డెబ్బయి ఎనిమిది దాటి, రేపోమాపో డెబ్బయి తొమ్మిదిలోకి అడుగుడే నాకు ఇది నిజంగా కలిసివచ్చిన అదృష్టం అనుకోవాలి.
నాకు ఇద్దరు మగపిల్లలే. కన్యాదాన ఫలం దక్కే అవకాశం లేని నాకు, మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారు, వదిన సరోజిని దేవి మూడో అమ్మాయి వివాహం అప్పుడు నాకూ, మా ఆవిడకూ లేని, రాని ఆ అదృష్టాన్ని కలిగించించి, మా చేతులమీదుగా వాణిని కన్యాదానం చేసే మహత్తర అవకాశం ఇచ్చారు.
అలాగే ఇప్పుడు మా రెండో అన్నయ్య రామచంద్ర రావు, విమలాదేవి గార్ల రెండో కుమారుడు సుభాష్ చంద్రబోస్, భార్య హేమ, మంచిమనసుతో మళ్ళీ అటువంటి గొప్ప అవకాశం కల్పించారు. వాడి పెద్ద బిడ్డ శిఖిర వివాహం ఈ నెల 25/26 న హైదరాబాదులో జరుగబోతోంది. ఈరోజు ఆ అమ్మాయిని పెళ్లి కూతురిని చేశారు. మా రెండో కుమారుడు సంతోష్, నిశా దంపతుల ఏకైక కుమార్తె , వచ్చే నెల ఐదో తేదీన మూడో ఏట అడుగుపెట్టబోతున్న చిన్నారి జీవికను తోడు పెళ్లి కూతురిగా కూర్చోబెట్టి అలంకారం చేశారు. మరో పాతిక ఏళ్ళకు పెళ్లి కూతురుగా పెళ్లి పీటలమీద జీవికని చూసే అవకాశం నాకు ఎట్లాగూ వుండదు.
ఆ మహద్భాగ్యాన్ని నాకు కల్పించిన మా అన్నయ్యకు, సుభాష్, హేమ దంపతులకు నా హృదయ పూర్వక కృతజ్ఞతలు.
కింద ఫోటో:
22-12-2024
మీరు జంధ్యాల గారు క్లాసు మేట్లు బెంచీ మేట్లు అని వ్రాశారు మీరు. ఆయన dob 14-1-1951 అని ఉంది. అంటే ఇప్పుడు 74 అవుతుంది. మీరు 79 లోకి వస్తున్నారు. అంత వ్యత్యాసం ఎలా ఉంటుంది.
రిప్లయితొలగించండిఅజ్ఞాత గారు మీరు ఈ సిరీస్ లో చాలా పాత ఎపిసోడ్స్ తిరగేస్తే కానీ ఈ ప్రశ్నకు జవాబు దొరకదు. స్కూల్లో మా ఆవిడ కూడా ఆయనకు క్లాస్ మేట్. నా చదువు అలా సాగింది.
రిప్లయితొలగించండి