3, ఆగస్టు 2024, శనివారం

Licking of Worry

 
నాకు ఇంగ్లీష్ గొప్పగా రాదు అని తెలుసు కానీ, అమెరికాలో నా మేనల్లుడు రామచంద్రం కుమారుడు కాశ్యప్ కలిసి చెప్పేవరకు నా ఇంగ్లీష్ నాలెడ్జ్ ఇంత గొప్పగా వుంది అని నాకు తెలవదు.
' మామయ్యా! (నిజానికి తాత వరస, ఏదో మర్యాద కోసం మామయ్య అంటుంటారు) నేను నీ ఫేస్ బుక్ ఫాలోవర్ ను '
నేను గర్వంగా తల ఎగరేసే లోగా వాక్యం పూర్తి చేశాడు ఇలా.
' నువ్వు రాసిన Licking of worry పోస్టు చదివాను '
పైకి లేస్తున్న నా తల నేలకు వాలిపోయింది, నేను ఇంత దరిద్రపు అర్థం పర్థం లేని ఇంగ్లీష్ ఎలా రాయగలిగాను అనే ఆలోచనతో తల బద్దలు కొట్టుకున్నాక అసలు విషయం బోధపడి నవ్వుకున్నాము.
నేను ఆ పోస్టుకు పెట్టిన శీర్షిక 'నాకేల చింత? '
గూగులమ్మ ఎంచక్కా '' అనే పదాన్ని 'నాకడం' అనే  కోణంలో అర్థం చేసుకుని, 'Licking of Worry ' అనే సరి కొత్త అనువాదాన్ని పరిచయం చేసింది. 
మాయా బజార్ సినిమాలో పింగళి గారి డైలాగ్ గుర్తుకు వచ్చింది.
కొత్త పదాలు, కొత్త భాషలు ఇలాగే పుడతాయి కాబోలు.
అంచేత మీలో ఎవ్వరికైనా నా పోస్టులు ఇలా ఇంగ్లీషు లో కనబడితే, అంత ఆంగ్ల భాషా ప్రావీణ్యం నాకు లేదని అర్థం చేసుకోమని నా మనవి. అలాగే, See Original ద్వారా  తెలుగులో నేను రాసిన అసలు పోస్టు చదువుకోవచ్చని ఇప్పుడే కలిగిన అవగాహనను మీతో పంచుకుంటున్నాను.

2 కామెంట్‌లు:

  1. ఆగష్టు మాసానికి ప్రత్యేకత ఒకటి ఉంది... ఈ నెల 29 తారీఖు నుండి 'మాలిక' ఎడమవైపు బిగుసుకుంది..
    నా బ్లాగు కూడా అందులో ఇరుక్కుపోయింది...

    రిప్లయితొలగించండి