయన సమర్ధతతో ముడిపెడుతూ టీవీల్లో చర్చోపచర్చలు సాగాయి. సాగుతున్నాయి.

ఆంద్ర ప్రదేశ్ వంటి అతి ముఖ్యమయిన రాష్ట్రానికి ముఖ్య మంత్రిగా వుండడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అందరి కళ్ళు నిశితంగా గమనిస్తుంటాయి. రాజకీయ లబ్దినీ, రాజకీయుల ద్వారా లబ్దినీ పొందాలనిచూసే శక్తుల 'శక్తియుక్తులు' అన్నీ ముఖ్యమంత్రి పీఠం చుట్టూనే పరిభ్రమిస్తుంటాయి.ఈ రకమయిన కుయుక్తి రాజకీయాలు నడిపే శక్తుల స్తాయినీ, స్తోమతనీ, సామర్ధ్యాన్నీ తక్కువగా అంచనా వేయడానికి వీలులేదు. యెంతో అనుభవాన్ని తనలో దాచుకున్న రోశయ్య గారు కూడా ఈ విషయంలో పొరబడుతారని అనుకోవడానికి ఆస్కారం లేదు.

రోశయ్య గారు ముఖ్యమంత్రి అయినప్పుడు - తలలు పండిన రాజకీయ విశ్లేషకులు కూడా ఆయన్ని 'రోజులు-వారాల ముఖ్యమంత్రి' గానే లెక్కవేశారు. అతి తక్కువ కాలం ముఖ్యమంత్రి అన్న అరుదయిన రికార్డుని సొంతం చేసుకుంటారన్న అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆయన ఆరుమాసాల కాలాన్ని యిట్టె అధిగమించారు. తాత్కాలిక ప్రాతిపదికపైన శాశ్వితంగా కొనసాగే వీలుచాళ్ళు కానరావడంతో ముప్పేట దాడులు మొదలయ్యాయి. బయటి పోరుకు ఇంటిపోరు తోడయింది. రాజకీయ సన్యాసం తీసుకుందామనుకున్న పెద్దమనిషికి ప్రాంతీయతత్వం అంటగట్టే స్తాయికి ఆరోపణలు చెలరేగుతున్నాయి.

యెంత సంయమనశీలికయినా మనస్తాపం కలిగించే వ్యాఖ్యలు.

యెంత నిబ్బరం కలిగిన వ్యక్తికయినా కంపరం కలిగించే ప్రవర్తనలు.

ఈనాటి రాజకీయాల్లో ముఖ్య మంత్రి పదవికి హోదా వుండవచ్చేమో కానీ గౌరవం వున్నట్టు కానరావడం లేదు. పోనీ, ఆయన వయస్సును బట్టి అయినా, పెద్దరికాన్ని చూసి అయినా - ఇవ్వాల్సిన మర్యాద ఇస్తున్నట్టుగా కనిపించడం లేదు. అందుకే, అనుభవం ఎంతగా అడ్డుకుంటున్నా ఒక్కోసారి ఆయన ఆగ్రహాన్ని అణచుకోలేకపోతున్నారు. మనస్తాపానికి గురికాకుండా వుండలేకపోతున్నారు. అయినా వెంటనే సర్దుకుని పెద్దమనసుతో సర్దుకుపోతున్నారు. ఈ వయస్సులో ముఖ్యమంత్రి కావడం అన్నది ఆయనకున్న అనుభవానికి, సీనియారిటీకి దక్కాల్సిన గౌరవమే అయినప్పటికీ - అది సరయిన పద్ధతిలో దక్కడంలేదన్నదే ఆలోచించుకోవాల్సిన అంశం. పరిశుద్ధ రాజకీయాలు కోరుకునేవారందరూ పరిశీలించుకోవాల్సిన తరుణం.

-భండారు శ్రీనివాసరావు

11-02-2010

NOTE: All the images in this blog are copy righted to their respective owners.

3, ఫిబ్రవరి 2010, బుధవారం

మార్పు చూసిన కళ్ళు (అలనాటి మాస్కోలో మా అనుభవాలు-పదిహేడో భాగం)- భండారు శ్రీనివాసరావు








లక్ష రూపాయల పాల సీసా

1987  నుంచి దాదాపు అయిదేళ్లపాటు మాస్కోలో 'పిల్ల జమీందారు' లాగా వెలిగిన నా జర్నలిస్టు జీవితం  1971  ఆగష్టులో విజయవాడ ఆంద్ర జ్యోతిలో మొదలయింది.


 అసందర్భంగా అనిపించినా మాస్కో జీవితం గురించి రాస్తున్నప్పుడు ఆ నాటి రోజులను కూడా నెమరు వేసుకోవడం తప్పనిసరి అని అనుకుంటున్నాను. అప్పుడు నా నెల జీతం యాభయి రూపాయలతో ఆరంభమయి వంద రూపాయలకు పెరిగి- 1975  లో జ్యోతిని వొదిలిపెట్టేనాటికి నూట యాభయి రూపాయలకు చేరింది. జీతానికీ, జీవితానికీ పొంతన లేని రోజుల్లో- మా పెద్ద పిల్లవాడికి పాలపొడి టిన్నులు కొనడం అనేది గగనంగా వుండేది. ఆ గడ్డు రోజుల్లో ఒక రోజు రామారావనే ఆర్టిస్ట్ మా ఇంటికి వచ్చాడు. నా స్నేహితుడయిన లాల్ మోహన్ అనే మరో ఆర్టిస్ట్ అతడిని నాకు పరిచయం చేసాడు.ఒక విషయంలో నా సాయం కోరుతూ అతడు నా వెంట తిరుగుతున్నాడు. చెప్పాపెట్టకుండా అతడు రావడం నాకూ మా ఆవిడకూ ఆ క్షణంలో అంత బాగా అనిపించలేదు.  అతడు వచ్చిన సమయంలో మేమొక గడ్డు సమస్యతో కొట్టుమిట్టాడుతున్నాము. పిల్లవాడికి పాలు పట్టాల్సిన సీసా కడుగుతుంటే పగిలిపోయింది. రూపాయి ఖరీదు చేసే ఆ సీసా కొనడానికి ఇల్లు మొత్తం గాలించినా యెర్ర ఏగాని దొరకలేదు. పిల్లవాడేమో ఒక పక్క గుక్క పట్టి ఏడుస్తున్నాడు. ఈ సీను చూసి అతడు వెళ్ళిపోయాడు. అమ్మయ్య వెళ్ళాడు కదా అని అనుకునేంతలో మళ్ళీ తిరిగి వచ్చాడు.ఆ వచ్చిన అతడి చేతిలో పాల సీసా కనబడగానే దేవుడే దిగివచ్చాడనిపించింది. పాల సీసా వెల తక్కువే కావచ్చు. కానీ ఆ క్షణంలో - దానికి ఖరీదు కట్టగల షరాబు లేడనిపించింది.
_---------------------------------------------------------------------------------------------------------_


2, ఫిబ్రవరి 2010, మంగళవారం

మార్పు చూసిన కళ్ళు (అలనాటి మా మాస్కో అనుభవాలు - పదహారో భాగం) - భండారు శ్రీనివాస రావు






మా ఇంటికి పెద్ద దూరం కాదు కానీ, ఒక మోస్తరు దూరంలో 'రష్యన్ సర్కస్' వుంది. కానీ టికెట్స్ దొరకడం చాలా కష్టం. దాన్ని చూడాలంటే కనీసం మూడు నెలలముందు నుంచే ప్రయత్నం ప్రారంభించాలి. అయితే మాస్కో రేడియోలో పనిచేస్తున్న విదేశీయులకోసం ఒక సౌలభ్యం వుంది. ఎన్ని టిక్కెట్లు కావాలో తెలియచేస్తే వాళ్లే తెప్పించి పెడతారు. అల్లా ఒకరోజు రష్యన్ సర్కస్ చూసే అవకాశం లభించింది.

రష్యన్ సంస్కృతిలో ఒక భాగంగా మారిపోయిన రష్యన్ సర్కస్ -కేధరిన్ ది గ్రేట్ - కాలం నుంచే వుంది. ఇంగ్లీష్ భాష తెలియని రష్యాలో - రష్యన్ సర్కస్ ఆవిర్భావానికి  ఒక ఇంగ్లీష్ పౌరుడే కొంత మేరకు దోహద పడడం ఒక విశేషం. చార్లెస్ హగెస్ అనే ఆంగ్లేయుడు - కేధరిన్ ది గ్రేట్ క్వీన్  రాణి గారి సమక్షంలో ఒక చక్కని ప్రదర్సన ఇచ్చాడట. దాంతో ముచ్చట పడిపోయిన రాణి గారు- అతగాడికోసం రెండు సర్కస్ డేరాలు నిర్మించి ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారట. రాణి తలచుకుంటే డేరాలకు కొదవేముంది. అతడికోసం సెంట్ పీటర్స్ బర్గ్ - కమ్యూనిస్టుల ఏలుబడిలో 'లెనిన్ గ్రాడ్' గా పేరుమార్చుకుని - మళ్ళీ తదనంతర కాలంలో తిరిగి సెంట్ పీటర్స్ బర్గ్ అన్న పాత పేరుకు మారిన నగరంలో - సర్కస్ డేరాలు నిర్మించి పెట్టారు. కొన్నేళ్ళ తరవాత ఆ ఇంగ్లీష్ దొరవారు ఇంగ్లాండ్ కు వెళ్ళిపోయాడు కానీ అతడి బృందంలోని సభ్యులు మాత్రం రష్యన్ల ఆదరాభిమానాలకు కట్టుబడిపోయి ఆ దేశంలోనే వుండిపోయారు. అలా చిగురించిన రష్యన్ సర్కస్ వట వృక్షం మాదిరిగా విస్తరించి సోవియట్ల కాలంలో ఖండాంతర ఖ్యాతిని సముపార్జించుకుంది. తొంభయ్యవ దశకం దాకా ఒక వెలుగు వెలిగి - ఇటీవలనే తన నూట యిరయవ్వవ వార్షికోత్సవం కూడా జరుపుకుంది.



గ్రేట్ మాస్కో స్టేట్ సర్కస్ ని 1971  లో మాస్కోలోని వేర్నాద్ స్కీ ప్రాస్పెక్ట్ లో ప్రారంభించారు. 3400 మంది వసతిగా కూర్చుని తిలకించగల విశాలమయిన ఎయిర్ కండిషన్ డేరాను నిర్మించారు. దీని ఎత్తు 36 మీటర్లు. ఇందులో అయిదు ఎరీనాలు వున్నాయి. సర్కస్ జరిగే ప్రధాన వేదికకు 18 మీటర్లు దిగువన వీటిని ఏర్పాటు చేశారు. అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి - ఈ ఎరీనాలు ఒక దాని వెంట మరొకటి పైకి వస్తాయి. అందువల్ల అట్టే వ్యవధానం లేకుండా - రంగ స్తలాల రూపురేఖలు వాటంతట అవే మారిపోతుంటాయి. మన వైపు సురభి కంపెని నాటక ప్రదర్శనల మాదిరిగా.


రష్యన్ సర్కస్ చూడకుండానే ఇండియాకు తిరిగివచ్చేస్తామేమో అన్న బెంగ ఆవిధంగా తీరిపోయింది. సర్కస్ నుంచి తిరిగివస్తుంటే దోవలో ఒక సినిమా హాలు కనబడింది. టికెట్ లు కొనుక్కుని లోపలకు వెళ్లి చూద్దుము కదా - అది మన శంకరాభరణం.


 పాటలన్నిటినీ యధాతధంగా తెలుగులో ఉంచేసి, సంభాషణలను మాత్రం రష్యన్ లోకి డబ్ చేశారు. 'ఆకలేసిన బిడ్డ అమ్మా అని ఒకరకంగా అంటుంది ...' అంటూ శంకరాభరణం శంకర శాస్త్రి (సోమయాజులు గారి) నోట రష్యన్ పలుకులు వినబడుతుంటే చెప్పరాని ఆనందం వేసింది. రష్యాలో డబ్బింగ్ పట్ల యెంత శ్రద్ధ తీసుకుంటారో ఈ సినిమా చూస్తె తెలుస్తుంది. తెలుగు శంకరాభరణం సినిమా లో నటించిన నటీ నటుల గాత్రానికి తగిన స్వరం కలిగిన డబ్బింగ్ కళాకారులనే ఎంపిక చేయడం వల్ల- సోమయాజులు గారు, ఆ సినిమా లో నటించిన తదితరులు అచ్చు రష్యన్ లో మాట్లాడుతున్నారా అన్న అనుభూతి కలిగింది.

 సినిమా చూసి ఇంటికి రాగానే మద్రాసులో వున్న నా క్లాసుమేటు, ఆ చిత్రానికి సంభాషణలు రాసిన జంధ్యాలకు ఫోన్ చేసి చెప్పేవరకు ఉగ్గబట్టుకోలేక పోయాను.ఒకే రోజున అయాచితంగా లభించిన ఈ రెండు అవకాశాలు మా మాస్కో జీవితంలో మరచిపోలేని మధుర అనుభవాలు.

(రాజీవ్ గాంధీని తలచుకుంటూ కంట తడిపెట్టిన రష్యన్ వృద్ధ మహిళ గురించి ఇంకోసారి)

NOTE: All the images in this blog are copy righted to their respective owners.

1, ఫిబ్రవరి 2010, సోమవారం

అమెరికా అనుభవాలు - భండారు శ్రీనివాసరావు





అమెరికా అనుభవాలు 
- భండారు శ్రీనివాసరావు
  (ఇంకావుంది) 




NOTE: All the images in this blog are copy righted to their respective owners.